E-Paper
Advertisement

Yamaha EC-06 Electric Scooter: యమహా నుంచి సూపర్ ఎలక్ట్రిక్ స్కూటర్, ఒకే ఛార్జ్ తో ఎంత దూరం వెళ్తుందంటే?

Yamaha EC-06 Electric Scooter: యమహా నుంచి సూపర్ ఎలక్ట్రిక్ స్కూటర్, ఒకే ఛార్జ్ తో ఎంత దూరం వెళ్తుందంటే?
Advertisement

Yamaha EC-06 Electric Scooter Launch Date: ఇండియన్ మార్కెట్ లోకి యమహా EC-06 ప్రీమియం ఎలక్ట్రిక్ స్కూటర్ అడుగు పెట్టబోతోంది. రివర్‌ భాగస్వామ్యంతో యమహా ఈ స్కూటర్ ను విడుదల చేయబోతోంది. 2026 ఫస్ట్ క్వార్టర్ లోనే ఈ స్కూటర్ రాబోతోంది. ఇది 4kWh ఫిక్స్‌డ్ బ్యాటరీని కలిగి ఉంటుంది. ఇది 4.5kW (6.7kW పీక్) మోటార్ ను కలిగి ఉంటుంది. 160 కి.మీ క్లెయిమ్డ్ రేంజ్, 90 కి.మీ. గరిష్ట వేగాన్ని అందుకుంటుంది. అంతేకాదు, 24.5-లీటర్ అండర్ సీట్ స్టోరేజ్‌ ను కలిగి ఉంటుంది. దీని ధర సుమారు రూ.1.6 లక్షలు ఉంటుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.

యమహా EC-06 బ్యాటరీ, పనితీరు

యమహా EC-06  ఎలక్ట్రిక్ స్కూటర్ 4 kWh ఫిక్స్ డ్ బ్యాటరీ ప్యాక్ ను కలిగి ఉంటుంది. ఒకే ఫుల్ ఛార్జ్ మీద ఏకంగా 160 కిలో మీటర్లు ప్రయాణించే అవకాశం ఉంటుంది. ఈ స్కూటర్ 4.5 kW నామినల్, 6.7 kW పీక్ పవర్ మిడ్ మౌంటెడ్ మోటార్ తో వస్తుంది. టాప్ స్పీడ్ గంటకు 90 కి.మీ ఉంటుంది. ఇక ఛార్జింగ్ విషయానికి వస్తే, ప్రైమరీ హోమ్ ప్లగ్ ను ఉపయోగించి సుమారు 9 గంటలు ఛార్జ్ చేయాల్సి ఉంటుంది. ఈ స్కూటర్ లో రివర్స్ అసిస్ట్ ఫంక్షన్‌ తో సహా మూడు మోడ్‌లను కలిగి ఉంటుంది.

Advertisement

Read Also: SYM నుంచి క్రేజీ స్కూటర్ లాంచ్, దీని మైలేజ్ ఎంతో తెలుసా?

యమహా EC-06 డిజైన్, ఫీచర్లు

యమహా EC-06 లో రెక్టాంగిల్ LED హెడ్‌ లైట్, ఆప్రాన్‌లో ఇంటిగ్రేటెడ్ ఇండికేటర్‌ లతో చక్కటి బాక్సీ డిజైన్ ను కలిగి ఉంటుంది.  డిస్ ప్లే విషయానికి వస్తే, కలర్ LCD కన్సోల్ ఉంటుంది. సీటు కింద సుమారు 25 లీటర్ల బూట్ స్పేస్ ఉంటుంది. కనెక్టివిటీ విషయానికి వస్తే రియల్ టైమ్ ట్రాకింగ్ కోసం సిమ్ ఆధారిత టెలిమాటిక్స్, కాల్స్, SMS కోసం యాప్ కనెక్టివిటీ, ఓవర్ ది ఎయిర్ అప్‌డేట్స్ ఉంటాయి. టెలిస్కోపిక్ ఫ్రంట్ ఫోర్క్, ట్విన్ రియర్ షాక్ అబ్జార్బర్స్ ఉంటాయి. ఫ్రంట్, రియర్ వీల్స కు డిస్క్ బ్రేక్‌లు ఉంటాయి. వీల్స్ విషయానికి వస్తే, 14 అంగుళాల అల్లాయ్ వీల్స్ ఉంటాయి.

Advertisement

Read Also: సరికొత్తగా 1940 నాటి బైక్.. మతి పోగొట్టేస్తున్న2026 ఇండియన్ చీఫ్ వింటేజ్!

విడుదల ఎప్పుడు? పోటీ వేటితో?  

యమహా EC-06  ఎలక్ట్రిక్ స్కూటర్ 2026 ఫస్ట్ క్వార్టర్ లో అందుబాటులోకి రానుంది. కర్ణాటకలో ఇప్పటికే ఉత్పత్తి జరుగుతోంది. దీని అంచనా ధర రూ. 1.60 లక్షలు (ఎక్స్ షోరూమ్) ఉంటుందని ఆటో నిపుణులు భావిస్తున్నారు. ఈ స్కూటర్,  ఏథర్ 450X, ఓలా S1 ప్రో, TVS iQube తో గట్టిగా పోటీ పడే అవకాశం ఉంటుంది. ఈ స్కూటర్ పట్టణ ప్రయాణాల కోసం రూపొందించబడింది. మంచి లుక్, చక్కటి ఫీచర్లతో యువతను ఆకట్టుకోనుంది.

Read Also:  కవాసకి క్రేజీ ఆఫర్.. ఆ బైక్ మీద ఏకంగా 1.43 లక్షల డిస్కౌంట్!

Related News

25 ఏళ్ల క్రితమే భారత్ లో పరుగులు తీసిన ఎలక్ట్రిక్ కారు.. మళ్లీ మార్కెట్ లోకి వస్తుందా?

లాంచ్‌కు ముందే క్రేజీ డీటైల్స్ లీక్.. కొత్త బ్రెజ్జాలో ఫీచర్లు చూస్తే మతిపోవాల్సిందే!

ఆగస్టు 15న మహీంద్రా బిగ్ బ్లాస్ట్.. 3 కొత్త SUVలు వచ్చేస్తున్నాయ్!

టీవీఎస్ నుంచి సూపర్ సర్‌ ప్రైజ్.. ఒకేసారి 3 మోడల్స్ వచ్చేస్తున్నాయ్!

కొత్త బ్రెజ్జా To హిలక్స్.. 10 రోజుల్లో 3 క్రేజీ మోడల్స్ ఎంట్రీ!

టెస్లా నుంచి పిల్లల కోసం కొత్త బైక్.. రేట్ ఎంత అంటే?

EV బ్యాటరీల్లో ఏది సేఫ్? కొనుగోలు చేసే ముందు ఈ విషయాలు తప్పకుండా తెలుసుకోవాల్సిందే!

వర్షాకాలంలో ఎలక్ట్రిక్ కారు కొనాలనుకుంటున్నారా? ఈ 4 మోడల్స్ బెస్ట్ ఛాయిస్!

Big Stories

Advertisement
×