E-Paper
Advertisement

ఉమ్మడి ఏపీలో ఐదు సార్లు.. తెలంగాణ ఏర్పడిన తరువాత మూడోసారి! ప్రతిసారీ వ్యవసాయ రంగం కుదేలు! ఈసారి తెలంగాణలో 10 లక్షల ఎకరాల్లో వరిసాగుపై ప్రభావం!

ఉమ్మడి ఏపీలో ఐదు సార్లు.. తెలంగాణ ఏర్పడిన తరువాత మూడోసారి! ప్రతిసారీ వ్యవసాయ రంగం కుదేలు! ఈసారి తెలంగాణలో 10 లక్షల ఎకరాల్లో వరిసాగుపై ప్రభావం!
Advertisement

కరువు పరిస్థితులు ఎప్పుడొచ్చినా తెలుగు రాష్ట్రాలను కకావికలం చేశాయి. వ్యవసాయరంగాన్ని అతలాకుతలం చేశాయి. ప్రధానంగా వరి రైతును నిండా ముంచాయి. తాగునీటి వెతలు, కరెంటు కష్టాలు, భూగర్బ జలాలు అడుగంటి పోవడం.. అంతిమంగా మొదట ఎఫెక్టయ్యింది మాత్రం వ్యవసాయ రంగమే. ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్‌లో ఇప్పటి వరకు పీడించిన కరువు పరిస్థితులు ఐదు సార్లు వచ్చాయి. ఆ వచ్చిన కరువు జనాలను పీడించాయి. రైతుల జీవితాలతో ఆడుకున్నాయి.

వ్యవసాయ రంగాన్ని తల్లడిల్లేలా చేశాయి. తెలంగాణ ఏర్పడిన తరువాత కూడా మొత్తం మూడు సార్లు కరువు పరిస్థితులు ఉత్పన్నమయ్యాయి. తాజాగా ఈ సూపర్ ఎల్‌నినో కరువుతో కలిపి మొత్తం మూడు సార్లు తెలంగాణను ఆగమాగం చేశాయి. పదేళ్ల కేసీఆర్‌ పాలనలో రెండు పర్యాయాలు వచ్చిన కరువు రోజుల్లో వ్యవసాయం కుదేలైంది. కరెంటు కష్టాలు తప్పలేదు. రైతులు తీవ్రంగా నష్టపోయారు.

Advertisement

లోటు వర్షపాతం నమోదుతో భూగర్భ జలాలు గణనీయంగా పడిపోయాయి. తాజాగా తెలంగాణలో సూపర్‌ ఎల్‌నినో తన ప్రభావం చూపడం షూరూ చేసింది. ఇప్పుడు వేసిన వరి సాగు కోత దశకు వచ్చే నాటికి 10 లక్షల ఎకరాల్లో నష్టం తీవ్రంగా ఉంటుందని అంచనా వేస్తున్నారు. దాదాపుగా 20వేల కోట్ల నష్టం వాటిల్లే కరువు ప్రమాదంగా లెక్కలు కడుతున్నారు అధికారులు.

ఎల్‌నినో కరువుల వల్ల నైరుతి రుతుపవనాలు బలహీనపడి, తీవ్ర వర్షాభావం ఏర్పడటం వల్ల జలాశయాలు, భూగర్భ జలాలు పూర్తిగా అడుగుంటాయి. కృష్ణా బేసిన్‌ జలాశయాల్లో నీటి నిల్వలు 72 శాతం, గోదావరి బేసిన్‌లో 40 శాతం మేర పడిపోయాయి. తెలంగాణ రాష్ట్రానికి కనీసం 460 టీఎంసీల నీరు అవసరం కాగా, ప్రస్తుతం రిజర్వాయర్లలో కేవలం 209 టీఎంసీలు మాత్రమే ఉండటం ప్రమాద తీవ్రతను తెలియజేస్తోంది.

Advertisement

ఈ వానాకాలం (ఖరీఫ్) సీజన్‌లో తెలంగాణలో సాధారణంగా సాగయ్యే 67 లక్షల ఎకరాల వరి విస్తీర్ణం, ఎల్‌నినో దెబ్బకు 56 లక్షల ఎకరాలకు పడిపోయింది. ఏపీలో కూడా ఎల్‌నినో ప్రభావం వల్ల దాదాపు 2 లక్షల హెక్టార్లలో వరి నాట్లు నిలిచిపోయాయి. ఉమ్మడి చిత్తూరు వంటి జిల్లాల్లో సాగునీరు విడుదల కాకపోవడంతో ఏకంగా 70 శాతం వరి సాగు విస్తీర్ణం తగ్గింది.

ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు ఎల్‌నినో కారణంగా అత్యంత దారుణమైన వర్షాభావ పరిస్థితులు, పంట నష్టాలు నమోదయ్యాయి. 1972లో దేశవ్యాప్తంగానే కాకుండా ఉమ్మడి ఏపీలోనూ ఇది మహా కరువుగా నిలిచింది. వర్షాలు పూర్తిగా ముఖం చాటేయడంతో సాగు, తాగునీటికి తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యాయి.

1992లో వచ్చిన కరువును అత్యంత దారుణ కరువుగా సంబోధించారు. ఏకంగా 39.3 శాతం వర్షపాత లోటు నమోదైంది. ఇది గత కొన్ని దశాబ్దాల్లోనే అత్యంత దారుణమైన లోటుగా రికార్డయ్యింది. 2002లో తెలంగాణ ప్రాంతంలో 28.3 శాతం వర్షపాత లోటు ఏర్పడి తీవ్ర కరువు పరిస్థితులు వచ్చాయి. 2004లో తెలంగాణలో సాధారణం కంటే 35.7 శాతం తక్కువ వర్షపాతం నమోదైంది.

బావులు, చెరువులు ఎండిపోయి వ్యవసాయ రంగం కుదేలైంది. 2009లో ఎల్‌నినో తీవ్రత వల్ల రాష్ట్రవ్యాప్తంగా కరువు విలయతాండవం చేసింది. ముఖ్యంగా రాయలసీమ, తెలంగాణ ప్రాంతాలు తీవ్రంగా ప్రభావితమయ్యాయి. తెలంగాణ ఏర్పడిన తరువాత 2014లో ఎల్‌నినో సెగలు తప్పలేదు. 2015 లో రాష్ట్రం ఏర్పడిన తొలి నాళ్లలోనే ఎల్‌నినో కరువు ఛాయలు కమ్మేశాయి. జూన్ నెలలో వర్షాలు బాగున్నా, ఆగస్టు వచ్చేసరికి 28.5 శాతం వర్షపాత లోటు ఏర్పడి పంటలు ఎండిపోయాయి.

2023లోజూలైలో భారీ వర్షాలు (120.4% అదనపు వర్షపాతం) పడినప్పటికీ, ఎల్‌నినో ప్రభావం ప్రారంభం కావడంతో ఆగస్టు నెలలో ఏకంగా 54.5 శాతం భారీ వర్షపాత లోటు నమోదైంది. దీనివల్ల కీలకమైన పంట దశల్లో నీరు అందక రైతులు నష్టపోయారు. ప్రస్తుతం కొనసాగుతున్న 2026 సంవత్సరం ‘సూపర్ ఎల్‌నినో’ కారణంగా చరిత్రలోనే మరో భయంకరమైన కరువును మోసుకొచ్చింది. ఈ ఏడాది తెలంగాణలో 22% , ఆంధ్రప్రదేశ్‌లో 43% మేర వర్షపాత లోటు నమోదై, వందలాది మండలాలు కరువు పీడిత ప్రాంతాలుగా మారాయి.

ప్రస్తుతం ఎల్‌నినో విపత్తు వల్ల రాష్ట్రంలో విద్యుత్ గ్రిడ్‌పై తీవ్ర ఒత్తిడి పడుతోంది. వర్షాల్లేక ఎండిపోతున్న పంటలను కాపాడుకోవడానికి రాష్ట్రవ్యాప్తంగా రైతులు ఏకకాలంలో దాదాపు 30 లక్షల వ్యవసాయ పంపుసెట్లను ఆన్ చేశారు. దీనివల్ల కరెంట్ వినియోగం విపరీతంగా పెరిగింది. గతంలో 2002, 2004, 2009 లలో ఎల్‌నినో కరువులు వచ్చినప్పుడు విద్యుత్ కొరత మరింత దారుణంగా ఉండేది.

అప్పట్లో సాంకేతికత, ఇతర రాష్ట్రాల నుండి కరెంట్ కొనుగోలు చేసే సదుపాయాలు తక్కువగా ఉండటంతో పట్టణాల్లో 4 నుండి 6 గంటలు, గ్రామాల్లో 8 నుండి 12 గంటల పాటు అధికారికంగా విద్యుత్ కోతలు విధించేవారు. ఉమ్మడి ఏపీలో రైతులకు కేవలం 7 గంటలు లేదా 9 గంటలు మాత్రమే కరెంట్ ఇచ్చేవారు.

2015లో తీవ్ర కరువు వచ్చింది. ఆగస్టు నెలలో దాదాపు 28.5 శాతం వర్షపాత లోటు ఏర్పడటంతో ఖరీఫ్ పంటలు భారీగా దెబ్బతిన్నాయి. వ్యవసాయానికి నాణ్యమైన విద్యుత్ అందించడం ప్రభుత్వానికి పెద్ద సవాలుగా మారింది. పగటిపూట కోతలు, తక్కువ వోల్టేజీ సమస్యల వల్ల రైతులు ఇబ్బందులు పడ్డారు. దీనిని అధిగమించడానికి కేసీఆర్‌ సర్కార్‌.. ఛత్తీస్‌గఢ్ తదితర పొరుగు రాష్ట్రాల నుంచి విద్యుత్ కొనుగోలు చేసింది.

2015 నాటి పరిస్థితితో పోలిస్తే 2023 నాటికి తెలంగాణ విద్యుత్ రంగంలో మిగులు సాధించింది కేసీఆర్‌ సర్కార్‌. ఆగస్టు మరియు సెప్టెంబర్ నెలల్లో వర్షాలు లేకపోవడంతో రైతులు ఏకకాలంలో లక్షలాది మోటార్లను ఆన్ చేయడంతో కరెంట్ డిమాండ్ రికార్డు స్థాయికి చేరింది. 1972 లో మహా కరువుగా, 1992 కరువు ను శతాబ్దపు అతి పెద్ద కరువుగా, 2002లో వచ్చిన కరువును.. శతాబ్దపు తొలి కరువుగా పిలిచారు.

2004 లో నమోదైన కరువును.. వరుస కరువుల పరాకాష్ట (Peak of Cyclical Droughts)గా పేర్కొన్నారు. 2009 కరువు – “రుతుపవనాల విఫల కరువు” అని, 2015 కరువును “తొలి అడుగుల కరువు,  సరిహద్దు కరువు” గా, 2023లో వచ్చిన కరువును”అస్థిర/విచిత్ర రుతుపవన కరువు” గా పిలిచారు. ప్రస్తుత 2026 కరువు ను”సూపర్ ఎల్‌నినో విపత్తు” (Super El Niño Crisis)గా పిలుస్తున్నారు.

Tags

Related News

కరువును జయించేందుకు సర్కార్‌ సమగ్ర కార్యాచరణ! రైతులు, ప్రజలు, మీడియాకు రేవంత్‌ ప్రత్యేక విజ్ఞప్తి..! సాగు, తాగు, విద్యుత్‌ అంశాలపై అత్యంత ప్రయార్టీ..!

లక్షల్లో జీతాలు మెక్కుతూ.. బిజినెస్‌మెన్‌ల అవతారమెత్తుతూ! దాదాపు 20వేల మంది ఇదే దారిలో..! విద్యార్థుల చదవులు అంధకారంలో..!

ఇందిరమ్మ ఇళ్లు లబ్ధిదారులకు షాకింగ్ న్యూస్.. చిక్కుల్లో వెబ్ సైట్..?

తెలంగాణ బీజేపీ గతిని మార్చేలా రంగంలోకి ఆ ఇద్దరు! బెంగాల్‌ మాస్టర్‌ మైండ్‌ సునీల్‌ బన్సాల్‌పై భారీ అంచనాలు! కిషన్‌రెడ్డి, లక్ష్మణ్‌ నిర్ణయాలకు ఇక చెల్లుచీటి?

నామినేటెడ్ పదవుల పంపిణీలో ఢిల్లీ హవా.. అసంతృప్తిలో కాంగ్రెస్ లీడర్లు!

ఒక్కరోజు బాగోతానికి మూతిమీసాలు పెంచుకున్నాడు..! కేసీఆర్‌ ఎక్కడికో తీసుకుపోవాలనుకుంటాడు.. ! కానీ ఇతడు ఇక్కడ్నే ఉంటాడు..!

లక్నో మర్డర్ మిస్టరీ.. మోడల్ శ్రద్ధా దూబే హత్య కేసులో పూర్తి వివరాలివే?

Big Stories

Advertisement
×