E-Paper
Advertisement

5 ఏళ్ల తర్వాత పజెరో రీఎంట్రీ.. కొత్త లుక్‌తో మిత్సుబిషి బిగ్ సర్‌ప్రైజ్!

5 ఏళ్ల తర్వాత పజెరో రీఎంట్రీ.. కొత్త లుక్‌తో మిత్సుబిషి బిగ్ సర్‌ప్రైజ్!
Advertisement

Mitsubishi Pajero 2026: SUV ప్రియులకు మిత్సుబిషి పజెరో గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఒకప్పుడు భారత మార్కెట్‌లో మంచి క్రేజ్ సంపాదించిన ఈ SUV.. కొంతకాలం కనిపించకుండా పోయింది. ఐదేళ్ల విరామం తర్వాత ఇప్పుడు పజెరో కొత్త రూపంలో తిరిగి వచ్చింది. మిత్సుబిషి ఐదో తరం పజెరోను ఆవిష్కరించింది. పాత మోడల్‌కు ఉన్న ఆఫ్‌ రోడ్ సామర్థ్యాన్ని కొనసాగిస్తూనే, కొత్త టెక్నాలజీ, అత్యాధునిక డిజైన్‌ తో దీన్ని తీసుకొచ్చింది.

డీజిల్ ఇంజిన్.. 4WDతో పక్కా ఆఫ్‌ రోడర్!

కొత్త పజెరోలో 2.4 లీటర్ డీజిల్ ఇంజిన్‌ను ఉపయోగించారు. మిత్సుబిషి ఇంకా పవర్ వివరాలను వెల్లడించలేదు. అయితే, ఇంజిన్ గరిష్ఠంగా 480Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుందని తెలిపింది. దీనికి 8-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌ ను యాడ్ చేశారు. ఈ SUVలో 4WD సిస్టమ్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. 2H, 4H, 4HLc, 4LLc అనే నాలుగు డ్రైవ్ మోడ్‌లు ఉన్నాయి. రోడ్డు పరిస్థితిని బట్టి డ్రైవర్ వీటిని ఎంచుకోవచ్చు. మట్టి, ఇసుక, మంచు, రాళ్లు ఉన్న ప్రాంతాల్లో ప్రయాణించేందుకు ప్రత్యేకంగా ఏడు డ్రైవ్ మోడ్‌లను కూడా అందించారు.

డిజైన్ లో కీలక మార్పులు  

Advertisement

కొత్త పజెరో పాత మోడల్ రూపాన్ని పూర్తిగా మార్చలేదు. అయితే, దానికి మోడ్రన్ టచ్ ఇచ్చారు. ముందు భాగంలో LED లైట్ బార్, ప్రొజెక్టర్ LED హెడ్‌లైట్లు, పెద్ద గ్రిల్, ఆకర్షణీయమైన బంపర్ ఉన్నాయి. సైడ్‌లో 20 అంగుళాల బ్లాక్ అల్లాయ్ వీల్స్, స్క్వేర్ వీల్ ఆర్చ్‌లు, బ్లాక్ క్లాడింగ్ కనిపిస్తాయి. వెనుక భాగంలో ర్యాప్‌రౌండ్ LED టెయిల్ లైట్లు ఉన్నాయి. పాత పజెరోలో కనిపించే స్పేర్ వీల్ మౌంట్‌ను కొత్త మోడల్‌లో ఇవ్వలేదు.

టెక్నాలజీకి పెద్దపీట

ఇంటీరియర్‌లో బ్లాక్ టాన్ థీమ్‌తో ప్రీమియం లుక్ ఇచ్చారు. డ్యాష్‌ బోర్డ్‌ పై రెండు 14.5 అంగుళాల స్క్రీన్లు ఉన్నాయి. ఒకటి ఇన్‌ స్ట్రుమెంటేషన్ కోసం, మరొకటి ఇన్ఫోటైన్‌మెంట్ కోసం పని చేస్తుంది. అదే సమయంలో ఏసీ, ఇతర ముఖ్యమైన ఫంక్షన్ల కోసం ఫిజికల్ బటన్లను కూడా కొనసాగించారు. కొత్త పజెరోలో మూడు వరుసల సీట్లతో ఏడుగురు ప్రయాణించవచ్చు. 3-జోన్ క్లైమేట్ కంట్రోల్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, యమహా 12 స్పీకర్ సౌండ్ సిస్టమ్ లాంటి ఫీచర్లు ఉన్నాయి. భద్రత కోసం 8 ఎయిర్‌బ్యాగ్‌లు కూడా అందించారు.

భారత్‌లోకి వస్తుందా?

Advertisement

పజెరోకు భారత్‌లో చాలా మంది అభిమానులు ఉన్నారు. 2002లో దేశంలోకి వచ్చిన ఈ SUV 2018 వరకు అమ్మకాలు కొనసాగించింది. 2021లో ప్రపంచ వ్యాప్తంగా పజెరో ఉత్పత్తి నిలిచిపోయింది. ఇప్పుడు కొత్త తరం పజెరో తిరిగి వచ్చినప్పటికీ, ప్రస్తుతానికి భారత మార్కెట్‌లోకి వస్తుందా? లేదా? అనేది కంపెనీ వెల్లడించలేదు. అయితే, త్వరలోనే ఈ అంశానికి సంబంధించి అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.

Read Also: టాటా దూకుడు.. మహీంద్రా జోరు! ఆగస్టు అమ్మకాల్లో ఎవరు టాప్?

Tags

Related News

2027లో కొత్త నెక్సాన్.. డిజైన్ నుంచి ఇంజిన్ వరకు అన్నీ మారనున్నాయా?

EV కొనేముందు ఈ విషయం చెక్ చేశారా? లేదంటే ఇబ్బందులు తప్పవు!

టాటా దూకుడు.. మహీంద్రా జోరు! ఆగస్టు అమ్మకాల్లో ఎవరు టాప్?

హోండా కొత్త ఈ-స్కూటర్‌కు పేటెంట్.. స్పీడ్ ఎంతో తెలిస్తే వావ్ అనాల్సిందే!

100 కి.మీ స్పీడ్.. 200 కి.మీ రేంజ్.. ఆంపియర్ కొత్త ఎలక్ట్రిక్ బైక్‌కు పేటెంట్!

బజాజ్ బిగ్ రికార్డ్.. 3 లక్షల EV అమ్మకాలు దాటేసింది!

8 నెలల్లోనే 10 లక్షలు.. ఎలక్ట్రిక్ స్కూటర్ల సేల్ లో అదిరిపోయే రికార్డ్!

Big Stories

Advertisement
×