E-Paper
Advertisement

టీవీఎస్ To ఏథర్..ఇండియా టాప్ 5 ఎలక్ట్రిక్ స్కూటర్లు ఇవే!

టీవీఎస్ To ఏథర్..ఇండియా టాప్ 5 ఎలక్ట్రిక్ స్కూటర్లు ఇవే!
Advertisement

Best Electric Scooters 2026: దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం వేగంగా పెరుగుతోంది. పెట్రోల్ ధరలు పెరగడం, కాలుష్యంపై అవగాహన పెరగడం లాంటి కారణాలతో చాలా మంది ఇప్పుడు ఎలక్ట్రిక్ స్కూటర్ల వైపు మొగ్గు చూపుతున్నారు. మార్కెట్‌ లో ఎప్పటికప్పుడు కొత్త కొత్త మోడళ్లు  వస్తున్నాయి. పనితీరు, రేంజ్, నమ్మకం కారణంగా పలు స్కూటర్లు మంచి ఆదరణ దక్కించుకుంటున్నాయి. ప్రస్తుతం దేశంలో మంచి అమ్మకాలు కొనసాగిస్తున్న ఐదు ఎలక్ట్రిక్ స్కూటర్ల గురించి  ఇప్పుడు తెలుసుకుందాం.

⦿ టీవీఎస్ ఐక్యూబ్

దేశంలో ఎక్కువగా అమ్ముడు అవుతున్న స్కూటర్లలో ఒకటి టీవీఎస్ ఐక్యూబ్. ఇది ఐక్యూబ్, ఐక్యూబ్ S, ఐక్యూబ్ ST అనే మూడు వేరియంట్లలో లభిస్తుంది. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 94 కి.మీ నుంచి 212 కి.మీ వరకు ప్రయాణించే అవకాశం ఉంటుంది.  సరసమైన ధర, స్థిరమైన పనితీరు కారణంగా రోజూ ప్రయాణించే వారికి ఇది అనుకూలంగా ఉంటుంది.

⦿ ఏథర్ ఎనర్జీ

Advertisement

ఏథర్ ఎనర్జీ నుంచి వచ్చిన ఏథర్ రిజ్టా కూడా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇది కుటుంబ వినియోగదారులను దృష్టిలో ఉంచుకుని రూపొందించబడింది. విశాలమైన సీటింగ్, ఆధునిక డిజైన్, స్మార్ట్ ఫీచర్లు దీని ప్రత్యేకత. పూర్తి ఛార్జ్ తో 123 నుంచి 159 కి.మీ వరకు రేంజ్ ఇస్తుంది. టెక్నాలజీతో పాటు సౌకర్యం కోరుకునే వారికి ఇది సరైన స్కూటర్.

⦿బజాజ్ చేతక్

బజాజ్ ఆటో తయారు చేసిన చేతక్ ఎలక్ట్రిక్ కూడా మంచి అమ్మకాలు సాధిస్తోంది. క్లాసిక్ లుక్‌ తో పాటు ప్రీమియం ఫీల్ ఇస్తుంది. మెటల్ బాడీ నిర్మాణం దీనికి అదనపు బలం. ఒకే ఛార్జ్ తో 113 నుండి 151 కి.మీ వరకు రేంజ్ ఇస్తుంది. స్టైల్, నాణ్యతను ప్రాధాన్యంగా చూసే వారికి ఇది నచ్చుతుంది.

⦿ విడా V2

Advertisement

బెస్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్లలో నాలుగోది హీరో కంపెనీకి చెందిన విడా V2. ఇది బడ్జెట్ ఫ్రెండ్లీ స్కూటర్‌గా గుర్తింపు పొందింది. ఒకే ఛార్జ్ తో 92 నుంచి 165 కి.మీ వరకు రేంజ్ ఇస్తుంది. ఇందులో ఉన్న పోర్టబుల్ బ్యాటరీ వల్ల ఎక్కడైనా సులభంగా ఛార్జ్ చేసుకోవచ్చు. తక్కువ ధరలో మంచి ఫీచర్లు కోరుకునే వారికి ఇది బెస్ట్ ఆప్షన్.

⦿ సుజుకి ఇ-యాక్సెస్

సుజుకి మోటార్ కంపెనీ తయారు చేసిన సుజుకి ఇ-యాక్సెస్ కూడా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇది కొత్తగా మార్కెట్‌లోకి వచ్చినప్పటికీ, బ్రాండ్ నమ్మకంతో మంచి ఆదరణ పొందుతోంది. ఒకే ఛార్జ్ తో ఈ స్కూటర్ సుమారు 95 కి.మీ రేంజ్ ఇస్తుంది. సుజుకి కంపెనీపై విశ్వాసం ఉన్నవారికి ఇది మెంచి ఆప్షన్ గా చెప్పుకోవచ్చు.

మొత్తంగా రోజువారీ ఉపయోగం కోసం చూస్తే టీవీఎస్ ఐక్యూబ్ బాగుంటుంది. ఫ్యామిలీ కోసం అయితే ఏథర్ రిజ్టా సరిపోతుంది. స్టైల్, బిల్డ్ క్వాలిటీ కావాలంటే చేతక్ ఎలక్ట్రిక్ మంచిది. తక్కువ ఖర్చుతో మంచి ఫీచర్లు కావాలంటే విడా V2 తీసుకోవచ్చు. బ్రాండ్ నమ్మకాన్ని పరిగణలోకి తీసుకుంటే సుజుకి ఇ-యాక్సెస్‌ మంచి ఆప్షన్ గా చెప్పుకోవచ్చు.

Read Also: ఓలా వెనుకబాటు, ఏథర్ ముందడుగు.. ఈవీ రంగంలో కొత్త పోటీ!

Related News

100 కి.మీ స్పీడ్.. 200 కి.మీ రేంజ్.. ఆంపియర్ కొత్త ఎలక్ట్రిక్ బైక్‌కు పేటెంట్!

బజాజ్ బిగ్ రికార్డ్.. 3 లక్షల EV అమ్మకాలు దాటేసింది!

8 నెలల్లోనే 10 లక్షలు.. ఎలక్ట్రిక్ స్కూటర్ల సేల్ లో అదిరిపోయే రికార్డ్!

హ్యుందాయ్ కొత్త SUV ఇంటీరియర్ లీక్.. క్రెటాకు పోటీ తప్పదా?

మాన్యువల్ కార్ల కంటే ఆటోమేటిక్ కార్లే ఫాస్టా? ఇదీ అసలు కథ!

ఏంటీ.. మారుతీ, హుందాయ్‌లో 5 స్టార్ సేఫ్టీ కార్లు ఉన్నాయా? ఇదిగో లిస్టు!

యమహా R2 వచ్చేసింది.. ఈ బైక్‌ లో అదిరిపోయే 5 హైలైట్స్ ఇవే!

సింపుల్ ఫ్లిప్ అప్ కాదు.. ఈ హెల్మెట్ 180 డిగ్రీలు తిరుగుతుంది!

Big Stories

Advertisement
×