E-Paper
Advertisement

కొత్త టియాగో EV vs పాత టియాగో EV.. నయా మోడల్ లో క్రేజీ అప్ డేట్స్ ఇవే!

కొత్త టియాగో EV vs పాత టియాగో EV.. నయా మోడల్ లో క్రేజీ అప్ డేట్స్ ఇవే!
Advertisement

Tata Tiago EV Facelift vs Old Model: టాటా మోటార్స్ అత్యంత సరసమైన ఎలక్ట్రిక్ కార్లలో ఒకటైన టియాగో ఈవీకి భారీ అప్‌ డేట్ ఇచ్చింది. ఇవాళ అధికారికంగా విడుదలైన టియాగో ఈవీ ఫేస్‌ లిఫ్ట్ ఇప్పటికే ఆవిష్కరించింది. కొత్త మోడల్‌ లో బయట డిజైన్ నుంచి ఇంటీరియర్ వరకు బోలెడు మార్పులు చేశారు. కొన్ని కొత్త ఫీచర్లను కూడా యాడ్ చేశారు. పాత మోడల్‌తో పోలిస్తే కొత్త టియాగో ఈవీలో ఏం మారిందో  తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..

డిజైన్ గురించి..

బయటి డిజైన్ విషయానికి వస్తే, కొత్త టియాగో ఈవీ మరింత మోడ్రన్‌ గా కనిపిస్తోంది. ముందు భాగంలో ఉన్న పాత బ్లాక్ ప్యానెల్ స్థానంలో ఇప్పుడు బాడీ కలర్ ప్యానెల్ ఇచ్చారు. కొత్త ఎల్ఈడీ హెడ్‌ ల్యాంప్స్‌ తో పాటు ఇంటిగ్రేటెడ్ డీఆర్‌ఎల్స్‌ ను యాడ్ చేశారు. బంపర్ డిజైన్ కూడా పూర్తిగా మార్చేశారు. సెంట్రల్ ఎయిర్ ఇన్‌ టేక్ మరింత క్లీన్‌ గా కనిపించేలా డిజైన్ చేశారు. సైడ్ ప్రొఫైల్‌ లో పెద్దగా మార్పులు లేకపోయినా, కొత్త వీల్ కవర్లు, tata.ev బ్రాండింగ్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. వెనుక భాగంలో కూడా టాటా భారీ మార్పులు చేసింది. కొత్త LED టెయిల్ ల్యాంప్స్‌ ను రెడ్ కలర్ బార్‌ తో కనెక్ట్ చేశారు. టియాగో EV బ్యాడ్జింగ్‌ను కూడా కొత్త స్థానంలో పెట్టారు. డ్యూయల్ టోన్ బంపర్ డిజైన్ కారుకు మరింత స్టైలిష్ లుక్ ఇస్తోంది. రివర్స్ ల్యాంప్ స్థానాన్ని కూడా మార్చారు. కొత్త కలర్ ఆప్షన్లు కూడా వచ్చే అవకాశం ఉంది.

ఇంటీరియర్ గురించి..

Advertisement

కొత్త టియాగో ఈవీ క్యాబిన్ ఇప్పుడు మరింత ప్రీమియంగా కనిపిస్తోంది. డాష్‌ బోర్డ్‌ కు కొత్త లేయర్డ్ డిజైన్ ఇచ్చారు. టూ స్పోక్ స్టీరింగ్ వీల్‌ ను కొనసాగించినా, ఇప్పుడు దానిపై Tata.ev  బ్రాండింగ్ కనిపిస్తుంది. సీట్లకు కొత్త గ్రే ఫ్యాబ్రిక్ ఫినిషింగ్ ఇచ్చారు. క్యాబిన్‌లో గ్రే, బ్లాక్ కలర్ కాంబినేషన్‌ను కొనసాగించారు.  డ్రైవర్ డిస్‌ ప్లే సెటప్ పూర్తిగా కొత్తగా ఉంది. పాత మోడల్‌ లో ఉన్నఇన్‌ స్ట్రుమెంట్ క్లస్టర్‌ కు బదులుగా ఇప్పుడు విడిగా డిజిటల్ డిస్‌ ప్లే ఇచ్చారు. స్టార్ట్, స్టాప్ బటన్ స్థానాన్ని కూడా మార్చారు. పవర్ విండో స్విచ్‌ లు, డోర్ ప్యాడ్స్ లాంటి చిన్న చిన్న భాగాల్లో కూడా కొత్త డిజైన్ కనిపిస్తోంది.

అత్యాధునిక ఫీచర్లు

ఫీచర్ల పరంగా కొత్త టియాగో ఈవీ మరింత అప్‌గ్రేడ్ అయింది. ఇందులో ఇప్పుడు 360 డిగ్రీ కెమెరా, వెనుక ఏసీ వెంట్స్, ముందు ఆర్మ్‌ రెస్ట్, సీట్‌ బ్యాక్ పాకెట్లు ఉన్నాయి. 6 స్పీకర్ ఆడియో సిస్టమ్ కోసం కొత్త ట్వీటర్లు, స్పీకర్లు కూడా జోడించారు. డ్యూయల్ వైర్‌ లెస్ ఛార్జర్ తీసుకొచ్చారు.

బ్యాటరీ, రేంజ్ గురించి..

Advertisement

బ్యాటరీ, రేంజ్ విషయానికి వస్తే, ప్రస్తుతం టియాగో ఈవీ రెండు వేరియంట్లలో అందుబాటులో ఉంది. మీడియం రేంజ్ వెర్షన్‌ లో 19.2kWh బ్యాటరీ ఉండగా, లాంగ్ రేంజ్ వెర్షన్‌లో 24kWh బ్యాటరీ ఉంది. ఇవి వరుసగా 223 కిలోమీటర్లు, 293 కిలోమీటర్ల రేంజ్ ఇస్తున్నాయి. అయితే, కొత్త మోడల్‌ లో ఇంకా పెద్ద బ్యాటరీ ప్యాక్‌లు వస్తున్నాయి.

ధర గురించి..

ప్రస్తుతం టియాగో ఈవీ ధర రూ.7.99 లక్షల నుంచి రూ.11.14 లక్షల వరకు ఉంది. కొత్త ఫేస్‌ లిఫ్ట్ వెర్షన్ ధర కొద్దిగా పెరిగే అవకాశం ఉంటుంది. మార్కెట్ లో ఎంజీ కామెట్ లాంటి కార్లకు టియాగో ఈవీ గట్టి పోటీ ఇవ్వనుంది.

Read Also: టాటా టియాగో EV ఫేస్‌ లిఫ్ట్ లాంచ్.. రేంజ్, ఫీచర్లు చూస్తే కళ్లు చెదిరిపోవాల్సిందే!

Related News

టెస్లా నుంచి పిల్లల కోసం కొత్త బైక్.. రేట్ ఎంత అంటే?

EV బ్యాటరీల్లో ఏది సేఫ్? కొనుగోలు చేసే ముందు ఈ విషయాలు తప్పకుండా తెలుసుకోవాల్సిందే!

వర్షాకాలంలో ఎలక్ట్రిక్ కారు కొనాలనుకుంటున్నారా? ఈ 4 మోడల్స్ బెస్ట్ ఛాయిస్!

కియా సైరోస్ EV vs కియా సైరోస్ ICE.. ఏది బెస్ట్? పూర్తి పోలిక ఇదే!

16 ఏళ్ల తర్వాత నిస్సాన్ మాస్టర్‌ పీస్.. కొత్త ఎల్గ్రాండ్ వచ్చేసింది!

భారత మార్కెట్ లోకి చౌకైన 7-సీటర్‌.. ఏంటీ.. ధర మరీ అంత తక్కువా?

MG కొత్త EV వచ్చేస్తోంది.. 600 కి.మీ రేంజ్‌తో అదిరే ఎంట్రీ!

సింగిల్ ఛార్జ్ తో 500 కి.మీ ప్రయాణం.. మార్కెట్ లో దుమ్మురేపబోతున్న హ్యుందాయ్ ఈవీ!

Big Stories

Advertisement
×