E-Paper
Advertisement

భారత్‌ లో ఈవీ బైక్‌ల జోరు.. త్వరలో మార్కెట్‌ లోకి అడుగు పెట్టనున్న 5 మోడళ్లు ఇవే!

భారత్‌ లో ఈవీ బైక్‌ల జోరు.. త్వరలో మార్కెట్‌ లోకి అడుగు పెట్టనున్న 5 మోడళ్లు ఇవే!
Advertisement

Upcoming Electric Motorcycles in India: దేశంలో ఎలక్ట్రిక్  టూ వీలర్స్ మార్కెట్ వేగంగా పెరుగుతోంది. ప్రస్తుతం ఈ సెగ్మెంట్ లో ఎక్కువ అమ్మకాలు ఎలక్ట్రిక్ స్కూటర్లవే అయినప్పటికీ, రాబోయే రెండేళ్లలో పరిస్థితి మారే అవకాశం కనిపిస్తోంది. టాప్ బ్రాండ్స్ కొత్త ఎలక్ట్రిక్ బైకులను మార్కెట్లోకి తీసుకురావడానికి సిద్ధమవుతున్నాయి. 2026-27లో భారత మార్కెట్లోకి రానున్న 5 టాప్ మోడ్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

1.రాయల్ ఎన్‌ఫీల్డ్ ఫ్లయింగ్ ఫ్లీ S6

ఇండియన్ మార్కెట్ లోకి రాయల్ ఎన్‌ఫీల్డ్ ఫ్లయింగ్ ఫ్లీ S6 తొలుత ఎంట్రీ ఇవ్వనుంది. ఈ ఎలక్ట్రిక్ స్క్రాంబ్లర్ బైక్ 2026 చివర్లో విడుదలయ్యే అవకాశం ఉంది. కంపెనీ ఇప్పటికే దీని కాన్సెప్ట్‌ ను ప్రదర్శించింది. 3.91 kWh బ్యాటరీతో వచ్చే ఈ బైక్ పూర్తి ఛార్జ్‌ పై సుమారు 150 కిలోమీటర్ల వరకు ప్రయాణించనుంది. ఆఫ్‌ రోడ్ రైడింగ్‌ను దృష్టిలో పెట్టుకుని దీనిని రూపొందిస్తున్నారు. ట్రాక్షన్ కంట్రోల్, క్రూయిజ్ కంట్రోల్, డ్యూయల్ చానల్ ABS లాంటి ఆధునిక ఫీచర్లు ఇందులో ఉండనున్నాయి.

2.అల్ట్రావయోలెట్ షాక్‌వేవ్

Advertisement

అల్ట్రావయోలెట్ నుంచి షాక్‌ వేవ్ కూడా రానుంది. ఈ ఎలక్ట్రిక్ బైక్‌ను ఇప్పటికే కంపెనీ పరిచయం చేసింది. అయితే, డెలివరీలు 2026లో ప్రారంభమయ్యే అవకాశం ఉంది. 3.5 kWh బ్యాటరీతో వచ్చే ఈ బైక్ ఒకసారి ఛార్జ్ చేస్తే 165 కిలోమీటర్ల వరకు ప్రయాణిస్తుంది. కేవలం 2.9 సెకన్లలో 0 నుంచి 60 కి.మీ వేగాన్ని అందుకునే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది.

3.విడా VxZ

హీరో మోటోకార్ప్ నుంచి విడా VxZ ఎలక్ట్రిక్ మోటార్‌ సైకిల్ కూడా విడుదల కానుంది. ఇటలీలో జరిగిన EICMA 2025 ప్రదర్శనలో దీన్ని మొదటిసారి చూపించారు. ప్రస్తుతం రోడ్ టెస్టులు కొనసాగుతున్నాయి. 2027 ప్రారంభంలో భారత మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉంది. యూఎస్‌కు చెందిన జీరో మోటార్‌ సైకిల్స్ సహకారంతో ఈ బైక్ అభివృద్ధి చెందుతోంది. పూర్తి డిజిటల్ డిస్‌ ప్లే, రైడింగ్ మోడ్‌ లు, ప్రీమియం డిజైన్ లాంటి ఫీచర్లు ఇందులో ఉండనున్నాయి.

4.రాయల్ ఎన్‌ ఫీల్డ్ హిమాలయన్

Advertisement

నాలుగో స్థానంలో రాయల్ ఎన్‌ ఫీల్డ్ హిమాలయన్ ఎలక్ట్రిక్ ఉంది. అడ్వెంచర్ టూరింగ్ కోసం ప్రత్యేకంగా రూపొందిస్తున్న ఈ బైక్‌పై ఇంకా అధికారిక సమాచారం పూర్తిగా బయటకు రాలేదు. అయితే పరీక్షల సమయంలో కనిపించిన ప్రోటోటైప్‌ల ఆధారంగా చూస్తే, ఇది 200 నుంచి 250 కిలోమీటర్ల వరకు రేంజ్ ఇవ్వగల భారీ బ్యాటరీతో వచ్చే అవకాశం ఉంది. సంప్రదాయ హిమాలయన్ మోడల్‌ లో ఉన్న డిజైన్ లక్షణాలను కూడా ఇందులో కొనసాగించే అవకాశం ఉంది.

5.టీవీఎస్ eFX 3O

టీవీఎస్ eFX 3O. EICMA 2025లో కాన్సెప్ట్‌ గా ప్రదర్శించిన ఈ మోడల్ టీవీఎస్ తొలి ఎలక్ట్రిక్ మోటార్‌ సైకిల్ కావొచ్చు. అపాచీ RTR సిరీస్‌ ను పోలిన డిజైన్‌ తో రానుంది. పెద్ద బ్యాటరీ ప్యాక్‌ తో 200 కిలోమీటర్లకు పైగా రేంజ్ అందించే అవకాశం ఉందని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. 2026 చివర్లో, 2027 ప్రారంభంలో దీని లాంచ్ ఉంటుందని భావిస్తున్నారు.

Read Also: బ్యాటరీ యాజ్ ఎ సర్వీస్ అంటే ఏంటి? EV కొనుగోలుదారులకు లాభమా? నష్టమా?

Related News

సింగిల్ ఛార్జ్ తో 200 కిమీ రేంజ్.. భారత్‌ లో బెస్ట్ EV స్కూటర్లు ఇవే!

2026 బ్రెజ్జా Vs హ్యుందాయ్ వెన్యూ.. ఏ SUV కొనడం బెస్ట్?

రైళ్ల భద్రతకు డిజిటల్ టెక్నాలజీ.. మూడు కొత్త యాప్‌లను ప్రారంభించిన ఇండియన్ రైల్వే!

ఒక్కొక్కటి కాదు.. ఒకేసారి 10 కొత్త మోడల్స్.. హోండా దూకుడు మామూలుగా లేదుగా!

హోండా మాస్టర్ స్ట్రోక్.. భారత్‌ లో తొలి E85 మ్యాక్సీ స్కూటర్ లాంచ్!

రూ.1 లక్షలో హీరో కొత్త EV.. మార్కెట్‌ను షేక్ చేయనున్న విడా!

ఏఐ టెక్నాలజీతో అవోర్ ఎలక్ట్రిక్ బైక్.. ఫీచర్లు చూస్తే ఫిదా అవుతారు!

అల్ట్రావయోలెట్ To వెస్పా.. మార్కెట్ లోకి ఎంట్రీ ఇవ్వబోతున్న క్రేజీ ఎలక్ట్రిక్ స్కూటర్లు ఇవే!

Big Stories

Advertisement
×