E-Paper
Advertisement

వర్షాకాలంలో బైక్ కేర్ టిప్స్.. ఈ చిన్న జాగ్రత్తలు తీసుకుంటే మీ టూవీలర్ సేఫ్!

వర్షాకాలంలో బైక్ కేర్ టిప్స్.. ఈ చిన్న జాగ్రత్తలు తీసుకుంటే మీ టూవీలర్ సేఫ్!
Advertisement

Monsoon Bike Care Guide: వర్షాకాలం మొదలైతే చల్లని వాతావరణం, పచ్చదనంతో నేచర్ ఆహ్లాదకరంగా మారుతుంది. అదే సమయంలో, టూ వీలర్స్ ఉన్నవాళ్లకు ఈ సీజన్ కొన్ని ఇబ్బందులను కూడా తీసుకొస్తుంది. వర్షంలో తడిసిన తర్వాత బైక్, స్కూటర్ స్టార్ట్ కాకపోవడం, రోడ్డు మధ్యలో ఆగిపోవడం, ఇంజిన్ సమస్యలు రావడం లాంటి సమస్యలు తరచుగా కనిపిస్తుంటాయి. అయితే కొన్ని చిన్న జాగ్రత్తలు తీసుకుంటే ఈ సమస్యలను చాలా వరకు నివారించవచ్చు.

⦿ వర్షాకాలం ప్రారంభంలోనే సర్వీసింగ్ చేయించండి!

వర్షాలు మొదలైన వెంటనే బైక్‌ ను సర్వీసింగ్ చేయించడం మంచిది. ముఖ్యంగా స్పార్క్ ప్లగ్, వైర్లు, బ్యాటరీ, బ్రేకులు లాంటి  భాగాలను చెక్ చేయించాలి. ముందుగానే లోపాలను గుర్తిస్తే పెద్ద సమస్యలు రాకుండా ఉంటాయి.

⦿ స్పార్క్ ప్లగ్‌ను తప్పనిసరిగా పరిశీలించండి!

Advertisement

వర్షపు నీరు, తేమ స్పార్క్ ప్లగ్ వరకు చేరితే ఇంజిన్‌ కు సరైన స్పార్క్ అందదు. దీంతో బైక్ స్టార్ట్ కావడం కష్టమవుతుంది. ఒకవేళ స్పార్క్ ప్లగ్ పాతదై ఉంటే, అరిగిపోయి ఉంటే వెంటనే మార్చడం మంచిది.

⦿ ఫ్యూయల్ ట్యాంక్ సీలింగ్ చెక్ చేయండి!

వర్షాకాలంలో పెట్రోల్ ట్యాంక్, ఆయిల్ ట్యాంక్‌ పై ప్రత్యేక శ్రద్ధ అవసరం. కొన్ని సందర్భాల్లో ట్యాంక్ మూత సరిగ్గా మూయకపోవడం వల్ల, సీల్ దెబ్బతినడం వల్ల నీరు లోపలికి వెళ్లే అవకాశం ఉంటుంది. ఇది ఇంధన నాణ్యతను దెబ్బతీసి ఇంజిన్ పనితీరుపై ప్రభావం చూపుతుంది. కాబట్టి ట్యాంక్ క్యాప్, సీలింగ్ ను తరచూ పరిశీలించాలి.

⦿ కీహోల్‌కు గ్రీజు రాయండి!

Advertisement

ఇగ్నిషన్ కీహోల్‌ లో తేమ చేరితే తుప్పు పట్టే ప్రమాదం ఉంటుంది. అందుకే అప్పుడప్పుడు కొద్దిగా గ్రీజు రాయడం మంచిది. దీంతో కీ సిస్టమ్ సాఫీగా పనిచేస్తుంది. అలాగే బ్యాటరీ టెర్మినల్స్‌ ను కూడా శుభ్రంగా ఉంచాలి.

⦿ టైర్లు, బ్రేకులు చాలా ముఖ్యం!

వర్షాకాలంలో రోడ్లు జారుడుగా మారుతాయి. అరిగిపోయిన టైర్లు ఉంటే ప్రమాదం జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అందుకే టైర్లను అవసరమైతే మార్చాలి. అలాగే బ్రేక్ షూలు, డిస్క్ బ్రేకులు సరిగా పనిచేస్తున్నాయో? లేదో? చెక్ చేయాలి.

⦿ బైక్ చైన్‌ ను శుభ్రంగా ఉంచండి!

వర్షంలో బురద, దుమ్ము చైన్‌పై చేరి తుప్పు పట్టే అవకాశం ఉంటుంది. కాబట్టి, చైన్‌ ను తరచుగా శుభ్రం చేసి లూబ్రికెంట్ వేయాలి. దీంతో చైన్ ఎక్కువ కాలం మన్నుతుంది. బైక్ పనితీరు కూడా బాగుంటుంది.

⦿ వాహనాన్ని షెడ్డు కింద పార్క్ చేయండి!

వీలైనంత వరకు మీ బైక్‌ ను వర్షంలో నేరుగా ఉంచకుండా షెడ్డు, కవర్ కింద పార్క్ చేయడం మంచిది. ఎక్కువ సేపు నీటిలో తడవడం వల్ల ఎలక్ట్రికల్ భాగాలు దెబ్బతినే అవకాశం ఉంటుంది.

⦿ తడిసిన వెంటనే స్టార్ట్ చేయొద్దు!

బైక్ పూర్తిగా తడిసిపోయిన తర్వాత వెంటనే స్టార్ట్ చేయడానికి ప్రయత్నించకండి. ముందుగా పొడి గుడ్డతో వాహనాన్ని తుడిచి, ముఖ్యమైన భాగాలు సరిగ్గా ఉన్నాయో లేదో చూసిన తర్వాతే స్టార్ట్ చేయండి. ఈ జాగ్రత్తలు తీసుకుంటే, బైక్ ఎలాంటి ఇబ్బందులు లేకుండా సాఫీగా పనిచేస్తుంది.

Read Also: మారుతి To టాటా.. తక్కువ బడ్జెట్‌ లో సన్‌ రూఫ్ తో వచ్చే టాప్ 5 మోడల్స్ ఇవే!

Related News

హ్యుందాయ్ బేయాన్ బుకింగ్స్ ఓపెన్.. క్రెటా కంటే తక్కువ ధరలో కొత్త SUV!

ఈ కారు తనంతట తానే రివర్స్ వెళ్తుంది.. టక్సన్ టెక్నాలజీ చూస్తే మతిపోవాల్సిందే!

మహీంద్రా థార్ OG వచ్చేసింది.. కొత్త మోడల్ లో ఏం మారిందంటే?

హైదరాబాద్‌లో వింత కార్ల మ్యూజియం.. ప్రపంచంలో ఎక్కడా చూడని కార్లు ఇక్కడే!

హోండా నుంచి 3 కొత్త అప్ డేటెడ్ మోడళ్లు.. ధరలు, ఫీచర్లు చూస్తే మతిపోవాల్సిందే!

145 కి.మీ రేంజ్ తో హోండా కొత్త ఈవీ.. QC3 లుక్ ఏముంది భయ్యా!

అమ్మకాల్లో బిగాస్ దూకుడు.. లక్షకు చేరువలో ఎలక్ట్రిక్ స్కూటర్ బ్రాండ్!

రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 350కి కొత్త కలర్.. సిగ్నేచర్ వైట్ అదిరిపోయిందిగా!

Big Stories

Advertisement
×