E-Paper
Advertisement

Maruti Wagon R 2026: అదిరిపోయే డిజైన్, ఏకంగా 37 కిలో మీటర్ల మైలేజ్.. మార్కెట్ లోకి సరికొత్త మారుతి వ్యాగన్ R

Maruti Wagon R 2026: అదిరిపోయే డిజైన్, ఏకంగా 37 కిలో మీటర్ల మైలేజ్.. మార్కెట్ లోకి సరికొత్త మారుతి వ్యాగన్ R
Advertisement

Maruti Wagon R 2026 Launch: మారుతి సుజుకి వ్యాగన్ R గురించి ఇండియన్ కారు లవర్స్ కు పెద్దగా పరిచయం అవసరం లేదు. అత్యంత నమ్మకమైన కార్లలో ఒకటిగా గుర్తింపు తెచ్చుకుంది. మంచి మైలేజ్, తక్కువ మెయింటెనెన్స్ ఖర్చులతో ఆకట్టుకుంది. ఇప్పుడు అదే కారు సరికొత్తగా మార్కెట్ లోకి అడుగు పెట్టబోతోంది. మారుతి సుజుకి వ్యాగన్ R 2026 పేరుతో పరిచయం కాబోతోంది. గత మోడల్ తో పోల్చితే మరింత విశాలంగా, మరింత సమర్థవంతమైన పనితీరుతో ఆకట్టుకునేందుకు రెడీ అవుతోంది.

మారుతి సుజుకి వ్యాగన్ R సరికొత్తగా..

మారుతి సుజుకి వ్యాగన్ R 2026 సాధారణ ఫేస్‌ లిఫ్ట్ గానే కాకుండా, 7 సీట్ల కాన్ఫిగరేషన్, రిఫ్రెష్ చేసిన స్టైలింగ్, అప్‌ గ్రేడ్ చేసిన ఇంటీరియర్స్, మెరుగైన టెక్నాలజీ, దాని CNG రూపంలో 37 కి.మీ వరకు మైలేజీతో వస్తుంది. ఈ మోడల్ ఆధునిక భారతీయ కుటుంబాలకు పెరుగుతున్న అవసరాలను తీర్చడానికి అనుకూలంగా ఉండబోతోంది.

Advertisement

మోడల్ మారుతి వ్యాగన్ R 2026 మోడల్ 7 సీటర్ తో వస్తుంది. పెట్రోల్ + CNG ఇంజిన్ ఎంపికలను కలిగి ఉంటుంది. CNG వెర్షన్ 37 కి.మీ మైలేజ్ ఇస్తుంది. ట్రాన్స్ మిషన్ మాన్యువల్, ఆటో మేటిక్ వెర్షన్లలో రానుంది. ఫ్రంట్ వీల్ డ్రైవ్, కనెక్టివిటీతో కూడిన ఇన్ఫోటైన్‌మెంట్ టచ్‌ స్క్రీన్, సేఫ్టీ కోసం డ్యూయల్ ఎయిర్‌ బ్యాగ్‌లు, ABS లాంటి ఫీచర్లను కలిగి ఉంటుంది. ఇక సరికొత్త మారుతి సుజుకి వ్యాగన్ R అంచనా ధర రూ. 6.5 లక్షల నుంచి (ఎక్స్ షోరూమ్) ప్రారంభం అవుతుందని భావిస్తున్నారు.

తక్కువ ధర, తక్కువ మెయింటెనెన్స్   

మారుతి వ్యాగన్ R 2026 ధర తక్కువగా ఉండటంతో పాటు తక్కువ మెయింటెనెన్స్ ఖర్చులను కలిగి ఉంటుంది. ఇప్పటి వకు వ్యాగన్ R టాల్ బాయ్ డిజైన్ ను కలిగి ఉంటుంది. మారుతి వ్యాగన్ R 2026 ఆ థీమ్‌ తోనే కొనసాగుతుంది. ఇంకా మెరుగైన డిజైన్ కలిగి ఉంటుంది. విశాలమైన గ్రిల్‌, అందమైన హెడ్‌ లైట్లు, బంపర్‌ను కొద్దిగా స్పోర్టియర్‌గా కనిపించేలా తయారు చేశారు.

ఇంటీరియర్, కంఫర్ట్

Advertisement

మారుతి వాగన్ R 2026 లోపల7 సీటర్ లే అవుట్ ను కలిగి ఉంటుంది. కుటుంబ సభ్యులంతా హ్యాపీగా వెళ్లేలా ఉంటుంది.  డ్యాష్‌ బోర్డ్ శుభ్రంగా కనిపిస్తుంది. ఎక్కువ ప్రీమియంగా ఉంటుంది. ఏడు సీట్లు ఉన్నప్పటికీ క్యాబిన్ ఇరుకుగా అనిపించదు. ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్ ప్లే కు సపోర్టు చేసే పెద్ద టచ్‌ స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌తో వస్తుంది. ఇది నావిగేషన్, కాల్స్, మ్యూజిక్ స్ట్రీమింగ్ కోసం స్మార్ట్‌ ఫోన్ ఇంటిగ్రేషన్‌ను అనుమతిస్తుంది. స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్స్, బ్లూటూత్ కనెక్టివిటీ, USB ఛార్జింగ్ పోర్ట్‌లు, రియర్ పార్కింగ్ కెమెరా, కీలెస్ ఎంట్రీ లాంటి ఫీచర్లను కలిగి ఉంటుంది.

భద్రతా ఫీచర్లు, ధర  

మారుతి వ్యాగన్ R 2026 మరిన్ని భద్రతా ఫీచర్లను కలిగి ఉంటుంది. డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్‌ బ్యాగ్‌లు, EBDతో ABS, వెనుక పార్కింగ్ సెన్సార్లు, సీట్ బెల్ట్ రిమైండర్లు, మంచి బిల్డ్ క్వాలిటీని కలిగి ఉంటుంది.మారుతి వ్యాగన్ R 2026 అంచనా ప్రారంభ ధర సుమారు రూ.6.5 లక్షలు (ఎక్స్-షోరూమ్) ఉంటుంది. ఈ కారు మరికొద్ది నెలల్లోనే లాంచ్ అయ్యే అవకాశం ఉంది.

Read Also:  కొత్త కారు కొంటున్నారా? ఈ 8 ఫీచర్లు కచ్చితంగా ఉండేలా చూసుకోండి!

Related News

మినీ సైజ్.. మ్యాక్సిమమ్ స్టైల్.. ఈ మైక్రో ఈవీలు భారత్‌లోకి వస్తే సూపర్ హిట్ పక్కా!

25 ఏళ్ల క్రితమే భారత్ లో పరుగులు తీసిన ఎలక్ట్రిక్ కారు.. మళ్లీ మార్కెట్ లోకి వస్తుందా?

లాంచ్‌కు ముందే క్రేజీ డీటైల్స్ లీక్.. కొత్త బ్రెజ్జాలో ఫీచర్లు చూస్తే మతిపోవాల్సిందే!

ఆగస్టు 15న మహీంద్రా బిగ్ బ్లాస్ట్.. 3 కొత్త SUVలు వచ్చేస్తున్నాయ్!

టీవీఎస్ నుంచి సూపర్ సర్‌ ప్రైజ్.. ఒకేసారి 3 మోడల్స్ వచ్చేస్తున్నాయ్!

కొత్త బ్రెజ్జా To హిలక్స్.. 10 రోజుల్లో 3 క్రేజీ మోడల్స్ ఎంట్రీ!

టెస్లా నుంచి పిల్లల కోసం కొత్త బైక్.. రేట్ ఎంత అంటే?

EV బ్యాటరీల్లో ఏది సేఫ్? కొనుగోలు చేసే ముందు ఈ విషయాలు తప్పకుండా తెలుసుకోవాల్సిందే!

Big Stories

Advertisement
×