E-Paper
Advertisement

డెంటిస్ట్ దగ్గరకు వెళ్లకుండానే పంటి నొప్పి తగ్గాలా? ఈ టిప్స్ మీ కోసమే!

డెంటిస్ట్ దగ్గరకు వెళ్లకుండానే పంటి నొప్పి తగ్గాలా? ఈ టిప్స్ మీ కోసమే!
Advertisement

Tips For Tooth Pain: పంటి నొప్పి అనేది ఎప్పుడైనా రావచ్చు. కానీ అది అర్ధరాత్రి సమయంలో మొదలైతే ఆ నరకం వర్ణనాతీతం. ఆ సమయంలో డెంటిస్ట్ అందుబాటులో ఉండరు. నిద్ర పట్టదు, కొన్ని సార్లు ఈ నొప్పి భరించలేనంతగా ఉంటుంది. రాత్రి పూట పడుకున్నప్పుడు తల వైపు రక్త ప్రసరణ పెరగడం వల్ల పంటి నొప్పి మరింత ఉధృతంగా మారుతుంది. అయితే.. వంటింట్లో దొరికే కొన్ని సహజ సిద్ధమైన పదార్థాలతో ఈ నొప్పిని తక్షణమే తగ్గించుకోవచ్చు.నిపుణుల సూచనల ప్రకారం రాత్రి పూట పంటి నొప్పిని తగ్గించే వేగవంతమైన మార్గాలు ఇప్పుడు తెలుసుకుందాం.

రాత్రి పూట పంటి నొప్పి తగ్గడానికి 6  హోం రెమెడీస్:
1. గోరువెచ్చని ఉప్పు నీటితో పుక్కిలించడం:
ఇది పంటి నొప్పికి అత్యంత సులభమైన, ప్రభావవంతమైన మార్గం. ఉప్పు నీరు సహజ క్రిమిసంహారిణిగా పనిచేస్తుంది.

Advertisement

ఎలా చేయాలి: ఒక గ్లాసు గోరు వెచ్చని నీటిలో అర టీస్పూన్ ఉప్పు కలిపి.. ఆ నీటిని నోట్లో పోసుకుని 30 సెకన్ల పాటు పుక్కిలించాలి. ఇది పంటి సందుల్లో ఉన్న ఆహార కణాలను తొలగించి.. వాపును తగ్గిస్తుంది.

2. లవంగం లేదా లవంగం నూనె:
లవంగంలో ‘యూజీనాల్’ అనే సహజ అనస్థీషియా ఉంటుంది.ఇది నొప్పిని మొద్దుబారేలా చేస్తుంది.

Advertisement

ఎలా చేయాలి: ఒక చిన్న దూది ముక్కను లవంగం నూనెలో ముంచి నొప్పి ఉన్న పంటిపై ఉంచాలి. ఒకవేళ నూనె లేకపోతే.. ఒక లవంగాన్ని బుగ్గన పెట్టుకుని నెమ్మదిగా నమలాలి. దాని నుంచి వచ్చే జ్యూస్ నొప్పిని హరిస్తుంది.

3. కోల్డ్ కంప్రెస్ :
పంటి నొప్పి వల్ల గడ్డం లేదా బుగ్గ వాపు వచ్చినప్పుడు ఐస్ ప్యాక్ అద్భుతంగా పని చేస్తుంది.

ఎలా చేయాలి: ఐస్ క్యూబ్స్‌ను ఒక టవల్‌లో చుట్టి, బుగ్గ బయట వైపు నొప్పి ఉన్న చోట 15-20 నిమిషాల పాటు ఉంచాలి. ఇది రక్తనాళాలను కుంచించుకుపోయేలా చేసి నొప్పి తీవ్రతను తగ్గిస్తుంది.

4. వెల్లుల్లి రెబ్బ :
వెల్లుల్లిలో యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు మెండుగా ఉంటాయి.ఇది ఇన్ఫెక్షన్‌ను కలిగించే బ్యాక్టీరియాను చంపుతుంది.

ఎలా చేయాలి: ఒక వెల్లుల్లి రెబ్బను తీసుకుని దాన్ని పేస్ట్‌లా చేసి, కొద్దిగా ఉప్పు కలిపి నొప్పి ఉన్న పంటిపై పెట్టాలి.ఇది యాంటీ బయాటిక్‌లా పనిచేసి నొప్పిని తగ్గిస్తుంది.

5. తల కింద ఎత్తుగా దిండు పెట్టుకోవడం:
రాత్రి పడుకున్నప్పుడు పంటి నొప్పి పెరగడానికి ప్రధాన కారణం తలకు రక్త ప్రసరణ పెరగడం.

చిట్కా: పడుకునేటప్పుడు ఒకటి కంటే ఎక్కువ దిండ్లు ఉపయోగించి తలను కాస్త ఎత్తులో ఉంచండి. దీని వల్ల రక్త ప్రసరణ ఒత్తిడి తగ్గి.. నొప్పి తీవ్రత తగ్గుతుంది.

Also Read: ఎండలో నుంచి రాగానే స్నానం వద్దు.. ఎందుకో తెలిస్తే షాక్ అవుతారు!

6. పుదీనా టీ :
పుదీనాలో ఉండే మెంథాల్ నొప్పిని తగ్గించే గుణాన్ని కలిగి ఉంటుంది.

ఎలా చేయాలి: వేడి పుదీనా టీని తాగడం లేదా వాడిన పుదీనా టీ బ్యాగ్‌ను కొద్దిగా చల్లార్చి నొప్పి ఉన్న పంటిపై ఉంచడం వల్ల ఉపశమనం కలుగుతుంది.

గమనిక:
పైన పేర్కొన్న చిట్కాలు కేవలం తాత్కాలిక ఉపశమనం కోసం మాత్రమే.. ఇవి నొప్పిని తగ్గించగలవు కానీ పంటి సమస్యను శాశ్వతంగా నయం చేయలేవు. కాబట్టి.. మరుసటి రోజు ఉదయమే తప్పనిసరిగా డెంటిస్ట్‌ను సంప్రదించి సరైన చికిత్స తీసుకోవాలి. నొప్పిని నిర్లక్ష్యం చేయడం వల్ల అది చిగుళ్ల వాపు లేదా ఇతర తీవ్రమైన సమస్యలకు దారితీయవచ్చు.

Related News

52 ఏళ్ల వయసులో తల్లి కాబోతున్న ప్రముఖ నటి.. ఆ వయసులో గర్భం దాల్చడం ఆరోగ్యకరమేనా?

పిల్లల్లో డిప్రెషన్ ముప్పును తగ్గించే చిన్ననాటి అనుభవాలు ఇవే.. పేరెంట్స్ ఇవి తప్పక తెలుసుకోవాలి!

సాయంత్రం పూట వేడి వేడిగా ఇలా చేసి పెట్టండి ఇంటిల్లిపాదీ ఇష్టంగా తింటారు!

హోటల్ స్టైల్ క్రిస్పీ ఇన్‌స్టంట్ రవ్వ దోశ.. 15 నిమిషాల్లో ఇలా తయారు చేసుకోండి!

పిల్లల చేతి నుంచి ఫోన్ తీసుకోగానే ఏడుస్తున్నారా? ఇలా చేస్తే స్వయంగా ఇచ్చేస్తాడు

మన రక్తంలో ప్లాస్టిక్ విధ్వంసం.. తాజా రీసెర్చ్‌లో తేలిన సంచలన విషయాలు!

ఈ నవరాత్రులకు 3 స్పెషల్ డిషెస్.. ప్రసాదంగానూ పెట్టొచ్చు, రుచికి తిరుగే ఉండదు!

ఇడ్లీ,దోశలోకి అదిరిపోయే రుచితో ఉల్లిపాయ చట్నీలు..ఇలా చేసేయండి!

Big Stories

Advertisement
×