E-Paper
Advertisement

Most Expensive Helmets: ఈ బైక్ హెల్మెట్ ధర రూ.2.3 కోట్లు.. దీని ప్రత్యేకతలు తెలిస్తే మైండ్ బ్లాకే!

Most Expensive Helmets: ఈ బైక్ హెల్మెట్ ధర రూ.2.3 కోట్లు.. దీని ప్రత్యేకతలు తెలిస్తే మైండ్ బ్లాకే!
Advertisement

Most Expensive Helmets in World: బైక్ నడుపుతున్నప్పుడు హెల్మెట్లు ప్రమాదాల నుంచి కాపాడుతాయి. సాధారణ హెల్మెట్ల ధర వందల రూపాయల నుంచి వేల రూపాయులు ఉంటుంది. కానీ, కొన్ని ప్రత్యేకమైన హెల్మెట్లు చాలా ధర పలుకుతాయి. వీటిలో ఎక్కువగా కార్బన్ ఫైబర్ తో తయారు చేసినవి అయి ఉంటాయి. ఇవి చాలా తేలికగా, బలంగా ఉంటాయి. చేతితో తయారు చేయబడి, అత్యుత్తమ సేఫ్టీ ఫీచర్లను కలిగి ఉంటాయి. వీటిని ప్రొఫెషనల్ రేసర్లు ఉపయోగిస్తారు. ఇప్పుడు మనం ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన హెల్మెట్స్ గురించి ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..

⦿ అరై కోర్సెయిర్-ఎక్స్ RC- రూ. 3.5 నుంచి 3.7 లక్షలు

ఇది అత్యంత ఖరీదైన సాధారణ మోటార్ సైకిల్ హెల్మెట్. దీని ధర దాదాపు రూ.3,50,000 నుంచి రూ. 3,70,000 ఉంటుంది. అరై దీనిని జపాన్‌లో తయారు చేస్తుంది. ప్రతి హెల్మెట్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఒకే వ్యక్తి చేత తయారు చేయబడుతుంది. అందుకే ఇది ప్రత్యేకమైనది. బయటి భాగం సూపర్ స్ట్రాంగ్ కార్బన్ ఫైబర్‌ను ఉపయోగిస్తారు. ఇది చాలా తేలికగా ఉంటుంది. సుమారు 1.6 కిలోల బరువు ఉంటుంది. కానీ, పెద్ద ప్రమాదాల నుంచి కాపాడుతుంది. తలని చల్లగా ఉంచడానికి,  బైక్ వేగంగా వెళ్తున్నా, ఇబ్బంది కలగకుండా ఉంటుంది. సౌకర్యం కోసం లోపల గాలి వెంట్‌లను కలిగి ఉంటుంది.  FIMతో సహా అత్యున్నత భద్రతా ప్రమాణాలు పాటిస్తుంది కాబట్టి ప్రో రేసర్లు దీన్ని ఇష్టపడతారు.

⦿ AGV పిస్టా GP RR- రూ. 1.5 నుంచి 1.7 లక్షలు

Advertisement

ఈ హెల్మెట్ ధర సుమారు రూ.1,50,000 నుంచి రూ. 1,70,000 వరకు ఉంటుంది. ప్రత్యేక డిజైన్‌ల కోసం ఎక్కువ ధర ఛార్జ్ చేస్తారు. AGV ఈ హెల్మెట్‌ను MotoGP రేసుల కోసం తయారు చేస్తుంది. ప్రపంచంలోనే అగ్రశ్రేణి బైక్ రేసర్ వాలెంటినో రోస్సీ లాంటి రైడర్లు దీనిని ఉపయోగించారు. ఇది పూర్తి కార్బన్ ఫైబర్, సూపర్ లైట్, ఎక్కువ వేగంతో వచ్చే గాలిని ఎదుర్కొనేలా డిజైన్ చేశారు. అదనపు విజర్‌లతో కూడా వస్తుంది. ఇది FIMతో సహా అత్యంత కఠినమైన భద్రతా పరీక్షలలో పాస్ అయ్యింది.

⦿ Shoei X-15- రూ. 1 నుంచి 1.5 లక్షలు

ఇది కూడా అత్యంత ఖరీదైన హెల్మెట్. దీని ధర రూ. 1,00,000 నుంచి రూ.1,50,000 వరకు ఉంటుంది. ఇది కూడా అద్భుతమైన సేఫ్టీ ఫీచర్లను కలిగి ఉంటుంది.

⦿ AGV హెల్మెట్ ధర ఏకంగా రూ. 2.3 కోట్లు!

Advertisement

AGV హెల్మెట్ మీద 12 మంది MotoGP ఛాంపియన్‌లు.. వాలెంటినో రోస్సీ, మార్క్ మార్క్వెజ్ సహా పలువురు సంతకం చేసిన హెల్మెట్ 2014లో దాదాపు రూ. 2.3 కోట్లకు అమ్ముడైంది. పెద్ద స్టార్లు సంతకం చేసిన, రేసర్లు ధరించే ఈ హెల్మెట్లు లక్షలు, కోట్లకు అమ్ముడవుతాయి. అవి రైడింగ్ కోసం కాదు. కొనుగోలుదారులు వాటిని కలెక్షన్లుగా ఉపయోగిస్తారు.

ఈ హెల్మెట్‌లు ఎందుకు అంత కాస్ట్?   

కార్బన్ ఫైబర్ లాంటి బెస్ట్ మెటీరియల్ తో తయారు చేస్తారు. ఇవి తేలికగా, సూపర్ స్ట్రాంగ్ గా ఉంటాయి. చేతితో తయారు చేయడానికి ఎక్కువ సమయం, స్కిల్ అవసరం ఉంటుంది.రేసింగ్ టెక్నాలజీతో తయారు చేస్తారు. తక్కువ సంఖ్యలో తయారు చేయబడుతాయి. కఠినమైన భద్రతా పరీక్షలను జరపుకుంటాయి.

Read Also: SMK టైటాన్ ఫుల్ ఫేస్ హెల్మెట్, దీన్ని పెట్టుకుంటే యాక్సిడెంట్ అయినా..

Related News

వోక్స్‌ వ్యాగన్ కార్లపై కళ్లు ఆఫర్లు.. ఆ మోడల్ పై ఏకంగా రూ.6 లక్షల తగ్గింపు!

సింగిల్ ఛార్జ్ తో 243 కి.మీ రేంజ్.. సింపుల్ వేవ్ సూపర్ స్కూటర్ వచ్చేసింది!

2027లో కొత్త నెక్సాన్.. డిజైన్ నుంచి ఇంజిన్ వరకు అన్నీ మారనున్నాయా?

5 ఏళ్ల తర్వాత పజెరో రీఎంట్రీ.. కొత్త లుక్‌తో మిత్సుబిషి బిగ్ సర్‌ప్రైజ్!

EV కొనేముందు ఈ విషయం చెక్ చేశారా? లేదంటే ఇబ్బందులు తప్పవు!

టాటా దూకుడు.. మహీంద్రా జోరు! ఆగస్టు అమ్మకాల్లో ఎవరు టాప్?

హోండా కొత్త ఈ-స్కూటర్‌కు పేటెంట్.. స్పీడ్ ఎంతో తెలిస్తే వావ్ అనాల్సిందే!

100 కి.మీ స్పీడ్.. 200 కి.మీ రేంజ్.. ఆంపియర్ కొత్త ఎలక్ట్రిక్ బైక్‌కు పేటెంట్!

Big Stories

Advertisement
×