జనవరి 2026లో టాప్ బ్రాండ్లకు చెందిన టూవీలర్స్ మార్కెట్ లో బాగా అమ్ముడయ్యాయి. అదే సమయంలో చాలా మంది ఏ బైక్ కొంటే బాగుంటుంది అని బాగా సెర్చ్ చేశారు. తాజా డేటా ప్రకారం జనవరి 2026లో ఎక్కువ మంది సెర్చ్ చేసిన, అత్యధికంగా అమ్ముడైన బైక్‌లలో కమ్యూటర్ మోడల్స్ సత్తా చాటాయి. కొత్త, స్పోర్టీ, ఎలక్ట్రిక్ లాంచ్ ల పట్ల నెటిజన్లు ఎక్కువ ఆసక్తి చూపించారు.
⦿ హీరో స్ప్లెండర్ ప్లస్: మంచి మైలేజ్, మంచి బిల్డ్ క్వాలిటీని కలిగి ఉన్న ఈ బైక్ గురించి ఎక్కువ మంది సెర్చ్ చేశారు. అదే సమయంలో ఎక్కువ యూనిట్లు అమ్ముడయ్యాయి కూడా.
⦿ హోండా యాక్టివా: దేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న స్కూటర్ గా గుర్తింపు తెచ్చుకుంది.
⦿ హోండా షైన్: బాగా సెర్చ్ చేసిన 125cc కమ్యూటర్ బైక్ గా షైన్ గుర్తింపు తెచ్చుకుంది.
⦿ టీవీఎస్ జూపిటర్: స్కూటర్ మార్కెట్లో ఈ మోడల్ బాగా సత్తా చాటుతోంది.
⦿ బజాజ్ పల్సర్ సిరీస్: స్పోర్టి డిజైన్, మంచి పని తీరు కోసం బాగా సెర్చ్ చేయబడింది.
⦿ రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ 350, బుల్లెట్ 350: ప్రీమియం కమ్యూటింగ్ విభాగంలో ఈ బైక్స్ బాగా సెర్చ్ చేయబడ్డాయి.
⦿ TVS Apache RTR 160: బాగా పాపులర్ అయిన స్పోర్టీ కమ్యూటర్ ను బాగా సెర్చ్ చేశారు.
⦿ హీరో ఎక్స్ ట్రీమ్ 125R: దాని స్టైలిష్, స్పోర్టీ, కమ్యూటర్ ఫ్రెండ్లీ డిజైన్ కోసం బాగా ట్రెండ్ అయ్యింది.
⦿ BMW F 450 GS: ఈ 420cc అడ్వెంచర్ బైక్ కోసం చాలా మంది ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
⦿ రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్ 650: 2025లో లాంచ్ అయిన ఈ బైక్ త్వరలో విడుదల కానుంది.
⦿ హీరో కరిజ్మా XMR 250: అత్యధికంగా సెర్చ్ చేయబడిన అప్ కమింగ్ స్పోర్ట్స్ బైక్.
⦿ TVS Apache RTX 300: చాలా మంది ఆసక్తిగా ఎదురుచూస్తున్న స్ట్రీట్ బైక్.
Read Also: మార్కెట్ లోకి OSM Vextra ఎలక్ట్రిక్ స్కూటర్, ఫీచర్లు చూస్తే మతిపోవాల్సిందే!
జనవరి 2026లో ఎక్కువ మంది సెర్చ్ చేసిన ఎలక్ట్రిక్ టూవీలర్స్ లో TVS (iQube, బజాజ్ చేతక్ ముందున్నాయి. ఏథర్ 450 సిరీస్ కూడా మంచి డిమాండ్ ను కలిగి ఉంది. ప్రీమియమైజేషన్ లో 350cc, 650cc బైక్‌లపై ఆసక్తి పెరుగుతోంది. RE హంటర్ 350, కాంటినెంటల్ GT 650 ను బాగా సెర్చ్ చేశారు. అటు పెర్ఫార్మెన్స్ స్కూటర్లలో TVS Ntorq 125, Yamaha RayZR గురించి ఎక్కువ మంది సెర్చ్ చేశారు.
Read Also: జావా 42 బాబర్ vs రాయల్ ఎన్ఫీల్డ్ గోవాన్ క్లాసిక్ 350.. ఏ కారు కొనాలంటే?