Maruti Suzuki October Offers: మారుతి సుజుకి కారును కొనుగోలు చేయాలని ప్లాన్ చేస్తున్నారా? అయితే, ఈ అక్టోబర్ నెలలో అదిరిపోయే ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. మారుతి సుజుకి విక్టోరిస్, స్విఫ్ట్, వాగన్ ఆర్, ఆల్టో కె10, సెలెరియో, ఎస్ ప్రెస్సో, ఈకో మోడళ్లపై ప్రత్యేక ఆఫర్లను అందిస్తోంది. మోడల్, వేరియంట్‌ను బట్టి గరిష్ఠంగా రూ. 1.65 లక్షల వరకు బెనిఫిట్స్ అందుబాటులో ఉన్నాయి. ఈ ఆఫర్లలో క్యాష్ డిస్కౌంట్లు, ఎక్స్ఛేంజ్ బోనస్‌లు, లాయల్టీ బెనిఫిట్స్‌తో పాటు పలు ఆఫర్లు ఉన్నాయి.
ఈ నెలలో విక్టోరిస్ స్ట్రాంగ్ హైబ్రిడ్ వేరియంట్‌పై భారీగా ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. దీనిపై రూ. 40,000 క్యాష్ డిస్కౌంట్, రూ. 30,000 లాయల్టీ బోనస్, రూ. 95,000 వరకు ఎక్స్ఛేంజ్ బోనస్ అందిస్తోంది. రూ. 45,000 వరకు స్క్రాపేజ్ బోనస్ కూడా అందుబాటులో ఉంది. పెట్రోల్ వేరియంట్‌పై రూ. 1.10 లక్షల వరకు, సీఎన్జీ వేరియంట్‌పై రూ. 95,000 వరకు బెనిఫిట్స్ లభిస్తాయి. విక్టోరిస్ ధర రూ. 10.50 లక్షల నుంచి ప్రారంభమవుతుంది.
మారుతి స్విఫ్ట్ పెట్రోల్ వేరియంట్లపై రూ. 40,000 వరకు బెనిఫిట్స్ ఉన్నాయి. స్విఫ్ట్ బ్లిట్జ్ ఎడిషన్‌పై యాక్సెసరీ కిట్‌తో కలిపి రూ. 71,000 వరకు బెనిఫిట్స్ లభిస్తాయి. సీఎన్జీ వేరియంట్లపై రూ. 30,000 వరకు ఆఫర్లు ఉన్నాయి. సెలెరియో పెట్రోల్ వేరియంట్లపై రూ. 67,500 వరకు, సీఎన్జీ వేరియంట్లపై రూ. 47,500 వరకు బెనిఫిట్స్ అందుబాటులో ఉన్నాయి. క్యాష్ డిస్కౌంట్, ఎక్స్ఛేంజ్ బోనస్, అదనపు తగ్గింపులు ఇందులో ఉన్నాయి.
వాగన్ ఆర్ వాల్ట్జ్ ఎడిషన్‌పై రూ. 67,000 వరకు తగ్గింపు పొందవచ్చు. ఇతర పెట్రోల్ వేరియంట్లపై రూ. 57,500 వరకు, సీఎన్జీ మోడళ్లపై రూ. 52,500 వరకు ఆఫర్లు ఉన్నాయి. ఇక ఆల్టో కె10 ఎల్ఎక్స్ఐ పెట్రోల్ వేరియంట్‌పై రూ. 57,500 వరకు బెనిఫిట్స్ లభిస్తాయి. ఇతర పెట్రోల్ వేరియంట్లపై రూ. 47,500 వరకు, సీఎన్జీ వేరియంట్లపై రూ. 37,500 వరకు బెనిఫిట్స్ అందుబాటులో ఉన్నాయి.
మారుతి ఎస్ ప్రెస్సో పెట్రోల్ వేరియంట్లపై రూ. 37,500 వరకు, సీఎన్జీ వేరియంట్లపై రూ. 27,500 వరకు తగ్గింపులు ఉన్నాయి. మరోవైపు, ఈకో పెట్రోల్ వేరియంట్లపై రూ. 37,500 వరకు, సీఎన్జీ వేరియంట్లపై రూ. 32,500 వరకు ఆఫర్లు లభిస్తాయి.
ఈ డిస్కౌంట్లు సిటీ, డీలర్ షిప్, స్టాక్, వేరియంట్ ను బట్టి మారే అవకాశం ఉంది. ఎక్స్ఛేంజ్, స్క్రాపేజ్ బోనస్ కు ప్రత్యేక నిబంధనలు వర్తిస్తాయి. కొనుగోలు చేసే ముందు మారుతి డీలర్‌ను సంప్రదించి, ప్రస్తుత ఆఫర్లు, ఆన్ రోడ్ ధర లాంటి వివరాలను తెలుసుకోవడం మంచిది.
Read Also: హ్యుందాయ్ క్రెటా సరికొత్త రికార్డు.. 15 లక్షలు దాటిన అమ్మకాలు!