E-Paper
Advertisement

Best AI Smartphones: రూ.60వేల లోపు టాప్-5 AI స్మార్ట్‌ఫోన్లు.. ఐఫోన్ నుంచి శాంసంగ్ వరకు అదిరిపోయే ఫీచర్లు!

Best AI Smartphones: రూ.60వేల లోపు టాప్-5 AI స్మార్ట్‌ఫోన్లు.. ఐఫోన్ నుంచి శాంసంగ్ వరకు అదిరిపోయే ఫీచర్లు!
Advertisement

Best AI Smartphones: ప్రస్తుతం ఎక్కడ చూసినా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రాజ్యమే నడుస్తోంది. ఒకప్పుడు లక్ష రూపాయాల కంటే ఎక్కువ ధర ఉన్న ఫోన్లకే పరిమితమైన ఈ స్మార్ట్ ఫీచర్లు, ఇప్పుడు బడ్జెట్ ధరల పరిధిలోకి వచ్చేశాయి. ఫొటోలను ఎడిట్ చేయడం నుంచి లైవ్ ట్రాన్స్‌లేషన్ వరకు అన్నీ చిటికెలో చేసేస్తున్నాయి. మీరు కూడా మంచి AI ఫోన్ కొనాలనుకుంటున్నారా? అయితే, 2026లో రూ.60 వేల లోపు దొరికే ఈ టాప్-5 స్మార్ట్‌ఫోన్లపై ఓ లుక్కేయండి..

Motorola Razr 50

స్టైల్‌తో పాటు మెరుగైన పనితీరు కోరుకునే వారికి ఈ ఫోల్డబుల్ మోటరోలా రేజర్ 50 ఫోన్ బెస్ట్ ఆప్షన్. రూ.54,999కే లభిస్తున్న ఈ ఫోన్‌లో 6.9 అంగుళాల భారీ LTPO AMOLED డిస్‌ప్లే ఉంది. దీనిలోని AI కెమెరా ఫీచర్లు ఫోల్డబుల్ స్క్రీన్‌ను మరింత స్మార్ట్‌గా మారుస్తాయి. అలాగే 50MP మెయిన్ కెమెరా, 32MP సెల్ఫీ షూటర్ అద్భుతమైన ఫొటోలను క్యాప్చర్ చేస్తాయి.

Advertisement

Also Read: మీ కళ్లు చూసి ‘బ్రెయిన్ స్ట్రోక్’ ముప్పును చెప్పేసే ఏఐ.. వైద్య రంగంలో సరికొత్త విప్లవం!

OnePlus 13s

వన్‌ప్లస్ నుంచి వస్తున్న ఈ మోడల్ కేవలం స్పీడ్‌గానే కాదు.. స్మార్ట్ ఫీచర్లకు పెట్టింది పేరు. రూ.52,999 ధరలో లభించే ఈ ఫోన్‌లో స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ చిప్‌సెట్‌ను అమర్చారు. ఈ ఫోన్‌లోని AI నోట్స్, రిఫ్లెక్షన్ ఎరేజర్, అన్‌బ్లర్ ఫీచర్లు మీ ఫొటోగ్రఫీని, ఆఫీస్ వర్క్‌ను సులభతరం చేస్తాయి. ముఖ్యంగా ఆక్సిజన్ OS 16తో వచ్చే ఈ ఫోన్ యూజర్ ఎక్స్‌పీరియన్స్ చాలా మెరుగ్గా ఉంటుంది.

iPhone 16e

Advertisement

తక్కువ ధరలో ఐఫోన్ కావాలంటే.. అది కూడా Apple Intelligence ఫీచర్‌ను సొంతం చేసుకోవాలనుకుంటే ఐఫోన్ 16eను కొనుగోలు చేయవచ్చు. రూ.52,390కే అందుబాటులో ఉన్న ఈ ఫోన్ A18 చిప్‌తో పనిచేస్తుంది. రైటింగ్ టూల్స్, రికార్డింగ్ సమ్మరీ వంటి AI ఫీచర్లు దీనిలో హైలైట్. అలాగే ఈ ఫోన్‌లోని 48MP ఫ్యూజన్ కెమెరాతో సినిమాటిక్ వీడియోలు తీసుకోవచ్చు.

Realme GT 7 Pro

భారీ బ్యాటరీ, ఫాస్ట్ ఛార్జింగ్ అయ్యే ఫోన్ కావాలనుకుంటే.. రియల్‌మి జీటీ 7 ప్రోని మించింది లేదు. రూ.50,999కే లభిస్తోన్న ఈ ఫోన్‌ 6500mAh బ్యాటరీని కలగి ఉంటుంది. AI నైట్ విజన్, AI స్కెచ్ వంటి అత్యాధుని ఫీచర్లు దీనిలో ఉన్నాయి. 120W ఫాస్ట్ ఛార్జింగ్‌తో నిమిషాల్లో ఫోన్ ఫుల్ ఛార్జ్ అవుతుంది.

Samsung Galaxy S24 Plus

శాంసంగ్ తన గెలాక్సీ AI ఫీచర్లతో స్మార్ట్‌ఫోన్ రంగాన్నే మార్చేసింది. రూ.59,999కే లభిస్తున్న S24 ప్లస్‌లో లైవ్ ట్రాన్స్‌లేట్, జనరేటివ్ ఎడిట్ వంటి ప్రీమియం ఫీచర్లు ఉన్నాయి. ఇందులోని 6.7 అంగుళాల డైనమిక్ AMOLED 2X డిస్‌ప్లే వీడియోలు చూడటానికి అద్భుతంగా ఉంటుంది. మంచి బ్రాండ్ వాల్యూ, మెరుగైన సాఫ్ట్‌వేర్ అప్‌డేట్స్ కోరుకునే వారికి ఇది ఆల్ రౌండర్ ఫోన్.

Also Read: యాపిల్ ప్రియులకు బంపర్ ఆఫర్.. రూ.53వేలకే మ్యాక్‌బుక్ Air M4.. ఐఫోన్‌ కొంటే ఎయిర్‌పాడ్స్ ఫ్రీ!

 

Related News

బడ్జెట్ ధరలో.. బెస్ట్ వాషింగ్ మెషీన్ హయర్ 6.5 కేజీ టాప్ లోడ్ రివ్యూ?

రూ.20వేలలోపు శామ్‌సంగ్ గెలాక్సీ M36 5G.. ఫోన్ అంటే ఇలా ఉండాలి బాస్

స్టూడెంట్స్ అండ్ యూత్‌కి పండగే..తక్కువ ధరలో ఎక్కువ ఫీచర్లు

వివో మాస్టర్ ప్లాన్ అదిరింది.. మూడు 200 మెగాపిక్సల్ కెమెరాలతో Vivo X500 Ultra ఎంట్రీ!

ఐఫోన్, శాంసంగ్‌లకు దెబ్బ మీద దెబ్బ.. హువావే నుంచి మరో మైండ్ బ్లోయింగ్ ఫోన్, డిజైన్ లీక్!

సిమ్ కార్డుకు ఒక వైపు ఎందుకు కట్ చేసి ఉంటుందో తెలుసా? దీని వెనుక ఉన్న అసలు సీక్రెట్ ఇదే!

అమెజాన్‌లో దుమ్ములేపుతున్న..రెడ్‌మీ లేటెస్ట్ స్మార్ట్‌వాచ్!

వార్నీ.. ఇన్నాళ్లూ స్మార్ట్‌ఫోన్ పవర్ బటన్‌ను వేస్ట్‌గా వాడామా? ఇందులో ఇంత మ్యాజిక్ ఉందా!

Big Stories

Advertisement
×