The Mandalorian and Grogu OTT : గ్యాలక్సీ అంతా యుద్ధాలతో అల్లకల్లోలంగా మారితే… ఒకవైపు న్యూ రిపబ్లిక్ తన పట్టు బిగించడానికి ప్రయత్నిస్తుంటే, మరోవైపు సామ్రాజ్యానికి చెందిన మిగిలిన వార్‌లార్డ్స్ ఇంకా ప్రమాదంలోనే… ఇలాంటి సమయంలో డబ్బు కోసం మిషన్లు చేసే ఓ మాండలోరియన్ యోధుడికి, అతని చిన్న శిష్యుడు గ్రోగుకు ఊహించని బాధ్యత అప్పగిస్తే ? ఆ మిషన్ వెనుక భారీ ప్రమాదం దాగి ఉంటే ? Star Wars యూనివర్స్ లో ఫ్యాన్స్ కు ఎంతో ఇష్టమైన The Mandalorian, Grogu పాత్రలను బిగ్ స్క్రీన్ పైకి తీసుకొచ్చిన ‘The Mandalorian and Grogu’ ఇప్పుడు ఓటీటీలోకి వచ్చింది. జోన్ ఫేవ్రో దర్శకత్వం వహించిన ఈ సినిమా 2026 మేలో థియేటర్లలో విడుదలై, ప్రపంచవ్యాప్తంగా సుమారు 165 మిలియన్ డాలర్లతో ఓపెనింగ్ సాధించింది. మరి డిన్ జారిన్, గ్రోగు ఈసారి ఎలాంటి మిషన్ లోకి వెళ్లారు ? వాళ్లకు ఎదురైన శత్రువులు ఎవరు ? అనే వివరాలపై ఒక లుక్కేద్దాం పదండి.
సామ్రాజ్యం పతనమైన తర్వాత గ్యాలక్సీలో పూర్తిగా శాంతి నెలకొనలేదు. ఇంపీరియల్ వార్‌లార్డ్స్ ఇంకా కొన్ని ప్రాంతాల్లో తమ ఆధిపత్యాన్ని కొనసాగిస్తుంటారు. న్యూ రిపబ్లిక్ వారిని ఎదుర్కొంటూ తన ప్రభావాన్ని పెంచుకునే ప్రయత్నం చేస్తుంది. ఈ సమయంలో మాండలోరియన్ బౌంటీ హంటర్ డిన్ జారిన్, తన చిన్న శిష్యుడు గ్రోగుతో కలిసి కొత్త మిషన్ లోకి అడుగు పెడతాడు. డిన్ జారిన్‌కు ఈసారి కేవలం ఒక బౌంటీ వేట కాదు. గ్రోగును కూడా ప్రమాదకరమైన పరిస్థితుల నుంచి కాపాడుకుంటూ మిషన్ పూర్తి చేయాలి.
గ్యాలక్సీలోని శక్తివంతమైన శత్రువులు, వార్‌లార్డ్స్, అనుకోని అడ్డంకులు వారి ప్రయాణాన్ని మరింత కష్టతరం చేస్తాయి. గ్రోగు పెరుగుతున్న శక్తులు, డిన్‌తో అతని బంధం కూడా కథలో కీలకంగా మారుతుంది. అయితే ఈ మిషన్ వెనుక ఉన్న అసలు ఉద్దేశం ఏంటి ? డిన్, గ్రోగు ఎదుర్కొనే ప్రమాదం ఎంత పెద్దది ? న్యూ రిపబ్లిక్‌కు వీళ్ల సహాయం ఎందుకు అవసరమైంది ? గతంలో ఎదురైన శత్రువుల ప్రభావం మళ్లీ వీరి జీవితాల్లోకి వస్తుందా ? చివరికి ఈ ఇద్దరూ గ్యాలక్సీని కాపాడే పోరాటంలో ఎలాంటి పాత్ర పోషిస్తారు ? అనేదే సినిమాలో చూడాల్సిన అసలు కథ.
Also Read : 2600 కోట్ల కలెక్షన్లు… 7.9 IMDb రేటింగ్… తెలుగులో అందుబాటులో ఉన్న ఆల్ టైమ్ క్లాసిక్ మిస్టరీ థ్రిల్లర్
జోన్ ఫేవ్రో దర్శకత్వం వహించిన ఈ సినిమాలో పెడ్రో పాస్కల్ డిన్ జారిన్ గా నటించగా, సిగోర్నీ వీవర్, జెరెమీ అలెన్ వైట్ తదితరులు కీలక పాత్రల్లో కనిపించారు. ‘ది మండలోరియన్’ సిరీస్ కు కొనసాగింపుగా రూపొందిన ఈ చిత్రం మే 22న థియేటర్లలో విడుదలైంది. ఇక ఈ సినిమా సెప్టెంబర్ 2 నుంచి JioHotstarలో స్ట్రీమింగ్ అవుతోంది. కానీ తెలుగు వెర్షన్ మాత్రం లేదు. స్టార్ వార్స్ ఫ్యాన్స్, స్పేస్ అడ్వెంచర్, గ్రోగు, భారీ విజువల్ ఎఫెక్ట్స్, గ్యాలక్సీ వార్‌లతో కూడిన సై-ఫై యాక్షన్ ఇష్టపడే వారికి ఈ మూవీ మంచి విజువల్ ట్రీట్ అవుతుంది. కాబట్టి కొత్త సూపర్ హీరో సినిమాలను ఓటీటీలో చూడాలి అనుకుంటే ఈ సినిమాను డోంట్ మిస్.