E-Paper
Advertisement

కామెట్ ఈవీ vs టియాగో ఈవీ.. రెండింటిలో ఏ కారు కొంటే మంచిది?

కామెట్ ఈవీ vs టియాగో ఈవీ.. రెండింటిలో ఏ కారు కొంటే మంచిది?
Advertisement

Tata Tiago EV vs MG Comet EV: దేశంలో చిన్న ఎలక్ట్రిక్ కార్లకు డిమాండ్ రోజు రోజుకీ పెరుగుతోంది. ముఖ్యంగా నగరాల్లో రోజువారీ ప్రయాణాల కోసం తక్కువ ఖర్చుతో, ఈజీగా నడిపే కార్లను చాలా మంది కోరుకుంటున్నారు. ఈ నేపథ్యంలో MG కామెట్ EV మంచి ఎంపికగా మారింది. మరోవైపు, కుటుంబ అవసరాలు, హైవే ప్రయాణాలకు టాటా టియాగో EV కూడా గట్టి పోటీ ఇస్తోంది. అయితే, ఈ రెండు కార్లలో ఏది బెస్ట్ అనేది ఇప్పుడు తెలుసుకుందాం..

ఎంజీ కామెట్ గురించి..

MG కామెట్ EVనగర ప్రయాణాలను దృష్టిలో పెట్టుకుని రూపొందించబడింది. దీని చిన్న సైజ్ వల్ల ట్రాఫిక్ ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో ఈజీగా నడిపే అవకాశం ఉంటుంది. పార్కింగ్ సమస్య కూడా పెద్దగా ఉండదు.  ఇరుకైన గల్లీల్లో కూడా ఈ కారు చాలా ఈజీగా తిరుగుతుంది. అందుకే, ఆఫీస్‌కి రోజూ వెళ్లేవారు, చిన్న కుటుంబాలు దీన్ని ఎక్కువగా ఇష్టపడుతున్నాయి.

Advertisement

కామెట్ EVలో 17.3 kWh లిథియం అయాన్ బ్యాటరీ ప్యాక్ ఉంటుంది. పూర్తి ఛార్జ్‌ పై సుమారు 230 కిలోమీటర్ల వరకు రేంజ్ ఇస్తుందని కంపెనీ చెబుతోంది. సాధారణ నగర వినియోగానికి ఈ రేంజ్ సరిపోతుంది. ఇంట్లోనే సాధారణ పవర్ సాకెట్‌ తో ఛార్జ్ చేసుకునే సౌకర్యం కూడా ఉంది. 3.3 kW AC ఛార్జర్‌తో పూర్తి ఛార్జ్ కావడానికి సుమారు 7 గంటలు పడుతుంది. కొత్త 7.4 kW ఫాస్ట్ ఛార్జింగ్ వేరియంట్లు ఇంకా వేగంగా ఛార్జ్ అవుతాయి.

ఈ కారులో 41 bhp పవర్, 110 Nm టార్క్ ఉత్పత్తి చేసే ఎలక్ట్రిక్ మోటార్ ఉంటుంది. సిటీ రోడ్లపై స్మూత్ డ్రైవింగ్ అనుభూతిని ఇస్తుంది. రీజెనరేటివ్ బ్రేకింగ్ సిస్టమ్ కూడా ఇందులో ప్రత్యేక ఆకర్షణ. లైట్, నార్మల్, హెవీ అనే మూడు మోడ్‌లు ఉంటాయి. ట్రాఫిక్‌లో బ్రేక్ వేయగానే బ్యాటరీలో కొంత పవర్ తిరిగి సేవ్ అవుతుంది.

Advertisement

ఫీచర్ల విషయానికి వస్తే, MG కామెట్ EV ఆధునిక టెక్నాలజీతో ఆకట్టుకుంటుంది. ఇందులో డ్యూయల్ 10.25 అంగుళాల డిస్‌ ప్లేలు, వైర్‌ లెస్ ఆపిల్ కార్ ప్లే, ఆండ్రాయిడ్ ఆటో, డిజిటల్ కీ, వాయిస్ కమాండ్స్, కనెక్టెడ్ కార్ ఫీచర్లు ఉన్నాయి. అలాగే రివర్స్ కెమెరా, పార్కింగ్ సెన్సార్లు, కీలెస్ ఎంట్రీ వంటి సౌకర్యాలు కూడా లభిస్తాయి.

భద్రత పరంగా డ్యూయల్ ఎయిర్‌బ్యాగ్‌లు, ABS with EBD, ESC, హిల్ అసిస్ట్, TPMS లాంటి ఫీచర్లు ఉన్నప్పటికీ, దీనికి అధికారిక NCAP క్రాష్ టెస్ట్ రేటింగ్ లేదు. ఇది కొంతమందికి ఆలోచించే అంశం కావచ్చు. కామెట్ EVలో నాలుగు మంది కూర్చోవచ్చు. వెనుక సీట్లు చిన్న ప్రయాణాలకు బాగుంటాయి. కానీ, ఎక్కువసేపు కూర్చోవడం కొంత అసౌకర్యంగా అనిపిస్తుంది. బూట్ స్పేస్ కూడా చాలా తక్కువగా ఉంటుంది. వెనుక సీట్లు మడిస్తే మాత్రం స్టోరేజ్ పెరుగుతుంది.

MG కామెట్ EV ధర సుమారుగా రూ. 7.50 లక్షల (ఎక్స్ షోరూమ్) నుంచి ప్రారంభమవుతుంది, అయితే ఎక్స్‌ క్లూజివ్ FC,  బ్లాక్‌ స్టార్మ్ ఎడిషన్ లాంటి టాప్ వేరియంట్ల ధర దాదాపు రూ. 10 లక్షల వరకు ఉంటుంది.

టాటా టియాగో ఈవీ గురించి..

ఇక  టాటా టియాగో EV మరింత ప్రాక్టికల్ ఎంపికగా కనిపిస్తుంది. ఇది ఐదు డోర్ల హ్యాచ్‌ బ్యాక్ కావడంతో కుటుంబ వినియోగానికి బాగా సరిపోతుంది. బూట్ స్పేస్ కూడా ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా హైవే ప్రయాణాలు చేసే వారికి టియాగో EV బెస్ట్ ఆప్షన్ గా చెప్పుకోవచ్చు. దీనిలో DC ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉండటం మరో పెద్ద ప్లస్.

ఖర్చు విషయానికి వస్తే, MG కామెట్ EV నిర్వహణ చాలా తక్కువ. ఛార్జింగ్ ఖర్చు కిలోమీటరుకు సుమారు రూ.1 నుంచి రూ.1.5 వరకు మాత్రమే ఉంటుంది. సర్వీసింగ్ ఖర్చు కూడా రూ.2,000 నుంచి రూ.5,000 మధ్యలోనే ఉంటుంది. బ్యాటరీపై MG కంపెనీ 8 సంవత్సరాలు, 1.2 లక్షల కిలోమీటర్ల వారంటీ ఇస్తోంది.

ఇక టాటా టియాగో ఈవీ బ్యాటరీ యాజ్ ఎ సర్వీస్ (BaaS) ప్రోగ్రామ్ కింద, కొనుగోలుదారులు బ్యాటరీ లేకుండా కేవలం కారు బాడీని మాత్రమే కొనుగోలు చెయ్యొచ్చు. సుమారు రూ. 4.99 లక్షల(ఎక్స్ షోరూమ్) నుంచి ప్రారంభ ధర ఉంటుంది. బ్యాటరీకి అద్దె చెల్లించాల్సి ఉంటుంది.

ఏది కొంటే బెస్ట్?

సిటీలో రోజువారీ వినియోగానికి చిన్న, స్మార్ట్, తక్కువ ఖర్చుతో కూడిన EV కావాలనుకునేవారికి MG కామెట్ EV బెస్ట్ ఆప్షన్. కుటుంబ ప్రయాణాలు, పెద్ద బూట్ స్పేస్, హైవే డ్రైవింగ్ అవసరం ఉన్నవారు టాటా టియాగో EVను కొనుగోలు చేయడం మంచిది.

Read Also: కొత్త టియాగో EV vs పాత టియాగో EV.. నయా మోడల్ లో క్రేజీ అప్ డేట్స్ ఇవే!

Related News

టెస్లా నుంచి పిల్లల కోసం కొత్త బైక్.. రేట్ ఎంత అంటే?

EV బ్యాటరీల్లో ఏది సేఫ్? కొనుగోలు చేసే ముందు ఈ విషయాలు తప్పకుండా తెలుసుకోవాల్సిందే!

వర్షాకాలంలో ఎలక్ట్రిక్ కారు కొనాలనుకుంటున్నారా? ఈ 4 మోడల్స్ బెస్ట్ ఛాయిస్!

కియా సైరోస్ EV vs కియా సైరోస్ ICE.. ఏది బెస్ట్? పూర్తి పోలిక ఇదే!

16 ఏళ్ల తర్వాత నిస్సాన్ మాస్టర్‌ పీస్.. కొత్త ఎల్గ్రాండ్ వచ్చేసింది!

భారత మార్కెట్ లోకి చౌకైన 7-సీటర్‌.. ఏంటీ.. ధర మరీ అంత తక్కువా?

MG కొత్త EV వచ్చేస్తోంది.. 600 కి.మీ రేంజ్‌తో అదిరే ఎంట్రీ!

సింగిల్ ఛార్జ్ తో 500 కి.మీ ప్రయాణం.. మార్కెట్ లో దుమ్మురేపబోతున్న హ్యుందాయ్ ఈవీ!

Big Stories

Advertisement
×