E-Paper
Advertisement

KCR With JAGAN: జగన్‌కు కేసీఆర్ గిఫ్ట్.. వైసీపీ నేతలు ఫుల్ ఎంజాయ్, మేటరేంటి?

KCR With JAGAN: జగన్‌కు కేసీఆర్ గిఫ్ట్.. వైసీపీ నేతలు ఫుల్ ఎంజాయ్, మేటరేంటి?
Advertisement

KCR With JAGAN: జగన్ పుట్టినరోజు మీడియా ముందుకొచ్చారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. మీడియాకు కావల్సినంత మసాలా ఇచ్చారు. సీఎం చంద్రబాబుపై కేసీఆర్ పేల్చిన డైలాగులపై వైసీపీ నేతలు ఫుల్ ఎంజాయ్ చేశారు. అంతేకాదు అధినేత హ్యాపీగా ఫీలయ్యారని అంటున్నారు ఆ పార్టీలోకి కొందరు నేతలు. కేసీఆర్ మీడియా సమావేశాన్ని చివరివరకు జగన్ తిలకించినట్టు తెలుస్తోంది.

కేసీఆర్ సమావేశంపై వైసీపీ నేతలు ఫుల్ ఎంజాయ్

Advertisement

దాదాపు రెండేళ్లు తర్వాత మీడియా ముందుకొచ్చారు మాజీ సీఎం కేసీఆర్. ఎప్పటి మాదిరిగా అధికార ప్రభుత్వంపై దుమ్మెత్తిపోశారు. కేవలం రెండు లేదా మూడు అంశాల గురించి ప్రధానంగా మాట్లాడారు. రెండేళ్లు సమయం ఇవ్వాలని ఆలోచించి ఇప్పుడు వచ్చానని చెప్పారు.

కేవలం తెలంగాణ రాజకీయాల గురించి మాట్లాడితే ఆసక్తి ఉండదని భావించిన కేసీఆర్.. చంద్రబాబు గురించి ప్రస్తావించారు.  అందులో ఆనాటి పాలమూరు సమావేశం, 13 కోట్ల వ్యవహారం, 2014-19 మధ్య విశాఖ సమ్మిట్ గురించి తనదైన శైలిలో మాట్లాడి సమావేశాన్ని ముగించారు. చంద్రబాబు గురించి కేసీఆర్ మాట్లాడిన కొన్ని అంశాలపై వైసీపీ అధినేత హ్యాపీగా ఫీలయ్యారట.

Advertisement

చంద్రబాబు పేరు ప్రస్తావనపై తెలంగాణ టీడీపీ నేతలు ఆగ్రహం

ఒకవిధంగా చెప్పాలంటే వైసీపీ అధినేత జగన్ పుట్టిన రోజునాడు కేసీఆర్ ఈ విధంగా గిఫ్ట్ ఇచ్చారని కొందరు నేతలు అంటున్నారు. రెండేళ్లు తర్వాత కేసీఆర్ మీడియా ముందుకు రావడం, ఆయన చెప్పిన మాటలు ప్రజల్లోకి సూటిగా వెళ్లిపోయాయని అన్నారట. ఇకపై అదే ఒరవడి మనం కంటిన్యూ చేయాలని కొందరి నేతలతో రాత్రి జగన్ అన్నట్లు ఆ పార్టీ నుంచి ఓ ఫీలర్ బయటకువచ్చింది.

దీనిపై మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ మాట్లాడారు. సీఎం చంద్రబాబు కోసం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు 100 శాతం కరెక్ట్ అని అన్నారు. కేసీఆర్ ఏనాడూ అబద్దాలు మాట్లాడలేదన్నారు. అందుకే ఆయన పెద్ద నేత అయ్యారని అన్నారు. కేసీఆర్ వ్యాఖ్యలతో తాను పూర్తిగా ఏకీభవిస్తున్నానని తెలిపారు.  ప్రభుత్వంలో ఉండి ప్రజల కోసం ఆలోచించాలని, కొడుకు-కుటుంబం కోసం కాదన్నారు.

ఇక కేసీఆర్ ఎప్పుడు మాట్లాడినా, చంద్రబాబు పేరు లేకుండా మాట్లాడిన సందర్భం లేదు. ఆయన పేరు ప్రస్తావించి జనాల దృష్టిని తనవైపు ఆకర్షించుకుంటారని అంటున్నారు. అయినా తెలంగాణ రాజకీయాలకు గురించి మాట్లాడాల్సిన కేసీఆర్, అక్కడ ఏమీ లేకపోవడంతో ఏపీ గురించి ప్రస్తావించారని అంటున్నారు తెలంగాణలోని టీడీపీ నేతలు. ఈ మధ్యకాలం  ఏపీ-తెలంగాణ సీఎంలు ఒకే వేదికపై కనిపిస్తున్నారు. దాన్ని తట్టుకోలేక కేసీఆర్ ఆ విధంగా మాట్లాడారని అంటున్నారు.

ALSO READ:  జగన్ బర్త్ డే సెలబ్రేషన్స్..  బొత్స అనూష ఆధ్వర్యంలో రక్తదాన కార్యక్రమం

ఆ పార్టీకి స్టాండ్ లేకపోతే టీడీపీపై దుమ్మెత్తిపోస్తారని అంటున్నారు. అసలు బీఆర్ఎస్ పార్టీ ఉందా? టీఆర్ఎస్ పార్టీ ఉందా? అనేది క్లారిటీ లేకుండా కేసీఆర్ మాట్లాడారని అంటున్నారు. తెలంగాణను పదేళ్లు పాలించిన కేసీఆర్, ఏం చేశారని ప్రశ్నల మీద ప్రశ్నలు రైజ్ చేస్తున్నారు. మొత్తానికి కేసీఆర్ మాట్లాడిన మాటలపై ఇప్పుడు తెలంగాణ వ్యాప్తంగా చర్చ జరుగుతోంది.

Related News

విమర్శలు పట్టించుకోను.. నా పని నేను చేసుకుపోతా! ఎమ్మెల్సీ చంద్రశేఖర్‌రెడ్డికి మంత్రి నారాయణ కౌంటర్

తిరుమలలో ప్రైవేట్ వాహనాలపై TTD క్లారిటీ

పవన్ కళ్యాణ్ ఎమోషనల్ పోస్ట్‌.. సీఎం సతీశన్ మనసులోని మాట

బిగ్ టీవీ ఎఫెక్ట్.. ముగ్గురు అధికారులపై వేటు, ఆశ్రమ పాఠశాలలో విద్యార్థినికి గర్భం

డీఎస్సీ రచ్చపై నోరు విప్పిన జనసేన.. ఐదేళ్లలో మీరేం చేశారంటూ వైసీపీని ప్రశ్నించిన మంత్రి దుర్గేష్

బొత్సకు దెబ్బ మీద దెబ్బ.. బెల్లానకు విజయనగరం జిల్లా బాధ్యతలు, వైసీపీ హైకమాండ్ కీలక నిర్ణయం

ఆటోను ఢీ కొట్టిన లారీ.. స్పాట్ లో ముగ్గురు మృతి, విజయనగరం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం

చవితి ముసురు.. తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు, హైదరాబాద్‌లో తెల్లవారుజామున నుంచి..

Big Stories

Advertisement
×