E-Paper
Advertisement

మారుతి సుజుకి సూపర్ జోష్.. వామ్మో, ఒక్క నెలలో అన్ని లక్షల కార్లు అమ్మిందా?

మారుతి సుజుకి సూపర్ జోష్.. వామ్మో, ఒక్క నెలలో అన్ని లక్షల కార్లు అమ్మిందా?
Advertisement

Maruti Suzuki Hits New Sales Milestone: భారతీయ కారు మార్కెట్ లో మారుతి సుజుకి ఇండియా సరికొత్త రికార్డు క్రియేట్ చేసింది. ఏప్రిల్ 2026లో అత్యధిక నెలవారీ అమ్మకాల రికార్డును నమోదు చేసింది. దేశీయంగా కార్లకు పెరుగుతున్న డిమాండ్, ముఖ్యంగా SUVలపై ఆసక్తి, ఎగుమతుల్లో వృద్ధితో కంపెనీ తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది.

ఒకే నెలలో 2.39 లక్షల యూనిట్ల అమ్మకం

ఈ ఏడాది ఏప్రిల్‌ లో కంపెనీ మొత్తం 2,39,646 కార్లను అమ్మింది. గత ఏడాది ఇదే నెలలో ఈ సంఖ్య 1,79,791 యూనిట్లుగా ఉండగా, ఈసారి భారీగా సత్తా చాటింది. దేశీయ అమ్మకాల పరంగానూ మంచి ఫలితాలు వచ్చాయి. ఈ నెలలో 1,91,122 కార్లు భారత్ లోనే అమ్ముడయ్యాయి. ఎగుమతులు 40,054 యూనిట్లకు చేరుకోగా, ఇతర కంపెనీలకు సరఫరా చేసిన వాహనాలు 8,470 యూనిట్లుగా నమోదయ్యాయి.

ప్యాసింజర్ వెహికల్స్ లో జోరు

Advertisement

ప్యాసింజర్ వాహనాల విభాగంలో మారుతి సుజుకి భారీ పెరుగుదలను సాధించింది. గత ఏడాది ఏప్రిల్‌ లో 1,38,704 యూనిట్లు అమ్ముడవగా, ఈసారి ఆ సంఖ్య 1,87,704కి చేరింది. ముఖ్యంగా SUVల విభాగంలో కంపెనీ దూసుకెళ్లింది. మారుతి సుజుకి బ్రెజ్జా, ఎర్టిగా, ఫ్రాంక్స్, గ్రాండ్ విటారా, జిమ్మి మోడళ్లకు మంచి డిమాండ్ ఏర్పడింది. ఈ విభాగం అమ్మకాలు 59,022 నుంచి 77,892 యూనిట్లకు పెరిగింది.

కాంపాక్ట్ కార్ల విభాగంలోనూ..

కాంపాక్ట్ కార్ల విభాగంలో కూడా కంపెనీ మంచి వృద్ధిని సాధించింది. మారుతి సుజుకి స్విఫ్ట్, బాలెనో, డిజైర్, వాగన్ ఆర్ లాంటి మోడల్స్ అమ్మకాలు 61,912 నుంచి 80,659 యూనిట్లకు పెరిగాయి. అదే సమయంలో ఎంట్రీ లెవల్ కార్లైన మారుతి సుజుకి ఆల్టో, ఎస్ ప్రెస్సో కూడా గతంతో పోలిస్తే భారీ అమ్మకాలు నమోదు చేశాయి.

Advertisement

అటు కమర్షియల్ వాహనాల్లో ఫర్వాలేదు అనిపించింది. మారుతి సుజుకి ఈకో ఆధారంగా రూపొందిన వ్యాన్ అమ్మకాలు పెరిగాయి. మారుతి సుజుకి సూపర్ క్యారీ అమ్మకాలు కూడా స్థిరంగా కొనసాగుతున్నాయి.

ఎగుమతుల్లోనూ మారుతి దూకుడు

ఎగుమతుల్లోనూ కంపెనీ సత్తా చాటింది. గత ఏడాది 27,911 యూనిట్లతో పోలిస్తే, ఈసారి 40,054 యూనిట్లు విదేశాలకు పంపింది. దేశీయంగా మొత్తం అమ్మకాలు కూడా 1,51,880 నుంచి 1,99,592 యూనిట్లకు పెరిగింది. ఏప్రిల్ లో మారుతి సుజుకి అన్ని విభాగాల్లో మంచి వృద్ధిని సాధించింది. మార్కెట్‌ లో ఉన్న స్థిరత్వాన్ని, వినియోగదారుల విశ్వాసానికి ఈ అమ్మకాలు నిదర్శనంగా నిలుస్తున్నాయి.

Read Also: బిఎండబ్ల్యూ To మెర్సిడెస్.. 2026లో లాంచ్ కాబోయే టాప్ 5 లగ్జరీ కార్లు ఇవే!

Related News

హోండా 0 ఆల్ఫా SUV లాంచ్ డేట్ ఫిక్స్.. రేంజ్, ఫీచర్లు చూస్తే పిచ్చెక్కిపోవాల్సిందే!

కారులో రాకెట్ టెక్నాలజీ.. స్పేస్‌ ఎక్స్‌ తో టెస్లా కొత్త ప్రయోగం చూస్తే మతిపోవాల్సిందే!

మహీంద్రా XUV 3XO సరికొత్త రికార్డు.. 5 లక్షలు దాటిన సేల్స్!

మారుతి కార్లపై అదిరిపోయే డిస్కౌంట్లు.. ఆ మోడల్ పై ఏకంగా రూ. 1.65 లక్షల తగ్గింపు!

హ్యుందాయ్ క్రెటా సరికొత్త రికార్డు.. 15 లక్షలు దాటిన అమ్మకాలు!

ట్రాక్షన్ కంట్రోల్, ఫాస్ట్ ఛార్జింగ్‌.. అప్ డేటెడ్ టీవీఎస్ రైడర్ లో అదిరిపోయే ఫీచర్లు!

ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ డ్రైవర్ లేకుండానే నడుస్తుంది.. కొత్త టెక్నాలజీ చూస్తే పిచ్చెక్కాల్సిందే!

మైలేజ్‌లో గ్లాంజా.. బూట్ స్పేస్‌లో ఆల్ట్రోజ్.. ఏ CNG కారు కొంటే బెస్ట్?

Big Stories

Advertisement
×