Theatres: ఒకప్పుడు సినిమా చూడాలి అంటే థియేటర్‌కే వెళ్లాలి.
ఇప్పుడు?
ఇంట్లోనే పెద్ద స్క్రీన్…డాల్బీ సౌండ్.
ఒక్క క్లిక్‌లో సినిమా.
కుటుంబంతో కంఫర్ట్.
ఇన్ని ఉన్నప్పుడు… ప్రేక్షకుడు ఎందుకు బయటకు రావాలి?
సినిమా అంటే ఎంటర్ టైన్ మెంట్ కాదు.. ‘లగ్జరీ’
ఒక సాంగ్… రెండు ఫైట్లు… మధ్యలో కాస్త సెంటిమెంట్.
దీని కోసం వెయ్యి రూపాయలు తగలేయాలా?
సినిమా ట్రైలర్ లోనే కథ అర్థమైపోతుంటే…
క్లైమాక్స్ కోసం మూడు గంటలు వెయిట్ చేయాలా?
ఇది వినడానికి చేదుగా ఉండొచ్చు.
థియేటర్ అనేది ఇప్పుడు కేవలం ఒక ఎంటర్ టైన్ మెంట్ కాదు, అదొక ‘లగ్జరీ’.
ఆ లగ్జరీకి తగిన వాల్యూ మీ సినిమాలో లేనప్పుడు… ప్రేక్షకుడు తన ఇంట్లోని ఏసీ రిమోట్‌ను నొక్కుతాడు తప్ప,
థియేటర్ మెట్లు ఎక్కడు.
సినిమా బాగుంటే జనం వస్తారు అనేది పాత మాట.
సినిమా ‘థియేటర్ లోనే చూడాలి’ అనిపిస్తేనే జనం వస్తారు… ఇది కొత్త మాట!
థియేటర్ ఎక్స్‌పీరియన్స్ vs ఓటీటీ కంటెంట్: గీత గీసేసిన ఆడియన్!
‘కల్కి 2898 AD’ & ‘సలార్’: ఈ సినిమాలు థియేటర్లలో ఎందుకు ఆడాయి? ఆ భారీతనం, ఆ సౌండ్ డిజైన్ ఇంట్లో చిన్న స్క్రీన్‌పై రాదు కాబట్టి .
ప్రేక్షకుడు ఇప్పుడు ‘అవతార్ 2’ లేదా ‘కల్కి 2898 AD’ వంటి సినిమాలకు ఎందుకు క్యూ కడుతున్నాడు? ఎందుకంటే అవి బిగ్ స్క్రీన్‌పై చూస్తేనే ఆ ఎక్స్పీరియన్స్ వస్తుంది కాబట్టి
అదే ‘బింబిసార’ లేదా ‘హనుమాన్’ సినిమాల్లోని విజువల్ గ్రాండియర్ థియేటర్‌కు రప్పించింది.
అదే ‘నాని’ నటించిన ‘అంటే సుందరానికీ’ లాంటి మంచి సినిమా కూడా థియేటర్లో స్ట్రగుల్ అయ్యి, ఓటీటీలో సెన్సేషన్ అయ్యింది.
అంటే, “ఇంట్లో కూర్చుని చూసే కంటెంట్ వేరు, థియేటర్లో ఎక్స్‌పీరియన్స్ చేసే కంటెంట్ వేరు” అని ప్రేక్షకుడు ఒక గీత గీసేశాడన్న మాట .
మొత్తానికి సాదాసీదా కథలకు థియేటర్ అవసరం లేదని ప్రేక్షకుడికి క్లారిటీ వచ్చేసింది.
“థియేటర్ ఎక్స్‌పీరియన్స్” లేకపోతే అంతే !
‘సలార్’ vs ‘గుంటూరు’ కారం చూస్తె …
సలార్ లో ఆ ఖాన్సార్ ప్రపంచం, ఆ భారీ యాక్షన్ సీక్వెన్స్ ఇంట్లో చూస్తే ఆ కిక్ రాదు. అందుకే ఆడియన్ థియేటర్‌కు వచ్చాడు.
గుంటూరు కారం లో మహేష్ బాబు అనే సూపర్ స్టార్ ఉన్నాడు.
ఫ్యాన్ హీట్ ఉంది. కానీ ఆ కథ, ఆ మేకింగ్ అంతా మనం ఇంట్లో టీవీలో చూసే ఫ్యామిలీ డ్రామాలా అనిపించింది. అందుకే ఓపెనింగ్స్ వచ్చినా, లాంగ్ రన్‌లో అది థియేటర్ ప్రేక్షకుడిని మెప్పించలేకపోయింది.
హీరో ఎంత పెద్దవాడైనా, కంటెంట్ లో “థియేటర్ ఎక్స్‌పీరియన్స్” లేకపోతే అది ఓటీటీ మెటీరియలే అనేదానికి ఇదే బెస్ట్ ఎగ్జాంపుల్ .
‘జైలర్’ లేదా ‘పుష్ప’ లాంటి సినిమాలు. వీటిలో ఉండే ‘మాస్ మూమెంట్స్’ అందరితో కలిసి ఎంజాయ్ చేయాలనే తపన మాత్రమే ఆడియన్స్ ని లాక్కొచ్చింది.
ఆ “కమ్యూనిటీ ఎక్స్‌పీరియన్స్” ఇవ్వని ఏ సినిమా అయినా ఓటీటీ వెయిటింగ్ లిస్ట్‌లోకి వెళ్ళిపోవాల్సిందే.
“గ్రూప్ ఎమోషన్” ని క్రియేట్ చేయలేకపోతున్న సినిమాలు
‘యానిమల్’.. ఈ సినిమా మూడున్నర గంటలు ఉన్నా థియేటర్లో ఆడింది. ఎందుకు?
అక్కడ ప్రతి సీన్ ఏదో ఒక ఎమోషన్‌ని ట్రిగ్గర్ చేసింది. ప్రేక్షకుడు సీటులోంచి లేవకుండా చేయగలిగింది.
అదే ‘రాధే శ్యామ్’ లాంటి సినిమాలు… ఎంత గ్రాండ్‌గా ఉన్నా, ప్రేక్షకుడికి బోర్ కొట్టిన మరుక్షణమే థియేటర్ నుంచి బయటకి నడిపించాయి.
థియేటర్ అంటేనే వందల మందితో కలిసి నవ్వడం, అరవడం.
ఇప్పుడు వస్తున్న సినిమాలు ఆ “గ్రూప్ ఎమోషన్” ని క్రియేట్ చేయలేకపోతున్నాయి.
‘డీజే టిల్లు’ ఈ సినిమాకి జనం థియేటర్లకు ఎందుకు విరుచుకుపడ్డారు?
ఆ కామెడీ అందరితో కలిసి ఎంజాయ్ చేస్తే వచ్చే మజా వేరు.
కానీ ఇప్పుడు 90% సినిమాలు కేవలం హీరో ఎలివేషన్లకే పరిమితమవుతున్నాయి.
కామన్ ఆడియన్ తన భార్యాపిల్లలతో కలిసి నవ్వుకునే ఒక్క సీన్ కూడా లేనప్పుడు… థియేటర్ ఎందుకు దండగ అని ఫిక్స్ అయిపోతాడు .
ఆత్మ లేకపోతే నో కనెక్షన్ !
‘దృశ్యం 2′ ..మలయాళంలో నేరుగా OTT లోకి వచ్చింది.
కానీ హిందీలో థియేటర్‌లో రిలీజ్ చేసి బ్లాక్‌బస్టర్ కొట్టారు.
ఎందుకు?
ఆ కథలో ఉండే సస్పెన్స్ అందరితో కలిసి అనుభవించాలనే అర్జేన్సీ ని క్రియేట్ చేశారు.
ఇక కేవలం భారీ బడ్జెట్ ఉంటేనే ప్రేక్షకుడు థియేటర్‌కు వస్తాడు అనుకోవడం ఒక భ్రమ.
సీతా రామం’ vs ‘రాధే శ్యామ్ నే చూస్తె …
రాధే శ్యామ్ లో వందల కోట్లు ఖర్చు చేశారు, విజువల్స్ అద్భుతంగా ఉన్నాయి. కానీ ప్రేక్షకుడు కనెక్ట్ అవ్వలేదు. ఎందుకంటే అందులో ఆత్మ లేదు.
సీతా రామం లో విజువల్స్ ఉన్నాయి..అంతకంటే గొప్పగా ఎమోషన్ ఉంది. అందుకే అది థియేటర్ క్లాసిక్ అయ్యింది.
మరి’మసూద’ ‘డీజే టిల్లు’ ఇలాంటి చిన్న సినిమాలు ఎందుకు ఆడాయి?
తక్కువ రేట్లలో లేదా నార్మల్ మల్టీప్లెక్స్ రేట్లలో ప్రేక్షకుడికి “హై రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్‌మెంట్”ఇచ్చాయి కాబట్టి .
ఇప్పుడు …10 రోజులు ఉంటేనే గొప్ప
ఇప్పటికే సినిమా ఇండస్ట్రీ ఒక భ్రమలో ఉంది.
ప్రేక్షకుడికి థియేటర్ అంటే ఇష్టం లేదనుకుంటున్నారు.
కాని నిజం ఏంటంటే ప్రేక్షకుడికి ‘సో కాల్డ్’ కమర్షియల్ ఫార్ములా అంటే విరక్తి పుట్టింది .
ఇక ఎలాగూ సినిమా రిలీజైన నెల రోజుల్లోనే ఓటీటీలోకి వస్తుందని అందరికీ తెలుసు.
ఈ వారం వెళ్లకపోతే ఏమవుతుంది?
వచ్చే నెలలో ఇంట్లోనే చూడొచ్చుగా” అనే థాటే ప్రేక్షకుడిని థియేటర్ నుంచి దూరం చేస్తోంది.
ఒకప్పుడు సినిమా అంటే కనీసం 100 రోజులు థియేటర్‌లో ఉండేది.
కాని ఇప్పుడు …10 రోజులు ఉంటేనే గొప్ప.
సినిమా ఎప్పుడైతే డిజిటల్ ప్లాట్‌ఫామ్స్‌కి అమ్ముడైందో, అప్పుడే దాని సాన్టిటీ పోయింది.
ఇక ఈ ఓటీటీ ప్రేక్షకుడికి పెద్ద ఆయుదాన్నే ఇచ్చింది… అదే “పాజ్ బటన్”.
యస్ ..థియేటర్లో సినిమా బోర్ కొడితే ప్రేక్షకుడు భరించాలి.
అదే ఇంట్లో అయితే ఒక్క క్లిక్‌తో సినిమా మార్చేస్తాడు.
లగ్జరీ వర్సెస్ అలవాటు: ఫైనాన్షియల్ ప్లానింగ్‌గా సినిమా!
ఇక ప్రస్తుతం ఒక ఆర్డినరీ ఫ్యామిలీ థియేటర్‌కు వెళ్లడం అనేది ఇప్పుడు ఒక ఫైనాన్షియల్ ప్లానింగ్ అయిపొయింది .
ఒకప్పుడు సినిమా టికెట్ 50 ఉండేది,
అప్పుడు సామాన్యుడు వారానికి రెండు సినిమాలు చూసేవాడు.
కట్ చేస్తే … ఇప్పుడు టికెట్ 300.. పార్కింగ్100… పాప్‌కార్న్ 500.
మొత్తం 2000 నుంచి 3000 మూడువేల ఖర్చు.
మీరు 100 కోట్లు రెమ్యూనరేషన్ తీసుకుని, ఆ భారాన్ని టికెట్ రేట్ల రూపంలో ప్రేక్షకుల మీద వేస్తే…
తను సినిమాని థియేటర్లో కాదు, టెలిగ్రామ్ లోనో లేదా OTT లోనో చూసి మీ మీద తన కోపాన్ని తీర్చుకుంటాడు.
మేజిక్ లేని బాక్స్.. పాజ్ బటన్ పవర్!
ఇప్పటికే 100 కోట్ల ప్యాకేజీ కోసం కథని బలి పశువుని చేశారు.
కటౌట్ల హంగామాలో కంటెంట్‌ని గాలికి వదిలేశారు.
అందుకే… ప్రేక్షకుడు ఇప్పుడు థియేటర్ మెట్లు ఎక్కడానికి పదిసార్లు ఆలోచిస్తున్నాడు.
గుర్తుంచుకోండి… అద్భుతమైన విజువల్స్ కళ్లకు మాత్రమే ఆనందాన్ని ఇస్తాయి,
కానీ అద్భుతమైన కథ మాత్రమే ఆడియన్ ని థియేటర్ సీట్లో కూర్చోబెడుతుంది!”
ప్రేక్షకుడు రావాల్సిన అవసరం తగ్గలేదు… బలవంతంగా తగ్గించారు.
ఒకప్పుడు సినిమా థియేటర్‌కు వెళ్లడం ఒక “హ్యాబిట్”, ఇప్పుడు అది ఒక “లగ్జరీ”
అలవాటుని ఎవరూ వదులుకోరు, కానీ విలాసం లేకపోయినా బతికేయగలరు.
సో …సినిమాని మళ్ళీ ఆ “అలవాటు” స్థాయికి తీసుకెళ్లడమే ఇప్పుడు మేకర్స్ ముందున్న సవాల్.
ఏది ఏమైనా థియేటర్ అనేది కేవలం గోడల మధ్య ఉన్న స్క్రీన్ కాదు… అదొక మేజిక్ బాక్స్.
ఆ బాక్స్ లో మేజిక్ లేనప్పుడు, ప్రేక్షకుడు తన చేతిలో ఉన్న రిమోట్ కంట్రోల్ నే నమ్ముకుంటాడు.
చివరకు మేకర్స్ మారకపోతే మాత్రం… థియేటర్లు కేవలం ‘మ్యూజియమ్’లుగా మిగిలిపోవడం ఖాయం!
also read:Dil Raju: సొంతింటి హీరోనే నిలబెట్టలేకపోతున్న దిల్ రాజు !