E-Paper
Advertisement

Maruti Suzuki SUV: మారుతి నుంచి చౌకైన SUV.. జస్ట్ రూ.5.50 లక్షలకే కొత్త మోడల్!

Maruti Suzuki SUV: మారుతి నుంచి చౌకైన SUV..  జస్ట్ రూ.5.50 లక్షలకే కొత్త మోడల్!
Advertisement

Maruti Suzuki Sub-Compact SUV: మారుతి సుజుకి నుంచి సరికొత్త కార్లు మార్కెట్లోకి అందుబాటులోకి వస్తున్నాయి. తక్కువ ధరలో మంచి ఫీచర్లు, మైలేజీ ఇచ్చే కార్లు అడుగు పెడుతున్నాయి. తాజాగా నివేదికల ప్రకారం మరో క్రేజీ కారు రాబోతోంది. తక్కువ ధరలోనే ఈ SUV లాంచ్ కాబోతోంది.  మారుతి సుజుకి సబ్-కాంపాక్ట్ ఎస్‌యూవీ శ్రేణిలో భాగంగా, బహుశా మైక్రో/ఎంట్రీ లెవల్ క్రాస్‌ ఓవర్ సెగ్మెంట్ గా ఈ కారు విడుదల కానుంది. దీని ధర సుమారు రూ. 5.50 లక్షల (ఎక్స్ షోరూమ్) నుంచి ప్రారంభమవుతుంది.  ఇదే విభాగంలో ఎస్ ప్రెస్సో రూ. 3.50 లక్షల నుంచి ప్రారంభం అవుతుంది. సెలెరియో లాంటి మోడళ్లు తరచుగా పోటీ పడుతున్నాయి. రాబోయే ఎంట్రీ లెవల్ SUV మోడళ్లు కూడా దాదాపు ఇదే ధర పరిధిలో ఉంటాయని ఆటో నిపుణులు అంచనా వేస్తున్నారు.

2026 సరసమైన మారుతి SUV గురించి..  

ఈ కారు మారుతి సుజుకి సబ్ కాంపాక్ట్ విభాగంలో మైక్రో SUVగా అడుగు పెట్టబోతోంది. ఈ కారుకు సంబంధించిన ధర, ఇంజిన్, లాంచ్ డేట్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

Advertisement

⦿ ధర: ఈ SUV ధర సుమారు రూ. 5.50 లక్షల నుంచి ప్రారంభం అవుతుంది. రూ. 9.00 లక్షల అంచనా ధర పరిధిలో విడుదల కానుంది.

⦿ ఇంజన్, ఆప్షన్లు: ఇతర మారుతి మైక్రో ఎస్‌యూవీల మాదిరిగానే, దీనికి కూడా 1.2-లీటర్ పెట్రోల్ ఇంజన్,  ఆప్షనల్ గా CNGతో అందించే అవకాశం ఉంది.

Advertisement

⦿ లాంచ్ డేట్:  ఈ కారు మార్చి 2028లో భారతీయ మార్కెట్ లోకి విడుదల అయ్యే అవకాశం ఉంటుంది.

Read Also: ఓలా క్రేజీ ఆఫర్.. ఏకంగా రూ.30 వేలు తగ్గింపు!

⦿ ఏ కార్ల ప్రత్యామ్నాయం?: ఈ విభాగంలో మారుతి సుజుకి ఫ్రాంక్స్ మరో ముఖ్యమైన ఎంపిక. ని ధరలు రూ. 6.85 లక్షల నుంచి ప్రారంభం అవుతాయి..

⦿ ఇతర పోటీ మోడల్స్: ఈ కారుతో నిస్సాన్ మాగ్నైట్, హ్యుందాయ్ ఎక్ట్సర్ లాంటి కార్లు పోటీ పడనున్నాయి. ఈ కార్లు కూడా దాదాపు అదే ఫీచర్లు, అదే ధరతో అందుబాటులో ఉంటాయి.

మొత్తంగా ఈ చౌకైన SUV కోసం మారుతి సుజుకి లవర్స్ ఆసక్తిగా ఎదరుచూస్తున్నారు.

Read Also: ఏథర్ క్రేజీ ఆఫర్లు.. ఆ రెండు స్కూటర్లపై భారీగా తగ్గింపు!

Related News

టెస్లా నుంచి పిల్లల కోసం కొత్త బైక్.. రేట్ ఎంత అంటే?

EV బ్యాటరీల్లో ఏది సేఫ్? కొనుగోలు చేసే ముందు ఈ విషయాలు తప్పకుండా తెలుసుకోవాల్సిందే!

వర్షాకాలంలో ఎలక్ట్రిక్ కారు కొనాలనుకుంటున్నారా? ఈ 4 మోడల్స్ బెస్ట్ ఛాయిస్!

కియా సైరోస్ EV vs కియా సైరోస్ ICE.. ఏది బెస్ట్? పూర్తి పోలిక ఇదే!

16 ఏళ్ల తర్వాత నిస్సాన్ మాస్టర్‌ పీస్.. కొత్త ఎల్గ్రాండ్ వచ్చేసింది!

భారత మార్కెట్ లోకి చౌకైన 7-సీటర్‌.. ఏంటీ.. ధర మరీ అంత తక్కువా?

MG కొత్త EV వచ్చేస్తోంది.. 600 కి.మీ రేంజ్‌తో అదిరే ఎంట్రీ!

సింగిల్ ఛార్జ్ తో 500 కి.మీ ప్రయాణం.. మార్కెట్ లో దుమ్మురేపబోతున్న హ్యుందాయ్ ఈవీ!

Big Stories

Advertisement
×