E-Paper
Advertisement

Essential Car Features: కొత్త కారు కొంటున్నారా? ఈ 8 ఫీచర్లు కచ్చితంగా ఉండేలా చూసుకోండి!

Essential Car Features: కొత్త కారు కొంటున్నారా? ఈ 8 ఫీచర్లు కచ్చితంగా ఉండేలా చూసుకోండి!
Advertisement

8 Safety and Comfort Features In Car: భారతీయ రోడ్లపై భద్రత, సౌకర్యం, సౌలభ్యాన్ని పెంచడానికి ప్రతి కారులో ప్రామాణికంగా కొన్ని ఫీచర్లు ఉండాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ప్రయాణీకుల భద్రత లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకుంది. వినియోగదారులు కారు కొనే సమయంలో ఆ ఫీచర్లు ఉన్నాయో? లేవో? కచ్చితంగా చూసుకోవాలని సూచించింది. కారులో ఉండవలసిన ముఖ్యమైన ఫీచర్లలో 6 ఎయిర్‌ బ్యాగులు, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, EBDతో కూడిన ABS, కారులో ప్రయాణించే వారందరికీ 3 పాయింట్ సీట్‌ బెల్ట్ లాంటివి ఉన్నాయి . ఇంకా, ప్రామాణిక ఫీచర్లలో ISOFIX చైల్డ్ సీట్ మౌంట్స్, వెనుక పార్కింగ్ సెన్సార్లు, కెమెరా, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్, మెరుగైన భద్రత కోసం వెనుక డీఫాగర్ వైపర్ ఉండాలని చెప్పింది.

 భారతీయ కార్లలో ఉండాల్సిన 8 ముఖ్యమైన ఫీచర్లు   

⦿ ఆరు ఎయిర్‌ బ్యాగులు: తప్పనిసరి డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్‌ బ్యాగులతో పాటు ప్రమాదాలలో మొత్తం క్యాబిన్ రక్షణకు ఆరు ఎయిర్‌ బ్యాగులు చాలా ముఖ్యమైనవి. ప్రతి కారులోనూ ఇవి కచ్చితంగా ఉండాల్సిందే.

Advertisement

⦿ ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ (ESC): స్టీరింగ్ నియంత్రణ కోల్పోవడాన్ని గుర్తించి, స్కిడ్డింగ్, రోల్‌ ఓవర్లను నివారించడానికి ఆటో మేటిక్ గా బ్రేకింగ్ వ్యవస్థను యాక్టివేట్ చేసేలా ఇవి ఉపయోగపడుతాయి.

⦿ ప్రయాణీకులందరికీ 3 పాయింట్ సీట్ బెల్టులు: ఈ 3 పాయింట్ సీట్ బెల్టులు ప్రయాణీకులకు భద్రతను మెరుగు పరుస్తుంది. యాక్సిడెంట్ సమయంలో తీవ్రమైన గాయాల ప్రమాదాన్ని తగ్గిస్తుంది.

Advertisement

⦿ ISOFIX చైల్డ్ సీట్ మౌంట్స్: పిల్లల భద్రతా సీట్ల సురక్షితమైన. అందుకే కార్లలో పిల్లలను సురక్షితంగా తీసుకెళ్లేలా ఈ సీట్లు ఎంతో ఉపయోగపడుతాయి.

⦿ వెనుక పార్కింగ్ కెమెరా, సెన్సార్లు: రద్దీగా ఉండే పార్కింగ్ ప్రదేశాలను నావిగేట్ చేయడానికి, పాదచారులు లేదంటే వెనుక ఉన్న అడ్డంకులను గుర్తించి ప్రమాదాలను నివారించడానికి ఇవి చాలా ఉపయోగపడుతాయి.

Read Also: 5 నిమిషాల్లోనే డ్రైవింగ్ లైసెన్స్.. ఔనా? నిజమా?

⦿ టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్: దూర ప్రయాణాలలో భద్రత, ఇంధన సామర్థ్యం కోసం కీలకమైన టైర్ ప్రెజర్‌ ను పర్యవేక్షిస్తుంది. ఎప్పటికప్పుడు టైర్ ప్రెజర్ విషయాన్ని డ్రైవర్ కు అందిస్తుంది.

⦿ వెనుక వైపర్,  డీఫాగర్: వర్షాకాలం, పొగమంచు పరిస్థితులలో విజుబులిటీకి ఇవి చాలా ముఖ్యమైనవి. వెనుక వ్యూను మెరుగుపరుస్తుంది. ప్రయాణ సమయంలో భద్రతకు కారణం అవుతుంది.

⦿ ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్‌ ప్లేతో టచ్‌ స్క్రీన్ ఇన్ఫోటైన్‌ మెంట్: హ్యాండ్‌ హెల్డ్ ఫోన్లతో పోలిస్తే అవసరమైన, సురక్షితమైన, పరధ్యానం లేని నావిగేషన్, కమ్యూనికేషన్‌ను అందిస్తుంది. ఫోన్ కూడా నేరుగా మాట్లాడుకునే అవకాశం ఉంటుంది. చెవి దగ్గర సెల్ ఫోన్ ను ఉంచుకోవాల్సిన అవసరం ఉండదు. దీని ద్వారా ప్రమాదాలు గణనీయంగా తగ్గుతాయి.

Read Also: మహీంద్రా To టాటా.. ఇండియాలో అత్యంత సురక్షిమైన కార్లు ఇవే!

Related News

తక్కువ ధర.. ఎక్కువ మైలేజ్.. మధ్యతరగతి కుటుంబాలకు బెస్ట్ కార్లు!

కార్ల కంపెనీల దగ్గరే చవకగా సెకండ్ హ్యాండ్ కార్లు కొనేయొచ్చు.. జస్ట్ ఇలా చేస్తే చాలు!

హ్యుందాయ్ బౌల్డర్ కు పేటెంట్.. రగ్గడ్ లుక్‌ లో అదిరిపోయిందిగా!

విన్‌ ఫాస్ట్ డబుల్ సర్‌ ప్రైజ్.. కొత్త ఈ-స్కూటర్, ఈ-బైక్‌కు పేటెంట్!

టాటా అవిన్యా X టెస్టింగ్ షురూ.. నెట్టింట వైరల్ అవుతున్న స్పై షాట్స్!

థార్‌ కు నెక్స్ట్ లెవల్ అవతారం.. విజన్ T వచ్చేస్తోంది!

మినీ సైజ్.. మ్యాక్సిమమ్ స్టైల్.. ఈ మైక్రో ఈవీలు భారత్‌లోకి వస్తే సూపర్ హిట్ పక్కా!

25 ఏళ్ల క్రితమే భారత్ లో పరుగులు తీసిన ఎలక్ట్రిక్ కారు.. మళ్లీ మార్కెట్ లోకి వస్తుందా?

Big Stories

Advertisement
×