E-Paper
Advertisement

బుమ్రాపై చేసిన వ్యాఖ్యలకు క్లారిటీ ఇచ్చిన రామ్ చరణ్.. అది మానవ తప్పిదమంటూ క్షమాపణ!

బుమ్రాపై చేసిన వ్యాఖ్యలకు క్లారిటీ ఇచ్చిన రామ్ చరణ్.. అది మానవ తప్పిదమంటూ క్షమాపణ!
Advertisement

Ram Charan: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రాను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి. తన తాజా చిత్రం ప్రమోషన్స్‌లో భాగంగా బుమ్రాను ఫుట్‌బాల్ ప్లేయర్‌గా సంబోధించిన చరణ్.. ఆ తర్వాత తన పొరపాటును గ్రహించి అంతే హుందాగా బహిరంగ క్షమాపణలు కోరారు.

Read also-ఓటీటీలో హత్రాస్ అరాచకం.. చూస్తే కన్నీళ్ళు ఆగవు మావా

అసలేం జరిగింది?

Advertisement

రామ్ చరణ్ కథానాయకుడిగా బుచ్చిబాబు సన దర్శకత్వంలో తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక స్పోర్ట్స్ డ్రామా ‘పెద్ది’ (Peddi). ఈ సినిమాకు సంబంధించిన ఒక గ్రాండ్ సాంగ్ లాంచ్ ఈవెంట్‌ను ఇటీవల మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో నిర్వహించారు. ఈ వేడుకలో రామ్ చరణ్‌తో పాటు సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్, హీరోయిన్ జాన్వీ కపూర్ పాల్గొన్నారు.

ఈవెంట్ వేదికపై జరిగిన ఒక రాపిడ్ ఫైర్ రౌండ్‌లో హోస్ట్, భారత క్రికెటర్ల గురించి ఒక్క ముక్కలో చెప్పమని రామ్ చరణ్‌ను అడిగారు. దానికి చరణ్ స్పందిస్తూ… సచిన్ టెండూల్కర్‌ను “లాంగ్ అండ్ లెజెండరీ రన్” అని, ధోనిని “కామ్ అండ్ కూల్” అని, రోహిత్ శర్మను “అందరివాడు” అని, విరాట్ కోహ్లీని “ఫైర్” అని కొనియాడారు.

Advertisement

అయితే, చివరిగా జస్ప్రీత్ బుమ్రా పేరు అడిగినప్పుడు రామ్ చరణ్ పొరపాటున ఇలా అన్నారు:

“జస్ప్రీత్ బుమ్రా జీ, నేను మీ బిగ్గెస్ట్ ఫ్యాన్‌ని. నాకు ఫుట్‌బాల్ అంటే చాలా ఇష్టం. మీరు ఫుట్‌బాల్‌ను ఇంత ముందుకు తీసుకువెళ్తున్నారు. లవ్ యూ సర్.”

ప్రపంచ స్థాయి క్రికెట్ బౌలర్ అయిన బుమ్రాను, ఫుట్‌బాల్ ప్లేయర్‌గా చరణ్ సంబోధించడంతో ఆ క్లిప్ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయింది. నెటిజన్లు దీనిపై రకరకాలుగా స్పందించడం ప్రారంభించారు.

ఎక్స్ వేదికగా చరణ్ స్పందన

ఈ మిక్స్-అప్ సోషల్ మీడియాలో చర్చనీయాంశం కావడంతో రామ్ చరణ్ వెంటనే స్పందించారు. తన అధికారిక సోషల్ మీడియా ఖాతా ద్వారా బుమ్రాకు క్షమాపణలు చెప్తూ ఒక నోట్ షేర్ చేశారు. “నాకు ఒక్కోసారి పేర్లు, విషయాలు ఇలా గుర్తుండవు. ఆ మిక్స్-అప్‌కు జస్ప్రీత్ బుమ్రా గారికి క్షమాపణలు తెలియజేస్తున్నాను. అక్కడ ఉన్న జనాల రద్దీ, ఆ ఉత్సాహం మధ్య జరిగిన ఒక చిన్న ‘మానవ సహజ పొరపాటు’  ఇది. మీ ఆటపై నాకు ఎంతో గౌరవం ఉంది. నేను మీ పెద్ద అభిమానిని. మీరు నిలకడగా బ్యాటర్లను ఇబ్బంది పెడుతూ, భారతీయులందరికీ గర్వకారణంగా నిలుస్తున్నారు.” అంటూ చరణ్ రాసుకొచ్చారు.

Read also-బంగారం-వెండి కొనుగోళ్లకు సరైన సమయమా? మార్కెట్లో ధరల మాటేంటి, ఇంకా తగ్గవచ్చా?

నెటిజన్ల ప్రశంసలు

సాధారణంగా స్టార్ హీరోలు తమ పొరపాట్లను ఒప్పుకోవడానికి సంకోచిస్తుంటారు. కానీ రామ్ చరణ్ ఏమాత్రం ఈగోకు పోకుండా, తనది “మానవ సహజ పొరపాటు” అని ఒప్పుకుంటూ బుమ్రా ఆటపై ఉన్న గౌరవాన్ని చాటడం పట్ల నెటిజన్లు, క్రికెట్ అభిమానులు ప్రశంసలు కురిపిస్తున్నారు. కాగా, రామ్ చరణ్ విభిన్న క్రీడల నేపథ్యంలో నటిస్తున్న ‘పెద్ది’ చిత్రం జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.

Related News

టాక్సిక్ ..500కోట్లు అయ్యే పనేనా ?

మా ఆయన కోసమే గాయమైనట్టుంది… పెళ్లి తర్వాత మూడు నెలలు కలవలేదంటూ!

శ్రీకృష్ణుడిగా రౌడీ హీరో విజయ్ దేవరకొండ.. దిల్ రాజు క్రేజీ రీమేక్ ప్లాన్

బన్నీ ట్రిపుల్ రోల్‌పై కొత్త ట్విస్ట్.. ‘రాకా’ కథ మొత్తం మారిపోయిందా?

డెనిమ్‌లో మాల్వి మల్హోత్రా.. బ్లూ బ్యూటీని చూస్తే చూపు తిప్పుకోవడం కష్టమే!

ఇరుముడి బాక్సాఫీస్ రన్.. రూ.300 కోట్లు సాధ్యమేనా?

ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి కొడుకు కేసులో బిగ్ ట్విస్ట్…

ఇరుముడి సీక్వెల్ సినిమాలో రామ్ చరణ్.. ఫాన్స్ కు పూనకాలే!

Big Stories

Advertisement
×