E-Paper
Advertisement

Most Searched Cars Jan 2026: న్యూ ఇయర్ లో ఎక్కువ మంది సెర్చ్ చేసి కార్లు ఇవే, టాప్ ప్లేస్ లో ఏది ఉందంటే?

Most Searched Cars Jan 2026: న్యూ ఇయర్ లో ఎక్కువ మంది సెర్చ్ చేసి కార్లు ఇవే, టాప్ ప్లేస్ లో ఏది ఉందంటే?
Advertisement

Most Searched Cars Jan 2026 In India:జనవరి 2026లో ఇండియన్ మార్కెట్ లోకి బోలెడు కార్లు అడుగు పెట్టాయి. వాటిలో పాపులర్ SUVల నుంచి అదిరిపోయే ఎలక్ట్రిక్ కార్ల వరకు ఉన్నాయి. చాలా కాలంగా మార్కెట్ లో సత్తా చాటుతున్న పెట్రోల్ కార్లను ఎలక్ట్రిక్ కార్లు వెనక్కి నెట్టే ప్రయత్నం చేశాయి. ముఖ్యంగా టాటా మోటార్స్, మహీంద్రా, మారుతి సుజుకి, కియా లాంటి కంపెనీల నుంచి సూపర్ కార్లు అందుబాటులోకి వచ్చాయి. ఈ నేపథ్యంలో చాలా మంది 2026 ట్రెండింగ్ కార్ల గురించి బాగా సెర్చ్ చేశారు. 2026లో ఎక్కువ మంది సెర్చ్ చేసిన కార్లు ఏవనేది ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..

జనవరి 2026లో ఎక్కువ మంది సెర్చ్ చేసిన కార్లు!  

⦿ టాటా పంచ్ ఫేస్‌లిఫ్ట్ 2026 

ఈ కారు జనవరి 13, 2026న విడుదల అయ్యింది. దీని ధర రూ. 5.59 లక్షల నుంచి రూ. 10.55 లక్షల వరకు ఉంది. దేశీ మార్కెట్ లో అత్యంత ప్రజాదరణ పొందిన సబ్ కాంపాక్ట్ SUV లలో ఒకటిగా కొనసాగుతోంది. రిఫ్రెష్డ్ డిజైన్,  అప్ డేటెడ్ ఇన్ఫోటైన్‌మెంట్, 1.2-లీటర్ రెవోట్రాన్ ఇంజిన్‌ను కలిగి ఉంది. మంచి స్టైలింగ్, మెరుగైన ఇంధన సామర్థ్యం, 5 స్టార్ భద్రతా రేటింగ్ ను కలిగి ఉంది.

⦿ కియా సెల్టోస్ 2026

Advertisement

ఈ కారు జనవరి 2, 2026న విడుదల అయ్యింది. దీని ధర రూ. 10.99 లక్షల నుంచి రూ. 20.19 లక్షల వరకు ఉంటుంది. K3 ప్లాట్‌ ఫామ్‌ మీద తయారు చేయబడింది. ప్రీమియం ఫీచర్లు, రీ డిజైన్ చేసిన నెక్ట్ జెనరేషన్ కాంపాక్ట్ SUVగా అందుబాటులోకి వచ్చింది. హైబ్రిడ్, మెరుగైన ADAS, విలాసవంతమైన క్యాబిన్ ఎంపికలతో పెట్రోల్, డీజిల్‌ వెర్షన్లలో అందుబాటులో ఉంది.

⦿ మహీంద్రా XUV 7XO

ఈ కారు జనవరి 5, 2026న విడుదల అయ్యింది. దీని ధర రూ. 13.66 లక్షల నుంచి రూ. 24.92 లక్షల వరకు ఉంటుంది. XUV700 మెయిన్ ఫేస్‌ లిఫ్ట్ గా వచ్చింది. కొత్త ట్రిపుల్ స్క్రీన్ లే అవుట్, రిఫ్రెష్ చేసిన డిజైన్ ను కలిగి ఉంది. 2.0L టర్బో పెట్రోల్, 2.2L డీజిల్, ADAS లెవల్ 2, పనోరమిక్ సన్‌ రూఫ్ లాంటి ఫీచర్లను కలిగి ఉంది.

⦿ టాటా సియెర్రా EV

Advertisement

ఈ కారు జనవరి 26, 2026న విడుదలయ్యే అవకాశం ఉంది. అంచనా ధర రూ. 15 – రూ. 24 లక్షలు. ఒకే ఛార్జ్ తో 500 కి.మీ ప్రయాణించే అవకాశం ఉంది. ప్రీమియం ఎలక్ట్రిక్ SUVగా మార్కెట్ లోకి అడుగు పెట్టబోతోంది. ప్యూచరిస్టిక్ డిజూన్, విశాలమైన క్యాబిన్, హైటెక్ కనెక్టివిటీని కలిగి ఉంది.

⦿మారుతి సుజుకి ఇ విటారా

ఈ కారు జనవరి 27, 2026న విడుదల కానుంది. అంచనా ధర రూ. 17 – రూ.22.50 లక్షలు ఉంటుంది. మారుతి నుంచి తొలి ఈవీగా అందుబాటులోకి రానుంది. ఇది ఒకే ఛార్జ్ మీద 500 కి.మీ కంటే ఎక్కువ పరిధిని అందించనుంది. ఇది  Heartect-e ప్లాట్‌ ఫామ్‌ పై తయారు చేయబడింది. అధునాతన 61 kWh బ్యాటరీ, 7 ఎయిర్‌ బ్యాగులు, లెవల్-2 ADAS లాంటి ఫీచర్లను కలిగి ఉంది.

Read Also:  యమహా నుంచి సూపర్ ఎలక్ట్రిక్ స్కూటర్, ఒకే ఛార్జ్ తో ఎంత దూరం వెళ్తుందంటే?

Related News

ఆగస్టు 15న మహీంద్రా బిగ్ బ్లాస్ట్.. 3 కొత్త SUVలు వచ్చేస్తున్నాయ్!

టీవీఎస్ నుంచి సూపర్ సర్‌ ప్రైజ్.. ఒకేసారి 3 మోడల్స్ వచ్చేస్తున్నాయ్!

కొత్త బ్రెజ్జా To హిలక్స్.. 10 రోజుల్లో 3 క్రేజీ మోడల్స్ ఎంట్రీ!

టెస్లా నుంచి పిల్లల కోసం కొత్త బైక్.. రేట్ ఎంత అంటే?

EV బ్యాటరీల్లో ఏది సేఫ్? కొనుగోలు చేసే ముందు ఈ విషయాలు తప్పకుండా తెలుసుకోవాల్సిందే!

వర్షాకాలంలో ఎలక్ట్రిక్ కారు కొనాలనుకుంటున్నారా? ఈ 4 మోడల్స్ బెస్ట్ ఛాయిస్!

కియా సైరోస్ EV vs కియా సైరోస్ ICE.. ఏది బెస్ట్? పూర్తి పోలిక ఇదే!

16 ఏళ్ల తర్వాత నిస్సాన్ మాస్టర్‌ పీస్.. కొత్త ఎల్గ్రాండ్ వచ్చేసింది!

Big Stories

Advertisement
×