E-Paper
Advertisement

MG కార్లపై భారీ డిస్కౌంట్లు.. గ్లోస్టర్‌పై ఏకంగా రూ.4 లక్షల వరకు బెనిఫిట్స్!

MG కార్లపై భారీ డిస్కౌంట్లు.. గ్లోస్టర్‌పై ఏకంగా రూ.4 లక్షల వరకు బెనిఫిట్స్!

MG Car Discounts June 2026:  జూన్ లో కొత్త కారు కొనాలని చూస్తున్న వారికి JSW MG మోటార్ క్రేజీ ఆఫర్లను ప్రకటించింది. కంపెనీ పలు మోడళ్లపై క్యాష్ డిస్కౌంట్స్, ఎక్స్ఛేంజ్ బోనస్‌ లు, లాయల్టీ బెనిఫిట్లు, కార్పొరేట్ ఆఫర్లను అందిస్తోంది. ఈ నెలలో ఎక్కువ బెనిఫిట్స్ MG గ్లోస్టర్ SUVపై లభిస్తుండగా, ఎలక్ట్రిక్ వాహనాలు ZS EV, విండ్సర్ EV, కామెట్ EVలపై కూడా భారీ ఆఫర్లు ఉన్నాయి.

గ్లోస్టర్: రూ.4 లక్షలు తగ్గింపు

MG మోడళ్లలో గ్లోస్టర్ అత్యధిక డిస్కౌంట్‌ ను పొందుతోంది. ఈ ఫుల్ సైజ్ ప్రీమియం SUVపై మొత్తం రూ.4 లక్షల వరకు బెనిఫిట్స్ అందుకుంది. ఇందులో రూ.3.5 లక్షల క్యాష్ డిస్కౌంట్స్, రూ.50,000 ఎక్స్ఛేంజ్ బోనస్ ఉన్నాయి. గ్లోస్టర్ 2.0-లీటర్ డీజిల్ ఇంజిన్‌ తో వస్తుంది. సింగిల్ టర్బో, ట్విన్ టర్బో వేరియంట్లలో లభించే ఈ SUV, టయోటా ఫార్చ్యూనర్, జీప్ మెరిడియన్, స్కోడా కోడియాక్ లాంటి మోడళ్లకు పోటీగా నిలుస్తోంది.

ZS EV: రూ.2.55 లక్షలు తగ్గింపు

ఎంజీ ZS EVపై కూడా మంచి ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. ఈ ఎలక్ట్రిక్ SUVపై మొత్తం రూ.2.55 లక్షల వరకు ప్రయోజనాలు అందిస్తోంది. ఇందులో రూ.2.15 లక్షల నగదు తగ్గింపు, రూ.20,000 చొప్పున లాయల్టీ, కార్పొరేట్ బెనిఫిట్లు ఉన్నాయి. 50.3kWh బ్యాటరీ ప్యాక్‌ తో వచ్చే ఈ వాహనం ఒకసారి పూర్తి ఛార్జ్ చేస్తే 461 కిలోమీటర్ల వరకు ప్రయాణిస్తుందని కంపెనీ చెబుతోంది. కొన్ని వేరియంట్లపై ఉచిత పబ్లిక్ ఛార్జింగ్ సదుపాయం కూడా అందిస్తున్నారు.

ఆస్టర్‌: రూ. రూ.85 వేలు తగ్గింపు

మిడ్-సైజ్ SUV సెగ్మెంట్‌ లో ఉన్న MG ఆస్టర్‌ పై రూ.85,000 వరకు బెనిఫిట్స్ లభిస్తున్నాయి. ఇందులో రూ.25,000 క్యాష్ డిస్కౌంట్, రూ.20,000 ఎక్స్ఛేంజ్ బోనస్, రూ.20,000 లాయల్టీ బెనిఫిట్, రూ.20,000 కార్పొరేట్ ఆఫర్ ఉన్నాయి. హ్యుందాయ్ క్రెటా, కియా సెల్టోస్, హోండా ఎలివేట్ లాంటి మోడళ్లకు ఇది ప్రత్యర్థిగా ఉంది.

కామెట్ EV: రూ.60 వేలు తగ్గింపు

MG చవకైన ఎలక్ట్రిక్ కారు కామెట్ EVపై కూడా మంచి ఆఫర్లు ప్రకటించింది. దేశంలోని చాలా ప్రాంతాల్లో ఈ కారుపై రూ.60 వేల వరకు ప్రయోజనాలు అందుబాటులో ఉన్నాయి. దక్షిణ భారతంలో ఈ ఆఫర్లు రూ.80,000 వరకు పెరిగే అవకాశం ఉంది. 17.3kWh బ్యాటరీ ప్యాక్‌ తో వచ్చే కామెట్ EV, ఒకసారి ఛార్జ్ చేస్తే 230 కిలోమీటర్ల వరకు ప్రయాణిస్తుందని కంపెనీ వెల్లడించింది.

హెక్టర్: రూ 50 వేలు తగ్గింపు

MG హెక్టర్ SUVపై రూ.50,000 వరకు ప్రయోజనాలు లభిస్తున్నాయి. ఇందులో ఎక్స్ఛేంజ్ బోనస్, లాయల్టీ బెనిఫిట్, కార్పొరేట్ ఆఫర్లు ఉన్నాయి. 1.5-లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్‌ తో వచ్చే హెక్టర్, ఐదు, ఆరు, ఏడు సీట్ల ఎంపికల్లో అందుబాటులో ఉంది. పెద్ద కుటుంబాలకు అనువైన SUVగా మంచి ఆదరణ పొందుతోంది.

విండ్సర్ EV: రూ 50 వేలు తగ్గింపు

అటు MG విండ్సర్ EVపై కూడా రూ.50,000 వరకు బెనిఫిట్స్ ప్రకటించింది. ఇందులో ఎక్స్ఛేంజ్ బోనస్, లాయల్టీ బెనిఫిట్, కార్పొరేట్ ఆఫర్ ఉన్నాయి. 38kWh, 52.9kWh బ్యాటరీ ప్యాక్ ఎంపికలతో లభించే ఈ ఎలక్ట్రిక్ కారు, గత ఏడాది దేశంలో అత్యధికంగా అమ్ముడైన EVలలో ఒకటిగా నిలిచింది.

Read Also: జూన్‌లో మారుతి కార్లపై సూపర్ ఆఫర్లు.. విక్టోరిస్‌ పై రూ.90 వేలు తగ్గింపు!

Related News

లాంగ్ రైడ్స్‌కు సూపర్ ఛాయిస్.. దేశంలో టాప్ 5 మ్యాక్సీ స్కూటర్లు ఇవే!

ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ మాట్లాడితే వింటుంది.. చెప్పింది చేస్తుంది.. నిజంగా వండర్ భయ్యా!

2030 నాటికి BS-VII అమలు.. కొత్త కార్లు కొనాలంటే జేబు ఖాళీ కావాల్సిందేనా?

జావా నుంచి 1000 స్పోర్ట్ క్రూయిజర్.. 113HP పవర్‌ తో సూపర్‌ బైక్ సంచలనం!

మే 2026లో అత్యధికంగా అమ్ముడైన 7-సీటర్ కార్లు ఇవే.. ఎర్టిగా మళ్లీ నంబర్ 1

హైబ్రిడ్ SUV సెగ్మెంట్‌ లో BYD ఎంట్రీ.. ఏకంగా 1200 కి.మీ రేంజ్ కారు రెడీ!

కారు కలర్ కూడా పెట్రోల్ ఖర్చు పెంచుతుందా? వామ్మో.. ఇన్నాళ్లు ఈ విషయం తెలియదే!

×