E-Paper
Advertisement

మీరే నాకు స్ఫూర్తి… బాబాయ్ కు అబ్బాయ్ విషెస్!

మీరే నాకు స్ఫూర్తి… బాబాయ్ కు అబ్బాయ్ విషెస్!
Advertisement

Ramcharan: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తన బాబాయ్ పవన్ కళ్యాణ్(Pawan Kalyan) కు పుట్టినరోజు(Birthday) శుభాకాంక్షలు తెలియజేస్తూ సోషల్ మీడియా వేదికగా చేసిన పోస్ట్ ప్రస్తుతం వైరల్ అవుతుంది. మెగా కాంపౌండ్ నుంచి ఇండస్ట్రీలోకి హీరోగా అడుగుపెట్టి మంచి సక్సెస్ అందుకున్న వారిలో నటుడు పవన్ కళ్యాణ్ ఒకరు. పవన్ కళ్యాణ్ ఇండస్ట్రీలో కొనసాగుతూ చేసింది తక్కువ సినిమాలే అయినప్పటికీ విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకున్నారు. ఇలా పవన్ కళ్యాణ్ కున్న ఫ్యాన్ ఫాలోయింగ్ దృష్టిలో పెట్టుకొని ఈయన రాజకీయాలలోకి వచ్చిన సంగతి తెలిసిందే.

పవన్ కళ్యాణ్ కు చరణ్ విషెస్..

ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం గా కొనసాగుతున్నారు. ఇలా రాజకీయాల పరంగా ఈయన ఉన్నత పదవిలో ఉండటంవల్ల సినిమాలు కాస్త ఆలస్యం అవుతున్నాయి.ఇక నేడు పవన్ కళ్యాణ్ పుట్టినరోజు కావడంతో సోషల్ మీడియా వేదికగా మెగా హీరోలతో పాటు ఇతర సినీ సెలబ్రిటీలు పవన్ కళ్యాణ్ అభిమానులు ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ పోస్టులు పెడుతున్నారు. తాజాగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్(Ramcharan) సైతం తన బాబాయ్ పవన్ కళ్యాణ్ తో కలిసి దిగిన ఫోటోను షేర్ చేస్తూ..

లవ్ యూ బాబాయ్…

Advertisement

“ఆంధ్రప్రదేశ్ గౌరవనీయులైన ఉపముఖ్యమంత్రి స్త్రీ పవన్ కళ్యాణ్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు.. మీరు ఎల్లప్పుడూ నాకు ఎంత స్ఫూర్తిగా దాయకంగా నిలిచారు. మీరు మంచి ఆరోగ్యం, సంతోషంతో మరెన్నో అద్భుతమైన సంవత్సరాలను జరుపుకోవాలని కోరుకుంటున్నాను.. లవ్ యూ బాబాయ్” అంటూ పవన్ కళ్యాణ్ షేర్ చేసిన పోస్ట్ ప్రస్తుతం వైరల్ అవుతుంది. ఇక నేడు పవన్ కళ్యాణ్ పుట్టినరోజు కావడంతో మెగాస్టార్ చిరంజీవితో పాటు నాగబాబు అల్లు అర్జున్ వంటి తదితరులు కూడా ఈయనకి శుభాకాంక్షలు చెబుతూ పోస్టులు చేశారు.

Advertisement

ఇక పవన్ కళ్యాణ్ సినిమాల విషయానికి వస్తే ఈయన చివరిగా ఉస్తాద్ భగత్ సింగ్ అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఇక పవన్ కళ్యాణ్ నటించిన OG సినిమా మంచి సక్సెస్ కావడంతో ఈ సినిమా సీక్వెల్ చిత్రంలో నటించబోతున్నట్టు పవన్ తెలిపారు. పస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. పవన్ కళ్యాణ్ రాజకీయాలలో బిజీగా ఉన్న నేపథ్యంలోనే సినిమాలు ఆలస్యం అవుతున్నాయని చెప్పాలి. ఇక రాంచరణ్ సినిమాల విషయానికి వస్తే చరణ్ ఇటీవల పెద్ది సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి సక్సెస్ అందుకున్నారు. ప్రస్తుతం రామ్ చరణ్ తన తదుపరి సినిమాని సుకుమార్ దర్శకత్వంలో చేయబోతున్న సంగతి తెలిసిందే. అతి త్వరలోనే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. ఈ సినిమాపై పాన్ ఇండియా స్థాయిలో భారీ అంచనాలు ఏర్పడ్డాయి.

Also Read: పవన్ అభిమాని మృతి..గొప్ప మనసు చాటుకున్న ఎస్కేఎన్!

Related News

‘గరివిడి లక్ష్మి’లో ఆర్పీ పట్నాయక్ పాత్ర వెనుక అసలు కథ ఇదేనా?

క్యాస్టింగ్ కౌచ్‌పై ఝాన్సీ ఏమన్నారంటే.. ఇండస్ట్రీలో మహిళల పరిస్థితి ఇదేనా?

యూత్‌ను టార్గెట్ చేస్తూ వస్తున్న ‘హైకూ’.. అక్టోబర్ 23న థియేటర్లలోకి!

మాల్దీవుల్లో ఖుషీ కపూర్ అందాల సందడి.. ఫ్యాన్స్‌కు ఫుల్ ట్రీట్!

రామాయణంపై రాజమౌళి పోస్ట్.. ఏమన్నారంటే!

విజయ్ దేవరకొండ, రష్మికతో మధ్యప్రదేశ్ సీఎం.. అసలు విషయం ఇదే!

మహిళా కథ అనగానే నో చెప్పారు.. చివరికి అదే సినిమాతో సక్సెస్!

సలార్‌లో ఛాన్స్ కోసం ఝాన్సీ ఏం చేశారో తెలుసా?

Big Stories

Advertisement
×