E-Paper
Advertisement

TG State Debt: తెలంగాణ రాష్ట్రాన్ని పట్టి పీడిస్తున్న అప్పుల భారం.. ఇదిగో పూర్తి నివేదిక

TG State Debt: తెలంగాణ రాష్ట్రాన్ని పట్టి పీడిస్తున్న అప్పుల భారం.. ఇదిగో పూర్తి నివేదిక
Advertisement

TG State Debt: స్వేచ్చ బ్యూరో: రాష్ట్రంపై అప్పుల భారం పెరుగుతూనే ఉన్నది. ఈ ఆర్ధిక సంవత్సరం 2026–2027 ముగిసే నాటికి ఎఫ్​ ఆర్బీఎమ్(ఫిస్కల్ రెస్పాన్సిబిలిటీ అండ్ బడ్జెట్ మేనేజ్ మెంట్) పరిధిలోనే నేరుగా ప్రభుత్వం చేసే అప్పులు ఏకంగా రూ. 5,62,363 కోట్లకు చేరుకోనున్నాయి. ఇది రాష్ట్ర జీఎస్​డీపీలో ఏకంగా 29 శాతం కావడం గమనార్హం. వాస్తవానికి ఈ జీఎస్ డీపీ అప్పులు 25 శాతంలోపే ఉండాలని ఫైనాన్స్ ఎక్స్ పర్ట్స్ చెబుతున్నారు. కానీ గత 2023-–24లో జీఎస్ డీపీలో 27 శాతంగా ఉన్న ఈ అప్పులు, కేవలం మూడేళ్లలోనే 29 శాతానికి పెరగడం రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దిగజారుతోందనడానికి నిదర్శనమని ఆర్థిక నిపుణులు చెప్తున్నారు. గత ప్రభుత్వ హయాంలో జరిగిన భారీ అప్పులకు తోడు, ప్రస్తుత ప్రభుత్వం కూడా పాలన సాగించడానికి ప్రతి ఏటా కొత్తగా అప్పులు చేయక తప్పని పరిస్థితి ఏర్పడింది.

పరిస్థితి ఆందోళనకరం

కేవలం వచ్చే సంవత్సరంలోపే బహిరంగ మార్కెట్ నుంచి రూ. 73,383 కోట్ల రుణాలను సేకరించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఇది కాకుండా కేంద్రం నుంచి రూ.5500 కోట్లు, ఇతర లోన్లు వెయ్యి కోట్లు, ఇతర డిపాజిట్లు, అడ్వాన్స్​లతో రూ.2986 కోట్లు అప్పు తీసుకోనున్నట్లు వెల్లడించింది. ఇలా మొత్తంగా రూ.82 వేల కోట్లు దాటనుంది. మరోవైపు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అంతకంతకు ఆందోళనకరంగా మారుతోంది. 2026–-27 ఆర్థిక సంవత్సర బడ్జెట్‌ను పరిశీలిస్తే, అప్పులు స్పష్​టంగా కనిపిస్తున్నాయి. వచ్చే 2027 మార్చి నాటికి రాష్ట్ర ప్రభుత్వం చేసిన అప్పులు ఏకంగా రూ. 8.64 లక్షల కోట్లకు చేరనున్నాయి. ఇందులో ప్రభుత్వం నేరుగా చేసే ఎఫ్​ఆర్​బీఎం పరిధిలోని చేసిన అప్పులు రూ. 5.62 లక్షల కోట్లు కాగా, గ్యారంటీలు, కార్పొరేషన్ల బాకీలు కలిపి మరో రూ. 3.01 లక్షల కోట్లుగా ఉన్నాయి.

ఆదాయం సృష్టించే..

Advertisement

ఈ భారీ  అప్పులతో  రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ తీవ్ర ఒడిదొడుకులకు లోనవుతోంది. ఒకవైపు సంక్షేమ పథకాల అమలుకు నిధుల వేట కొనసాగిస్తూనే,  మరోవైపు పాత అప్పులకు వడ్డీలు, అసలు కట్టాల్సి రావడం తలకు మించిన భారంగా మారింది. ఇది ప్రభుత్వ పాలనకు ఇబ్బందికరంగా మారే ప్రమాదం ఉన్నది. సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలు సజావుగా నిర్వహించేందుకు ఈ అప్పులు అడ్డుగోడగా నిలిచే ఛాన్స్ ఉన్నది. అంతేగాక త్రీ ట్రిలియన్ ఎకానీమ గోల్ చేరేందుకు కూడా అప్పులు సర్కార్ ను వెంటాడనున్నాయి. ఆదాయం సృష్టించే ప్రత్యమ్నాయ మార్గాలను సర్కార్ అన్వేషించాల్సిన పరిస్థితి ఉన్నట్లు ఫైనాన్స్ ఎక్స్ పర్ట్స్ చెబుతున్నారు.

ఎఫ్​ఆర్​బీఎం పరిధిలో అప్పులు ఇలా..

1.ఆర్థిక సంవత్సరం అప్పుల మొత్తం (రూ. కోట్లలో)

Advertisement

2014–15 83,845

2015–16 93,115

2016–17 1,29,531

2017–18 1,52,190

2018-–19 1,75,281

2019–20 2,05,858

2020–21 2,44,019

2021–22 3,21,612

2022–23 3,56,486

2023-–24 3,98,655

2024-–25         4,47,493

2025-–26(రివైజ్డ్​) 5,03,905

2026-–27         5,62,363 (అంచనా)

2.నాన్-ఎఫ్​ఆర్​బీఎం (కార్పొరేషన్) రుణాల అంచనా..

మొత్తం (రూ. కోట్లలో)

ప్రభుత్వ గ్యారంటీ రుణాలు (ప్రభుత్వం చెల్లించేవి) 86,309

ప్రభుత్వ గ్యారంటీ రుణాలు (ఎస్​పీవీ- సంస్థలే చెల్లించేవి) 1,55,434

మొత్తం గ్యారంటీ రుణాలు  2,41,743

కార్పొరేషన్ల సొంత రుణాలు (ప్రభుత్వ గ్యారంటీ లేనివి) 60,092

మొత్తం నాన్-ఎఫ్​ఆర్​బీఎం అప్పులు 3,01,835

Related News

Contract Teachers: ఉపాధ్యాయులకు గుడ్ న్యూస్.. రూ.21.99 కోట్ల నిధులు విడుదల!

Voter Revision: హైదరాబాద్‌లో ఓట్ల తొలగింపు కుట్ర?.. విజిలెన్స్ డేగ కన్ను..!

Banjara Ekta: బంజారా ప్రజలకు బిగ్ అలర్ట్.. ఈ నెల 27న ఢిల్లీలో భారీ బహిరంగ సభ!

కానిస్టేబుల్ పై ఫోక్సో కేసు నమోదు.. ఎక్కడంటే..?

నీట్ అక్రమాలపై పార్లమెంట్‌లో చర్చ జరగాల్సిందే.. బీజేపీపై ఎంపీ చామల ఫైర్!

హైదరాబాద్‌లో ఆ ఓట్లపై కాంగ్రెస్, MIM కన్ను.. రంగంలోకి దిగిన బీజేపీ!

కాంగ్రెస్ నడిచే పడవ కాదు.. మునిగే పడవ.. ప్రభుత్వంపై కేటీఆర్ సెటైర్లు!

కేవలం రూ. 6 లక్షలకే హైదరాబాద్‌లో ఇల్లు.. ప్రభుత్వం బంపరాఫర్!

Big Stories

Advertisement
×