E-Paper
Advertisement

మెగా బ్రదర్స్‌ను తిట్టారా?.. ఆడియో వెనుక పొలిటికల్ స్కెచ్.. అసలేం జరిగింది?

మెగా బ్రదర్స్‌ను తిట్టారా?.. ఆడియో వెనుక పొలిటికల్ స్కెచ్.. అసలేం జరిగింది?
Advertisement

Pawan Kalyan,Chiranjeevi: మెగా బ్రదర్స్ గా పేరు తెచ్చుకున్న మెగాస్టార్ చిరంజీవి, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌లను వైయస్సార్ కాంగ్రెస్ పార్టీనెల్లూరు జిల్లా కావలి మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి తిట్టాడంటూ సోషల్ మీడియాలో కొన్ని ఆడియోలు వైరల్ అయిన సంగతి తెల్సిందే. అయితే, ఇవన్నీ పూర్తిగా ఫేక్ అని, మోడ్రన్ టెక్నాలజీని ఉపయోగించి కావాలనే మార్ఫింగ్ చేశారని వైఎస్సార్‌సీపీ శ్రేణులు మండిపడుతున్నాయి. ప్రస్తుతం ఉన్న రాజకీయాల్లో ప్రత్యర్థులను నైతికంగా దెబ్బతీయడానికి ఇలాంటి చీప్ పాలిటిక్స్ చేస్తున్నారంటూ చర్చించుకుంటున్నారు నెటిజన్లు.

మార్ఫింగ్ ఆడియోల వెనుక ఉన్నది ఎవరు 

Advertisement

ఈ వివాదంపై బుధవారం నాడు వైఎస్సార్‌సీపీ నాయకులు కావలి డీఎస్పీ రమణకుమార్‌ను కలిసి ఒకవినతిపత్రాన్ని అందజేశారు. ఈ మార్ఫింగ్ ఆడియోల వెనుక ఉన్న అసలు సూత్రధారులు, పాత్రధారులు ఎవరో తేల్చాలని, వారిపై పూర్తిస్థాయి విచారణ జరిపి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ, ఇటువంటి సంఘటనలు ప్రజాస్వామ్య వ్యవస్థను, విలువలను పూర్తిగా దెబ్బతీస్తాయని ఆందోళన వ్యక్తం చేశారు.

also read :త్రికాల మూవీ రివ్యూ.. విజువల్ వండర్.. కానీ ఆ ఒక్కటి మిస్సైంది!

Advertisement

కేవలం సోషల్ మీడియాలో వచ్చిన తప్పుడు ప్రచారాలను నమ్మి, కొంతమంది ఉద్దేశపూర్వకంగా మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి నివాసాన్ని ముట్టడిస్తామని హెచ్చరించడం వెనుక పెద్ద కుట్ర దాగి ఉందని వారు ఆరోపించారు.

అధికార పక్షం చేస్తున్న వ్యూహాత్మక ప్రయత్నం

ఇది కేవలం ఒక మాజీ ఎమ్మెల్యేపై జరిగిన వ్యక్తిగత దాడి మాత్రమే కాదని, రాష్ట్రంలో ప్రతిపక్షాల గొంతు నొక్కడానికి, వారిని మానసికంగా కుంగదీయడానికి అధికార పక్షం చేస్తున్న వ్యూహాత్మక ప్రయత్నంగా ప్రజలు భావిస్తున్నారని వారు పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించాయని, ప్రతిపక్ష నాయకులు, వారి ఇళ్లు, కార్యకర్తలపై వరుస దాడులు జరుగుతున్నా పోలీసులు మూగప్రేక్షకుల్లా మిగిలిపోవడం వెనుక ఎవరి ప్రోత్సాహం ఉందో బహిర్గతం చేయాలని నిలదీశారు.

also read :రామ్ చరణ్ ‘పెద్ది’లో టాక్సిక్ లవ్ స్టోరీ.. ఢిల్లీ ప్రెస్ మీట్‌లో ఊహించని లీక్!

సోషల్ మీడియా అనేది సమాచార మార్పిడికి ఉపయోగపడాలి కానీ, ఇలాంటి మార్ఫింగ్ ఆడియోలతో సమాజంలో అశాంతిని, ఉద్రిక్తతలను రేకెత్తించడానికి కాదని వైఎస్సార్‌సీపీ నేతలు స్పష్టం చేశారు. తప్పుడు ప్రచారాలు నమ్మి చట్టాన్ని చేతుల్లోకి తీసుకునే వారిపై తక్షణమే కేసులు నమోదు చేయాలని, కావలి నియోజకవర్గంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు భద్రతా చర్యలు చేపట్టాలని కోరారు.

Related News

యాంకర్ సుమ హీరోయిన్‌గా నటించిన ఏకైక సినిమా ఏంటో తెలుసా ?

‘టాక్సిక్’ ట్రైలర్ డేట్ ఫిక్స్..ఇదైనా ఖాయమా యష్?

72వ జాతీయ అవార్డుల్లో సత్తా చాటిన తెలుగు సినిమాలు.. ఉత్తమ చిత్రం ఏదంటే?

విక్రమ్ 1 సక్సెస్.. చిరు ఫిదా: ప్రైవేట్ రాకెట్ ప్రయోగంపై మెగాస్టార్ క్రేజీ రియాక్షన్!

గుర్తుపట్టలేనంతగా మారిపోయిన బాలయ్య భామ..టార్గెట్ సెకండ్ ఇన్నింగ్స్ ?

మరోసారి భయపెట్టడానికి సిద్ధమైన డిమోంటీ కాలనీ 3.. కొత్త రిలీజ్ డేట్ లాక్!

నిర్మాతలకు భారీ షాక్ ఇస్తున్న భాగ్యశ్రీ.. మూల్యం చెల్లించుకోవాల్సిందేనా?

ఆస్కార్ అందుకున్న తొలి మహిళ.. ‘మై లెఫ్ట్ ఫుట్’ నటి మృతి!

Big Stories

Advertisement
×