E-Paper
Advertisement

Relationship secrets: రిలేషన్‌షిప్‌లో భార్య చేసే ఆ ఒక్క ‘సైలెంట్’ మిస్టేక్.. కాపురాన్ని కొల్లాప్స్ చేసేస్తుంది!

Relationship secrets: రిలేషన్‌షిప్‌లో భార్య చేసే ఆ ఒక్క ‘సైలెంట్’ మిస్టేక్.. కాపురాన్ని కొల్లాప్స్ చేసేస్తుంది!

Relationship secrets: సాధారణంగా పెళ్లయ్యాక లైఫ్ అంతా ఇన్‌స్టాగ్రామ్ రీల్స్‌లా కలర్‌ఫుల్‌గా, స్లో మోషన్ సాంగ్స్‌లా ఉంటుందని అనుకుంటే మాత్రం పప్పులో కాలేసినట్టే! ఎందుకంటే రియాలిటీలోకి వస్తే.. రోజువారీ ఎదురయ్యే చిన్న చిన్న ఇష్యూలే అసలైన యుద్దానికి కారణం  అని అర్థమవుతుంది. నిజానికి చాలామంది భార్యలు “నేను గొడవ పడకూడదు.. మౌనంగా ఉంటేనే ఇల్లు పీస్ ఫుల్ గా ఉంటుంది” అని ఒక పెద్ద భ్రమలో (Delusion) బతికేస్తుంటారు. కానీ సరిగ్గా వినండి.. ఆ మౌనమే రిలేషన్‌షిప్‌లో బిగ్గెస్ట్ ‘మిస్టేక్’! మనసులో ఉన్న అసంతృప్తిని బయటపెట్టకుండా లోలోపలే కుమిలిపోవడం అంటే, అది మీ సంసారం అనే సర్వర్‌ని మీరే హ్యాక్ చేసుకున్నట్టు.

మౌనం అర్ధాంగీకారం కాదు.. అది విడాకులకు పునాది!

అంతేకాదు, “నేను చెప్పకపోయినా నా హజ్బెండ్‌కి అర్థం కావాలి, ఆయనే గమనించాలి” అని వెయిట్ చేస్తే ఉపయోగం లేదు. ఎందుకంటే అక్కడ మీ భర్త ఏమీ మైండ్ రీడర్ కాదు కదా! ఆయన ఎప్పుడూ తన వర్క్ మోడ్‌లో ఆయన ఉంటాడు. ఫలితంగా, మీకు ఏం కావాలో క్లారిటీ ఇవ్వకపోతే ఆయనకు నచ్చింది ఆయన చేసుకుంటూ పోతాడు. అది మీకు నచ్చదు, పోనీ కనీసం అప్పుడైనా మీరు నోరు మెదపరు. ఖచ్చితంగా అక్కడే మొదలవుతుంది అసలైన టాక్సిసిటీ. ఆ చిన్న డిసప్పాయింట్మెంట్ మెల్లగా కోపంగా మారి, లోపల ఒక అగ్నిపర్వతంలా రెడీ అవుతుంది. చివరికి ఏదో ఒక రోజు వెయిట్ లేని చిన్న మేటర్‌కి ఆ అగ్నిపర్వతం బ్లాస్ట్ అయినప్పుడు, సిట్యుయేషన్ పూర్తిగా చేజారిపోతుంది.

also read:Kent Emerald: గ్యాస్ స్టవ్‌కు గుడ్‌బై? ఈ ఇండక్షన్ స్టవ్ కొత్త ట్రెండ్!

అసలు విషయంలోకి వస్తే, దాంపత్యం అంటే ఏదో అడ్జస్ట్ అయిపోయి లైఫ్ లాగించేయడం కాదు.. ఇద్దరి మధ్య పక్కాగా ట్రాన్స్‌పరెన్సీ ఉండాలి. మీ భర్త దగ్గర మీకు నచ్చని విషయం ఏది ఉన్నా, మీ మనసులో ఏదైనా ఫియర్ ఉన్నా, లేక చిన్న ఇబ్బంది కలిగినా.. వెంటనే ‘ఓపెన్ అప్’ అవ్వండి. చాలామందికి తెలియని విషయం ఏంటంటే, ఇప్పటికీ చాలామంది ఫీమేల్స్ భర్త పర్మిషన్ లేనిదే ఏదీ చేయకూడదు అనుకుంటారు. కానీ వాస్తవానికి ఇది పర్మిషన్ యుగం కాదు.. ‘పార్టనర్‌షిప్’ యుగం! మీ గోల్స్, మీ నీడ్స్ స్పష్టంగా చెప్పకపోవడం వల్ల ఆయన తనకి తోచింది చేసుకుంటూ వెళ్తాడు. దీనివల్ల భర్త తనను వాల్యూ చేయడం లేదనే నెగెటివ్ ఫీలింగ్ భార్యలో స్టార్ట్ అవుతుంది. ఎప్పుడైతే ఈ కమ్యూనికేషన్ గ్యాప్ పెరుగుతుందో, అప్పుడు ఇద్దరి మధ్య ‘వైబ్ మ్యాచ్’ అస్సల్ మ్యాచ్  అవ్వదు. మాటలు తగ్గుతాయి, ఆ తర్వాత డిస్టెన్స్ పెరుగుతుంది, అల్టిమేట్‌గా అది ‘బ్రేక్ అప్’ లేదా ‘డివోర్స్’ దాకా వెళ్తుంది.

also read:Theatres: థియేటర్లు ఇక మూసుకోవాల్సిందేనా ?

పరిష్కారం ఏంటి?

అందుకే నిపుణులు వార్నింగ్ ఇస్తున్నది ఏంటంటే.. సైలెన్స్ అనేది రిలేషన్‌షిప్‌లో ఒక సీక్రెట్ వెపన్ అనుకుంటే పొరపాటే, అది కేవలం దూరాన్ని పెంచే గోడ మాత్రమే. అయితే, ఇన్‌స్టంట్‌గా రియాక్ట్ అవ్వలేకపోతే పర్లేదు, కొంచెం ‘మీ టైమ్’ తీసుకోండి. కాస్త చిల్ అయ్యాక కూర్చోబెట్టి మేటర్ క్లియర్ గా ఎక్స్ ప్లెయిన్ చేయండి. “నువ్వు ఇలా బిహేవ్ చేయడం నాకు నచ్చలేదు” లేదా “నాకు ఇది కావాలి” అని స్ట్రెయిట్ గా చెప్పడంలో ఏ తప్పూ లేదు. గుర్తుంచుకోండి, మాట్లాడటం వీక్నెస్ కాదు, మాట్లాడకపోవడమే అసలు వీక్నెస్.

సో ..గుర్తుంచుకోండి.. మాట్లాడితే పరిష్కారం దొరుకుతుంది, మౌనం పాటిస్తే బంధం తెగిపోతుంది. సంసారంలో ‘నోరు విప్పడమే’ అసలైన మంత్రం. లేదంటే, ఆ చిన్న మిస్ అండర్ స్టాండింగే రేపు పెద్ద తుఫానులా మారి మీ వరల్డ్‌ని అతలాకుతలం చేస్తుంది. కాబట్టి లేడీస్.. ఇకనైనా ఆ ‘సైలెన్స్ మోడ్’ నుంచి బయటకు రండి, మనసు విప్పి మాట్లాడండి. అప్పుడే మీ రిలేషన్‌షిప్ పక్కాగా సక్సెస్ అవుతుంది!

also read: Relationship Secrets: అత్తింట్లో అడుగుపెడుతున్నారా? ‘క్వీన్’ లా ఉండాలంటే ఈ 5 స్మార్ట్ టిప్స్ మీకోసమే!

 

Related News

ఏసీలో పడుకుంటే తలనొప్పి వస్తోందా? నిపుణులు చెబుతున్న అసలు కారణాలివే!

టీనేజర్ల ఆరోగ్యాన్ని గుల్ల చేస్తున్న ఎనర్జీ డ్రింక్స్.. తస్మాత్ జాగ్రత్త!

ఇంటి బయట ॐతో పాటు ఈ నాలుగు చిహ్నాలుంటే.. మీ జీవితంలో సుఖ సంతోషాలే

మార్కెట్‌ నుంచి తెచ్చిన మొక్కలు ఇంట్లో ఎండిపోతున్నాయా? ఈ టిప్స్ పాటిస్తే ఏళ్ల తరబడి పచ్చగా పెరుగుతాయి

వేసవి నీరసం వల్ల ఓఆర్ఎస్ తాగుతున్నారా? ప్యాకెట్లు వద్దు.. ఇంట్లోనే ఇలా తయారు చేయండి

మీ అబ్బాయి కోసం పెళ్లిసంబంధాలు చూస్తున్నారా? ఈ తేదీల్లో పుట్టిన అమ్మాయి సర్వ గుణ సంపన్నురాలు

వేసవిలో అద్దంలా మెరిసిపోయే ముఖ చర్మం కావాలా? ఈ టిప్స్ మీ కోసమే

కొత్త ఇల్లు మీ కోసం సంతోషాలు తీసుకొస్తుందా లేదా కష్టాలకు కారణమవుతుందా? దీనికి కారణాలు ఇవే

Big Stories

×