Maruti Discounts June 2026: ఇండియన్ లీడింగ్ ఆటో మోబైల్ కంపెనీ మారుతి సుజుకి కొనుగోలుదారులకు గుడ్ న్యూస్ చెప్పింది. జూన్ 2026 ఆఫర్లతో భాగంగా అరేనా షోరూమ్ ల ద్వారా అమ్మే పలు మోడళ్లపై ఆకట్టుకునే డిస్కౌంట్లు ప్రకటించింది. విక్టోరిస్, స్విఫ్ట్, బ్రెజ్జా, వాగన్ ఆర్, ఆల్టో కె10, సెలెరియో, ఎస్ ప్రెస్సో, ఈకో లాంటి మోడళ్లపై క్యాష్ డిస్కౌంట్లు, ఎక్స్ఛేంజ్ బోనస్‌లు, స్క్రాపేజ్ ప్రయోజనాలు, కార్పొరేట్ ఆఫర్లు అందిస్తోంది.
జూన్ నెలలో అత్యధిక ఆఫర్లు మారుతి విక్టోరిస్‌పై లభిస్తున్నాయి. ముఖ్యంగా స్ట్రాంగ్ హైబ్రిడ్ వేరియంట్లపై మొత్తం రూ.90,000 వరకు ప్రయోజనాలు ఉన్నాయి. ఇందులో ఎక్స్ఛేంజ్, స్క్రాపేజ్ బోనస్, లాయల్టీ బెనిఫిట్, కార్పొరేట్ డిస్కౌంట్లు ఉన్నాయి. సీఎన్‌జీ వేరియంట్లపై రూ.80,000 వరకు, పెట్రోల్ వేరియంట్లపై రూ.60,000 వరకు బెనిఫిట్స్ లభిస్తున్నాయి. ప్రస్తుతం విక్టోరిస్ ధరలు రూ.10.50 లక్షల నుంచి రూ.19.99 లక్షల వరకు ఉన్నాయి.
స్విఫ్ట్ హ్యాచ్ బ్యాక్ పై కూడా మంచి ఆఫర్లు ఉన్నాయి. AMT వేరియంట్లపై రూ.45,000 వరకు ప్రయోజనాలు లభిస్తుండగా, మాన్యువల్, సీఎన్‌జీ వేరియంట్లపై రూ.40,000 వరకు ఆఫర్లు అందిస్తున్నారు. స్విఫ్ట్ ధరలు రూ.5.79 లక్షల నుంచి ప్రారంభమవుతాయి.
కాంపాక్ట్ ఎస్‌యూవీ విభాగంలో మంచి డిమాండ్ ఉన్న బ్రెజ్జాపై కూడా రూ.55,000 వరకు ప్రయోజనాలు ఉన్నాయి. పెట్రోల్, సీఎన్‌జీ వేరియంట్లకు ఒకే రకమైన ఆఫర్లు అందిస్తోంది. ఇందులో క్యాష్ డిస్కౌంట్ తో పాటు ఎక్స్ఛేంజ్ బోనస్, కార్పొరేట్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయి. బ్రెజ్జా ధరలు రూ.8.26 లక్షల నుంచి రూ.12.86 లక్షల వరకు ఉన్నాయి.
వాగన్ ఆర్ కొనుగోలుదారులకు కూడా ఈ నెలలో మంచి అవకాశం లభించింది. అన్ని పెట్రోల్, సీఎన్‌జీ వేరియంట్లపై రూ.52,500 వరకు ప్రయోజనాలు అందుబాటులో ఉన్నాయి. వాగన్ ఆర్ ధరలు రూ.4.99 లక్షల నుంచి రూ.6.84 లక్షల వరకు ఉన్నాయి.
ఎంట్రీ లెవల్ కార్లలో ఎస్-ప్రెస్సో, సెలెరియో పైనా ప్రత్యేక ఆఫర్లు ఉన్నాయి. ఈ రెండు మోడళ్లపై రూ.37,500 వరకు ప్రయోజనాలు లభిస్తున్నాయి. నగదు తగ్గింపు, ఎక్స్ఛేంజ్ బోనస్, కార్పొరేట్ డిస్కౌంట్లు ఇందులో భాగంగా ఉన్నాయి. ఎస్-ప్రెస్సో ధరలు రూ.3.50 లక్షల నుంచి ప్రారంభమవుతుండగా, సెలెరియో ధరలు రూ.4.70 లక్షల నుంచి మొదలవుతాయి.
బడ్జెట్ కారు కొనాలనుకునే వారికి ఆల్టో కె10పై కూడా ఆకర్షణీయమైన ఆఫర్లు ఉన్నాయి. బేస్ LXI వేరియంట్‌పై రూ.52,500 వరకు ప్రయోజనాలు లభిస్తుండగా, మిగిలిన వేరియంట్లపై రూ.42,500 వరకు తగ్గింపులు ఉన్నాయి. ఆల్టో కె10 ధరలు రూ.3.70 లక్షల నుంచి రూ.5.45 లక్షల వరకు ఉన్నాయి. కమర్షియల్, కుటుంబ అవసరాలకు ఉపయోగపడే ఈకో వ్యాన్‌పై కూడా రూ.37,500 వరకు ప్రయోజనాలు అందిస్తున్నారు.
Read Also: రెనాల్ట్ కార్లపై భారీ ఆఫర్లు.. ఆ మోడల్ పై ఏకంగా రూ.80 వేలు తగ్గింపు!