E-Paper
Advertisement

Colour Car Trends India: ఇండియన్స్ ఏ కలర్ కార్లను ఎక్కువగా ఇష్టపడుతారో తెలుసా? కారణం ఇదే!

Colour Car Trends India: ఇండియన్స్ ఏ కలర్ కార్లను ఎక్కువగా ఇష్టపడుతారో తెలుసా? కారణం ఇదే!
Advertisement

ఒక్కొక్కరికి ఒక్కో ఫేవరెట్ కలర్ ఉంటుంది. వాళ్లు ఏ పని చేసినా, తమకు నచ్చిన రంగులకు ప్రాధాన్యత ఇస్తారు. అలాగే తాము కొనుగోలు చేసే కార్లను కూడా ఇష్టమైన రంగులోనే తీసుకంటారు. అయితే, తాజాగా ఇండియన్స్ ఎక్కువగా ఇష్టపడే కార్ల రంగుకు గురించి BASF కలర్ రిపోర్ట్ 2025 కీలక వివరాలను వెల్లడించింది. ఇందులో ప్రజలు ఎక్కువగా ఆసక్తి చూపించే రంగును ప్రస్తావించింది.

ఇండియన్స్ ఎక్కువగా ఇష్టపడే కలర్ ఇదే!

దేశంలో తెలుపు అత్యంత ప్రజాదరణ పొందిన కారు రంగుగా BASF కలర్ రిపోర్ట్ వెల్లడించింది. 2025లో మార్కెట్‌లో 48 మంది వైట్ కలర్ కార్లు కొనుగోలు చేసినట్లు తెలిపింది. అయితే, ఇతర రంగుల పైనా భారతీయులు ఆసక్తి చూపిస్తున్నట్లు ఈ రిపోర్టు వెల్లడించింది. వాటిలో ఎక్కువగా నలుపు, నీలం, ఆకుపచ్చ లాంటి కలర్స్ ఉన్నట్లు తెలిపింది. అదే సమయంలో సురక్షితమైన, తటస్థ రంగులు ఇప్పటికీ మార్కెట్ లో ఆధిపత్యం చెలాయిస్తున్నట్లు తెలిపాయి.

Advertisement

ఇండియన్స్ ఎక్కువగా ఇష్టపడే రంగుల విషయానికి వస్తే బూడిద రంగు 17 శాతంతో రెండవ స్థానంలో ఉంది. బ్లాక్, సిల్వర్  10 శాతంతో సమానం మూడో స్థానంలో ఉన్నాయి. క్రోమాటిక్ రంగులలో నీలం 7 శాతాన్ని కలిగి ఉంది. ఎరుపు 5 శాతంతో ఉంది.  ఆకుపచ్చ, లేత గోధుమరంగు, ఆరెంజ్ 1 శాతాన్ని కలిగి ఉన్నాయి.

టాప్ ప్లేస్ లో నిలిచిన వైట్ కలర్   

దేశం బలమైన రంగుగా వైట్ కలిగి ఉంది. దీని మార్కెట్ రోజు రోజుకు పెరుగుతున్నట్లు BASF నివేదిక వెల్లడించింది. తెలుపు రంగు టాప్ లో ఉండటానికి పలు కారణాలు ఉన్నట్లు నివేదిక తెలిపింది. తెలుపు వేడి, దుమ్ము ధూళి నుంచి ఎక్కువ రక్షణను అందిస్తుంది. అదే సమయంలో ఎక్కువ రీసేల్ వ్యాల్యూను కలిగి ఉంటుంది. పగటిపూట కారు బాడీ లైన్‌లను బాగా హైలైట్ చేస్తుంది. ముదురు షేడ్స్ కంటే దుమ్ము, చిన్న గీతలను కనపడకుండా చేస్తుంది.

Advertisement

ఇక చాలా మంది కార్ల తయారీదారులు ఇప్పుడు  డార్క్ ఎడిషన్, బ్లాక్ వేరియంట్‌లను అందిస్తున్నప్పటికీ, నలుపు రంగు వాటాలో కేవలం 10 శాతం మాత్రమే ఉంద. సిల్వర్ తో ముడిపడి ఉన్న గ్రే కలర్ తో పోల్చినా వెనుకే ఉంది. అక్రోమాటిక్ రంగుల పరంగా, తెలుపు 2 శాతం, నలుపు 1 శాతం పెరిగినట్లు నివేదిక వెల్లడించింది. అయితే బూడిద రంగు 1 శాతం తగ్గింది.

క్రోమాటిక్ రంగులలో బ్లూ ముందంజ

క్రోమాటిక్ షేడ్స్‌ లో నీలం టాప్ లో ఉంది.  7 శాతం వాటాను కలిగి ఉంది. ఎరుపు రంగు 5 శాతంగా ఉంది. దేశంలో ఆకుపచ్చ రంగు SUVలు ఎక్కువగా అమ్ముడు అవుతున్నాయి. అయితే, దాని మొత్తం వాటా 1 శాతం మాత్రమే. లేత గోధుమరంగు, ఆరెంజ్ కూడా 1 శాతంగా ఉన్నాయి.  ఇక SUV కొనుగోలుదారులు ఆకుపచ్చ రంగుకు ప్రాధాన్యత ఇస్తున్నారు. EVలు నీలం, సిల్వర్ వైపు మొగ్గు చూపుతున్నాయి.

Read Also: ఇకపై ఎలక్ట్రిక్ కార్లు సౌండ్ చేయాలట, ఎందుకో తెలుసా?

Related News

వోక్స్‌ వ్యాగన్ కార్లపై కళ్లు ఆఫర్లు.. ఆ మోడల్ పై ఏకంగా రూ.6 లక్షల తగ్గింపు!

సింగిల్ ఛార్జ్ తో 243 కి.మీ రేంజ్.. సింపుల్ వేవ్ సూపర్ స్కూటర్ వచ్చేసింది!

2027లో కొత్త నెక్సాన్.. డిజైన్ నుంచి ఇంజిన్ వరకు అన్నీ మారనున్నాయా?

5 ఏళ్ల తర్వాత పజెరో రీఎంట్రీ.. కొత్త లుక్‌తో మిత్సుబిషి బిగ్ సర్‌ప్రైజ్!

EV కొనేముందు ఈ విషయం చెక్ చేశారా? లేదంటే ఇబ్బందులు తప్పవు!

టాటా దూకుడు.. మహీంద్రా జోరు! ఆగస్టు అమ్మకాల్లో ఎవరు టాప్?

హోండా కొత్త ఈ-స్కూటర్‌కు పేటెంట్.. స్పీడ్ ఎంతో తెలిస్తే వావ్ అనాల్సిందే!

100 కి.మీ స్పీడ్.. 200 కి.మీ రేంజ్.. ఆంపియర్ కొత్త ఎలక్ట్రిక్ బైక్‌కు పేటెంట్!

Big Stories

Advertisement
×