Upcoming Luxury Cars in India: ఈ ఏడాది ఇండియన్ మార్కెట్ లోకి సరికొత్త లగ్జరీ కార్లు అడుగు పెట్టబోతున్నాయి. అత్యాధునిక టెక్నాలజీతో కూడిన ఎలక్ట్రిక్ వాహనాలతో పాటు, హైబ్రిడ్ కార్లు విడుదల కాబోతున్నాయి. పలు పాపులర్ బ్రాండ్స్ కొత్త మోడళ్లను తీసుకురాబోతున్నాయి. ఇంతకీ ఈ ఏడాది లాంచ్ కాబోతున్న లగ్జరీ కార్లు ఏవనేది ఇప్పుడు తెలుసుకుందాం..
బిఎండబ్ల్యూ iX3 LWB లాంగ్ వీల్ బేస్ వెర్షన్ గా మార్కెట్ లోకి అడుగు పెట్టబోతోంది. వెనుక సీట్లలో ఎక్కువ స్థలం ఉంటుంది. పూర్తి ఛార్జ్ పై ఈ కారు సుమారు 650 కిలోమీటర్ల వరకు ప్రయాణించే సామర్థ్యం ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. ఈ కారు ధర సుమారు రూ. 75 నుంచి 85 లక్షల మధ్య ఉండే అవకాశం ఉంది. ప్రీమియం SUV సెగ్మెంట్ లో మంచి ఆప్షన్ కాబోతోంది.
అటు ఆడి Q3 న్యూ జెనరేషన్ మోడల్ కూడా రాబోతోంది. కొత్త డిజైన్, అత్యాధునిక టెక్నాలజీతో వస్తుంది. డిజిటల్ డిస్ ప్లే, అడ్వాన్స్ డ్ డ్రైవింగ్ ఫీచర్లు, కొత్త లైట్ సిస్టమ్ ఇందులో ఉంటాయని భావిస్తున్నారు. 2.0 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ తో సుమారు 205bhp పవర్ ఇస్తుంది. ధర రూ. 57-65 లక్షల మధ్య ఉంటుందని అంచనా వేస్తున్నారు.
సెడాన్ విభాగంలో బిఎండబ్ల్యూ i5 LWB విడుదల కానుంది. ఎలక్ట్రిక్ కారుగా అందుబాటులోకి రానుంది. లాంగ్ వీల్ బేస్ ఉండటం వల్ల వెనుక కూర్చునే వారికి ఎక్కువ కంఫర్ట్ ఉంటుంది. ఒకసారి ఛార్జ్ చేస్తే సుమారు 600 కిలోమీటర్ల వరకు ప్రయాణిస్తుంది.
ఇక మెర్సిడెస్ బెంజ్ S-Class PHEV కూడా భారత మార్కెట్ లోకి రానుంది. ఇది ప్లగ్ ఇన్ హైబ్రిడ్ టెక్నాలజీతో వస్తుంది. అంటే పెట్రోల్‌తో పాటు ఎలక్ట్రిక్ పవర్ కూడా ఉపయోగించుకోవచ్చు. కొత్త ఫీచర్లు, పెద్ద టచ్ స్క్రీన్ లాంటి సౌకర్యాలు ఇందులో ఉంటాయి. లగ్జరీ సెడాన్ సెగ్మెంట్ లో ఇదో బెస్ట్ ఆప్షన్ కానుంది.
అటు మెర్సిడెస్ బెంజ్ GLC EV LWB కూడా విడుదల కానుంది. ఇది కొత్త తరం ఎలక్ట్రిక్ SUVగా రానుంది. సుమారు 650 కిలోమీటర్ల రేంజ్ ఇస్తుందని తెలుస్తోంది. ధర రూ. 80-85 లక్షల మధ్య ఉండొచ్చని భావిస్తున్నారు. ప్లేస్, పర్ఫార్మెన్స్, రేంజ్ కలిసి దీనిని ఓ ప్రీమియం ఆప్షన్ గా మార్చుతుంది.
2026లో లగ్జరీ కార్ల మార్కెట్ లో ఎలక్ట్రిక్, హైబ్రిడ్ కార్లకు ఎక్ఉ ప్రాధాన్యత పెరుగుతోంది. కొత్త మోడళ్లతో కంపెనీలు వినియోగదారులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నాయి. ఒకవేళ మీరు కూడా లగ్జరీ కార్లు తీసుకోవాలని భావిస్తే, వీటిలో ఒకదానిని సెలెక్ట్ చేసుకోవచ్చు.
Read Also: టైర్ పగిలినా నో టెన్షన్.. ఈ కారు మూడు చక్రాలతో పరుగులు తీస్తుంది!