E-Paper
Advertisement

టోమోలో వసూళ్ల పర్వం.. అడ్వర్టైజింగ్ రంగంలో లీగల్ దందా..!

టోమోలో వసూళ్ల పర్వం.. అడ్వర్టైజింగ్ రంగంలో లీగల్ దందా..!

Illegal Collections: స్వేచ్ఛ బ్యూరో: తెలంగాణ అవుట్‌డోర్ మీడియా ఓనర్స్ అసోసియేషన్ (టోమో) లీగల్ ఖర్చుల పేరిట ఇల్లీగల్ వసూళ్లకు పాల్పడుతున్నట్లు సర్వత్రా ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇటీవలే తీసుకున్న ఈ వసూళ్ల నిర్ణయం ప్రకటనల విభాగంలో తీవ్ర స్థాయిలో దుమారం రేపుతుంది. లీగల్ ఖర్చుల పేరుతో అసోసియేషన్లో సభ్యత్వం కలిగిన ఏజెన్సీల నుంచి భారీగా నిధులు వసూలు చేయాలని నిర్ణయించడం తీవ్ర విమర్శలకు దారితీస్తోంది. గత ఫిబ్రవరి 23న తార్నాకాలో జరిగిన సమావేశాన్ని సాకుగా చెబుతూ ఈ వసూళ్లకు తెరతీసినట్లు వవాదనలున్నాయి. సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను ఆధారంగా చేసుకుని ప్రతి ఏజెన్సీపై హోర్డింగ్స్ సంఖ్యను బట్టి భారీ చార్జీలు విధించడం చిన్న అడ్వర్టైజ్మెంట్ సంస్థలకు పెద్ద భారంగా మారింది.

అదనపు వసూళ్లు..

ప్రతి హోర్డింగ్‌కు రూ.10 వేలు, యూనిపోల్‌కు రూ.50 వేలు వంటి అధిక రేట్లు నిర్ణయించడం సబబు కాదన్న వాదనలు సైతం వినిపిస్తున్నాయి. ముఖ్యంగా లాలీపాప్ బోర్డులు, బస్ షెల్టర్లపైనా అదనపు వసూళ్లు విధించడం పట్ల ఆందోళనలు కూడా వ్యక్తం అవుతున్నాయి. ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, ఈ వసూళ్లకు సంబంధించి పూర్తి స్థాయి ఖర్చుల వివరాలు లేదా లీగల్ కేసులపై స్పష్టత ఇవ్వలేదని సభ్య ఏజెన్సీలు ఆరోపిస్తున్నాయి. దీంతో ఈ ఈ రకంగా వసూలు చేస్తున్న ఈ నిధులు ఎలా? ఎందుకోసం వినియోగిస్తారు అన్నది కూడా అనుమానంగానే మారింది.

ఏజెన్సీలు ఆందోళన

ఏప్రిల్ 6లోపు డబ్బులు చెల్లించాలంటూ తక్షణ గడువు విధించడం కూడా సభ్యులపై ఒత్తిడి పెంచుతుందన్న వాదనలు సైతం లేకపోలేదు. ఇప్పటికే మార్కెట్‌లో ఆదాయం తగ్గిన పరిస్థితుల్లో ఈ విధమైన నిర్ణయాలు మరింత కష్టాల్లోకి నెట్టేస్తున్నాయని చిన్న ఏజెన్సీలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. జాబితాలో ఉన్న కొన్ని పెద్ద సంస్థలకు లక్షల్లో చెల్లింపులు రావడం గమనార్హం. కొంతమంది ఏజెన్సీలకు రూ.5 లక్షల నుంచి రూ.20 లక్షల వరకు బిల్లులు రావడంతో ఆందోళన నెలకొంది. ఇదిలా ఉండగా, కొన్ని ఏజెన్సీలకు “జీరో” మొత్తాలు చూపడం కూడా అనుమానాలకు తావిస్తోంది. రేట్ల రేట్లను ఏ ప్రామాణికంగా నిర్ణయించారు? అన్న విషయంపై కూడా అనేక అనుమానాలు నెలకొన్నాయి. అసమానతలు ఉన్నాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.

Also Read: నల్ల బెల్లం vs పచ్చ బెల్లం.. ఆరోగ్యానికి ఏది బెస్ట్?

కోర్ కమిటీ ఏకపక్షంగా..

సభ్యులతో సమగ్రంగా చర్చించకుండా కోర్ కమిటీ ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుందన్న విమర్శలు వినిపిస్తున్నాయి.
టోమో కమిటీ మాత్రం ఈ వసూళ్లు తప్పనిసరి అని చెబుతున్నప్పటికీ, సభ్యులలో పెరుగుతున్న అసంతృప్తి పరిస్థితిని మరిన్ని ఇబ్బందుల్లోకి నెట్టేసేలా ఉంది. మొత్తానికి, లీగల్ ఖర్చుల పేరుతో చేపట్టిన ఈ వసూళ్ల వ్యవహారం ప్రకటన రంగంలో పెద్ద వివాదంగా మారే అవకాశాలున్నాయి.

సర్కారు స్పందించాల్సిందే..

లీగల్ ఖర్చుల పేరిట తోము చేస్తున్న ఇల్లీగల్ వసూళ్లకు సర్కారు వెంటనే స్పందించి చెక్ పెట్టాలన్న వాదనలు బలంగా వినిపిస్తున్నాయి. ఇదే సమయంలో టోమో తీసుకున్న ఈ నిర్ణయం ఎంతవరకు పారదర్శకమైనది ఎంతవరకు అవసరం అన్న దానిపై కూడా చర్చ జరగాలన్న వాదనలున్నాయి. లీగల్ ఖర్చుల వివరాలు, కేసుల స్థితి వంటి అంశాలను వెల్లడించకపోవడం కూడా పలు అనుమానాలకు తావిస్తుంది. కొన్ని ఏజెన్సీలకు అధిక భారం పడుతుండగా, మరికొన్నింటికి మినహాయింపులు ఎలా లభించాయన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ప్రత్యేకంగా చిన్న, మధ్యతరహా ఏజెన్సీలు ఈ వసూళ్లను భరించే స్థితిలో లేవని, ఇదే విషయాన్ని తేల్చి చెప్పాలని నిర్ణయించుకున్నట్లు విశ్వసనీయ సమాచారం.

నిధుల సేకరణ

ఇప్పటికే ప్రకటన రంగంలో తగ్గిన ఆదాయంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న సమయంలో ఈ విధమైన వసూళ్లు మరింత నష్టానికి దారి తీస్తాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు, ఈ వసూళ్లపై ప్రభుత్వం లేదా సంబంధిత అధికార సంస్థలు జోక్యం చేసుకోవాలనే డిమాండ్లు కూడా లేకపోలేవు. పారదర్శకత లేకుండా నిధుల సేకరణ చేపట్టడం సరి కాదన్న అభిప్రాయాలు కూడా ఉన్నాయి. మొత్తానికి, టోమో అసోసియేషన్ తీసుకున్న ఈ నిర్ణయం ప్రకటన రంగంలో విభేదాలకు దారి తీస్తూ, భవిష్యత్తులో మరింత పెద్ద స్థాయి వివాదాలకు కారణమయ్యే అవకాశాలున్నాయన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

Also read: గజ్వేల్ ఎమ్మెల్యే ఆఫీసుపై దాడి.. సీఎం రేవంత్‌పై.. హరీశ్ రావు ఫైర్

Related News

Operation Khazana: నక్సలైట్ల బంగారం కోసం.. భద్రతా బలగాలు కూంబింగ్..!

‘అధికారం పోయిన బలుపు తగ్గలేదు’ .. కేటీఆర్‌పై కడియం శ్రీహరి ఘాటు వ్యాఖ్యలు

పవన్ కల్యాణ్ వ్యవహారం.. నోరు విప్పిన తెలంగాణ బీజేపీ.. రెండు పార్టీలు రియాక్షన్ ఎందుకు?-చీఫ్ రామచందర్ రావు

Hyderabad: గుత్తా సుఖేందర్‌రెడ్డి చిట్ చాట్.. పవన్ భాష తీరు సరిగా లేదు

వేములవాడకు మహర్దశ: రూ.1000 కోట్లతో టూరిజం హబ్‌గా మాస్టర్ ప్లాన్!

అమెరికా ప్రమాదానికి గురైన మధుయాష్కీ భార్య.. అదుపు తప్పి పల్టీలు కొట్టిన కారు, అసలు ప్రమాదం ఎలా జరిగింది?

పాలమూరు ప్రాజెక్టులపై సీఎం రేవంత్ రెడ్డి ఫోకస్.. ఏ నిమిషానికి ఎక్కడ ఉంటారంటే?

నేనొక్కడినే వస్తా.. మీ కేబినెట్ మొత్తాన్ని తీసుకురండి.. సీఎం రేవంత్‌కు ఏలేటి సవాల్!

Big Stories

×