E-Paper
Advertisement

Maruti Hybrid Cars Discounts: మారుతి సుజుకి అదిరిపోయే ఆఫర్లు, హైబ్రిడ్ కార్లపై ఏకంగా..

Maruti Hybrid Cars Discounts: మారుతి సుజుకి అదిరిపోయే ఆఫర్లు, హైబ్రిడ్ కార్లపై ఏకంగా..
Advertisement

Discounts on Maruti Hybrid Cars: దేశీయ మార్కెట్ లో తనకంటూ ఓ బలమైన వాటాను కలిగి ఉంది మారుతి సుజుకి. ఈ ఏడాది అద్భుతమైన కార్లు విడుదల చేసిన కంపెనీ, 2026లో సరికొత్త కార్లను లాంచ్ చేయబోతోంది. ఇప్పటికే ఆయా కార్లకు సంబంధించిన వివరాలను వెల్లడించింది. ఓవైపు కొత్త కార్లు మార్కెట్లోకి తీసుకురాబోతున్న మారుతి సుజుకి, మరోవైపు ప్రస్తుతం అమ్మకాలు కొనసాగిస్తున్న కార్లపై క్రేజీ ఆఫర్లు ప్రకటించింది. ముఖ్యంగా స్ట్రాంగ్ హైబ్రిడ్ కార్లుపై  డిసెంబర్ 2025 ఆఫర్ల పేరుతో భారీగా తగ్గింపు అందిస్తుంది.

హైబ్రిడ్ మోడల్స్ పై భారీగా తగ్గింపు

మారుతి సుజుకి ఇప్పుడు పవర్ ఫుల్ టెక్నాలజీతో రెండు మోడల్స్ అందుబాటులో ఉన్నాయి. వాటిలో ఒకటి  గ్రాండ్ విటారా స్ట్రాంగ్ హైబ్రిడ్ కాగా, మరొకటి ఇన్విక్టో (ప్రీమియం MPV). డిసెంబర్ 2025 ఇయర్ ఎండ్ సేల్స్ సందర్భంగా భారీ ఆఫర్లు ప్రకటించింది. ముఖ్యంగా క్యాష్ డిస్కౌంట్, ఎక్స్చేంజ్ బోనస్, స్క్రాపేజ్ బెనిఫిట్, ఎక్స్‌ టెండెడ్ వారంటీ, కార్పొరేట్ ఆఫర్లు అందిస్తుంది. ఇంతకీ ఏ కారుపై ఎంత తగ్గింపు అందిస్తుందో ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..

⦿ గ్రాండ్ విటారా స్ట్రాంగ్ హైబ్రిడ్ (SUV)

Advertisement

ఈ కారుపై మొత్తం బెనిఫిట్స్ రూ. 2.00 లక్షల నుంచి రూ. 2.74 లక్షల వరకు అందిస్తుంది. వేరియంట్, స్టాక్ బట్టి మారుతూ ఉంటుంది.  రూ. 75,000 నుంచి రూ. 90,000 క్యాష్ డిస్కౌంట్, రూ. 50,000 ఎక్స్చేంజ్/అప్‌గ్రేడ్ బోనస్, రూ. 45,000 నుంచి రూ. 65,000 స్క్రాపేజ్ బెనిఫిట్,  రూ. 27,000 నుంచి రూ. 32,000 విలువైన ఫ్రీ ఎక్స్‌టెండెడ్ వారంటీ (5 ఇయర్స్) అందిస్తుంది. AWD స్ట్రాంగ్ హైబ్రిడ్ వేరియంట్లపై గరిష్టంగా రూ. 2.74 లక్షల వరకు ఆదా పొందే అవకాశం ఉంది. ఇది ఈ నెలలో అత్యధిక డిస్కౌంట్ పొందిన మోడల్గా గుర్తింపు తెచ్చుకుంది.

⦿ ఇన్విక్టో (స్ట్రాంగ్ హైబ్రిడ్ MPV)

ఈ హైబ్రిడ్ కారుపై మొత్తం బెనిఫిట్స్  రూ. 2.15 లక్షల నుంచి రూ. 2.18 లక్షల వరకు అందిస్తుంది. రూ. 1 లక్షల వరకు ఎక్స్చేంజ్ బోనస్, రూ. 1 లక్ష వరకు స్క్రాపేజ్ బెనిఫిట్, రూ. 15,000 నుంచి రూ. 18,000 అదనపు కన్జ్యూమర్/కార్పొరేట్ ఆఫర్లు అందిస్తుంది. ఆల్ఫా ప్లస్ వేరియంట్‌పై గరిష్ట ఆదా లభిస్తుంది.

Advertisement

మారుతి సుజుకి అందిస్తున్న ఈ ఆఫర్లు డీలర్, సిటీ, అందుబాటులో ఉన్న స్టాక్ అధారంగా మారే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఎక్స్చేంజ్, స్క్రాపేజ్ బట్టి మారవచ్చు. గ్రాండ్ విటారా మైల్డ్ హైబ్రిడ్, పెట్రోల్ వేరియంట్లపై కూడా రూ. 1 లక్షకు పైగా ఆఫర్లు ఉన్నాయి. కానీ స్ట్రాంగ్ హైబ్రిడ్‌పైనే ఎక్కువగా ఆఫర్లు అందిస్తుంది. ఈ ఆఫర్లు డిసెంబర్ 31, 2025 వరకు మాత్రమే చెల్లుబాటు అవుతాయి. కచ్చితమైన ఆఫర్ వివరాలు, ఆన్ రోడ్ ధర కోసం దగ్గర లోని మారుతి NEXA డీలర్‌ను సంప్రదించడం బెస్ట్. స్టాక్ త్వరగా అయిపోవచ్చు.. కాబట్టి త్వరగా కార్లను కొనుగోలు చేయడం బెస్ట్.

Related News

2027లో కొత్త నెక్సాన్.. డిజైన్ నుంచి ఇంజిన్ వరకు అన్నీ మారనున్నాయా?

5 ఏళ్ల తర్వాత పజెరో రీఎంట్రీ.. కొత్త లుక్‌తో మిత్సుబిషి బిగ్ సర్‌ప్రైజ్!

EV కొనేముందు ఈ విషయం చెక్ చేశారా? లేదంటే ఇబ్బందులు తప్పవు!

టాటా దూకుడు.. మహీంద్రా జోరు! ఆగస్టు అమ్మకాల్లో ఎవరు టాప్?

హోండా కొత్త ఈ-స్కూటర్‌కు పేటెంట్.. స్పీడ్ ఎంతో తెలిస్తే వావ్ అనాల్సిందే!

100 కి.మీ స్పీడ్.. 200 కి.మీ రేంజ్.. ఆంపియర్ కొత్త ఎలక్ట్రిక్ బైక్‌కు పేటెంట్!

బజాజ్ బిగ్ రికార్డ్.. 3 లక్షల EV అమ్మకాలు దాటేసింది!

8 నెలల్లోనే 10 లక్షలు.. ఎలక్ట్రిక్ స్కూటర్ల సేల్ లో అదిరిపోయే రికార్డ్!

Big Stories

Advertisement
×