E-Paper
Advertisement

బ్రెజ్జా టర్బో To గ్రాండ్ విటారా.. మారుతి నుంచి 4 క్రేజీ SUVలు వచ్చేస్తున్నాయ్!

బ్రెజ్జా టర్బో To గ్రాండ్ విటారా.. మారుతి నుంచి 4 క్రేజీ SUVలు వచ్చేస్తున్నాయ్!
Advertisement

Maruti Suzuki Upcoming Suvs 2026-27: దేశంలో SUVలకు డిమాండ్‌ పెరుగుతున్న నేపథ్యంలో.. వచ్చే రెండేళ్లలో కొత్త మోడళ్లను తీసుకురావడానికి మారుతి సుజుకి రెడీ అవుతోంది.  2026-27లో ఏకంగా నాలుగు కొత్త SUVలను మార్కెట్లోకి తీసుకురావడానికి ప్రయత్నిస్తోంది. ఇందులో కొత్త బ్రెజ్జా ఫేస్‌ లిఫ్ట్, ఫ్రాంక్స్ హైబ్రిడ్, గ్రాండ్ విటారా అప్‌ డేట్ వెర్షన్‌ తో పాటు  కొత్త 7-సీటర్ SUV కూడా ఉండనుంది.

మారుతి సుజుకి ప్రస్తుతం విజన్ 3.0 వ్యూహంపై పని చేస్తోంది. దీని ద్వారా కంపెనీ మోడళ్ల సంఖ్యను పెంచడమే కాకుండా, పెట్రోల్, హైబ్రిడ్, CNG, EV లాంటి అన్ని రకాల పవర్‌ ట్రెయిన్లపై దృష్టి పెట్టాలని చూస్తోంది. 2030-31 నాటికి ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచి, ఎగుమతులను కూడా భారీగా పెంచాలని టార్గెట్ పెట్టుకుంది. ముఖ్యంగా SUV సెగ్మెంట్‌ లో తన స్థానాన్ని మరింత బలోపేతం చేసుకునేందుకు ప్రయత్నిస్తోంది.

⦿ కొత్త బ్రెజ్జా ఫేస్‌ లిఫ్ట్‌

Advertisement

తన లైనప్ లో భాగంగా కొత్త బ్రెజ్జా ఫేస్‌ లిఫ్ట్‌ ను తీసుకురాబోతోంది. ప్రస్తుతం ఉన్న మోడల్‌ తో పోలిస్తే, ఈ కొత్త వెర్షన్‌ లో టర్బో పెట్రోల్ ఇంజన్ వచ్చే అవకాశం ఉంది. ఈ ఇంజన్‌ను ఇప్పటికే ఫ్రాంక్స్‌ లో ఉపయోగిస్తున్నారు. కొత్త బ్రెజ్జాలో 6 స్పీడ్ మాన్యువల్ గేర్‌ బాక్స్ కూడా అందించే అవకాశం ఉందని తెలుస్తోంది. అంతేకాకుండా, కొత్త ఇన్ఫోటైన్‌ మెంట్ స్క్రీన్, అదనపు ఫీచర్లు, కొత్త ట్రిమ్స్‌ తో ఈ SUV మరింత ప్రీమియంగా కనిపించనుంది.

⦿ ఫ్రాంక్స్ హైబ్రిడ్

ఫ్రాంక్స్ 2027లో కొత్త హైబ్రిడ్ టెక్నాలజీతో రానుంది. మారుతి సుజుకి స్వయంగా అభివృద్ధి చేస్తున్న స్ట్రాంగ్ హైబ్రిడ్ సిస్టమ్‌ ను ఉపయోగించే తొలి మోడల్ గా అందుబాటులోకి రానుంది. ఈ టెక్నాలజీ వల్ల మైలేజ్ మెరుగుపడటంతో పాటు ఇంధన వినియోగం కూడా తగ్గే అవకాశం ఉంది. ఈ SUVలో ADAS లాంటి ఆధునిక సేఫ్టీ ఫీచర్లు కూడా వచ్చే అవకాశం కనిపిస్తోంది. టెస్ట్ సమయంలో కనిపించిన వాహనాల్లో రాడార్ సెన్సార్లు ఈ ఊహాగానాలకు బలం చేకూర్చుతున్నాయి.

⦿ గ్రాండ్ విటారా ఫేస్‌ లిఫ్ట్

Advertisement

గ్రాండ్ విటారా కూడా త్వరలో కొత్త అప్‌ డేట్‌ ను పొందనుంది. 2026 సెకెండ్ హాఫ్ లో ఈ SUV ఫేస్‌ లిఫ్ట్ వెర్షన్ విడుదలయ్యే అవకాశం ఉంది. ఇందులో స్వల్ప డిజైన్ మార్పులతో పాటు, కొత్త ఫీచర్లు రానున్నాయి. ప్రస్తుతం ఉన్న మైల్డ్ హైబ్రిడ్, స్ట్రాంగ్ హైబ్రిడ్ ఇంజన్ ఆప్షన్‌ లు కొనసాగుతాయని తెలుస్తోంది.

⦿ 7 సీటర్ SUV

అటు మారుతి కొత్త 7 సీటర్ SUVని కూడా తయారు చేస్తోంది. ఇది గ్రాండ్ విటారా ఆధారంగా రూపొందుతోంది. ప్లాట్‌ ఫారమ్, ఇంజన్, ఫీచర్లు చాలా వరకు ఒకేలా ఉండే అవకాశం ఉన్నా, అదనపు సీట్ల కోసం దీని పొడవు ఎక్కువగా ఉండనుంది. పెద్ద కుటుంబాలను దృష్టిలో పెట్టుకుని ఈ SUVను తీసుకురావాలని కంపెనీ భావిస్తోంది.

Read Also: కొనుగోలుదారులకు మారుతి సుజుకి షాక్.. అన్ని మోడళ్ల ధరల పెంపు!

Related News

క్లాసిక్ లుక్.. మోడ్రన్ టెక్నాలజీ.. ట్రయంఫ్ బోన్నెవిల్ T40 వచ్చేసింది!

టెస్లా రోడ్‌స్టర్‌లో ఎయిర్ థ్రస్టర్లు.. ఫెరారీకి ఈ ఆలోచన 2018లో వచ్చిందా?

రెనాల్ట్ డస్టర్ హైబ్రిడ్ vs గ్రాండ్ విటారా vs టయోటా హైరైడర్.. వీటిలో ఏది కొనాలంటే?

స్కోడా కార్లపై అదిరిపోయే ఆఫర్లు.. కైలాక్‌పై ఏకంగా రూ.90 వేల తగ్గింపు!

డౌన్ పేమెంట్ లేకుండానే బైక్ కొనేయండి.. జావా, యెజ్డీ అదిరిపోయే ఫెస్టివ్ ఆఫర్లు!

ఏకంగా 4 SUVలు, ఓ పికప్ ట్రక్.. జీప్ ప్లాన్ మామూలుగా లేదుగా!

విడా నుంచి కొత్త ఎలక్ట్రిక్ బైక్.. జస్ట్ 100 యూనిట్లే!

కొత్త రెనాల్ట్ డస్టర్ హైబ్రిడ్ వచ్చేసింది, మైలేజ్ ఎంతో తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే!

Big Stories

Advertisement
×