E-Paper
Advertisement

Most Searched Washing Machines Jan 2026: జనవరిలో ఎక్కువ మంది.. సెర్చ్ చేసిన వాషింగ్ మిషన్లు.. ఫీచర్లు చూస్తే ఫిదానే!

Most Searched Washing Machines Jan 2026: జనవరిలో ఎక్కువ మంది.. సెర్చ్ చేసిన వాషింగ్ మిషన్లు.. ఫీచర్లు చూస్తే ఫిదానే!
Advertisement

Most Searched Washing Machines Jan 2026: వాషింగ్ మిషన్లకు కాలంతో పనిలేకుండా ఏడాది పొడవునా డిమాండ్ ఉంటూనే ఉంటుంది. ఎప్పటికప్పుడు మార్కెట్ లోకి కొత్త సాంకేతికతతో వాషింగ్ మిషన్లు రావడం.. ప్రజలు వాటిని కొనుగోలు చేస్తుండటం నిత్యం చూస్తూనే ఉంటాం. అయితే ఫిబ్రవరిలో కొత్తగా వాషింగ్ మిషన్ కొనుగోలు చేయాలని భావించేవారు సహజంగానే గత నెలలో ఎక్కువగా సేల్ అయిన వాషింగ్ మిషన్లను పరిశీలిస్తుంటారు. వాటి గురించి సెర్చ్ చేస్తుంటారు. ఈ నేపథ్యంలో గత నెలలో ఎక్కువ మంది శోధించిన వాషింగ్ మిషన్లు ఇక్కడ ఇవ్వడం జరిగింది. వాటి ఫీచర్లు, ధరల వివరాలపై ఓ లుక్కేయండి.

LG 9Kg Top Load

జనవరి నెలలో ఎక్కువ మంది ఈ ఎల్జీ వాషింగ్ మిషన్ కోసం సెర్చ్ చేశారు. దీని ఫీచర్ల విషయానికి వస్తే.. స్మార్ట్ ఇన్వర్టర్ టెక్నాలజీ, టర్బో డ్రమ్, వై-ఫై కనెక్టివిటీ, 5 స్టార్ రేటింగ్ వంటి ఫీచర్లను కలిగి ఉంది. 4-6 సభ్యులు ఉన్న ఫ్యామిలీకి ఇది మంచి ఛాయిస్. మార్కెట్ లో రూ.22,490కి ఇది అందుబాటులో ఉంది.

Samsung 9Kg AI Eco Bubble

Advertisement

శాంసంగ్ కి చెందిన వాషింగ్ మిషన్లలో ఎక్కువ మంది ఈ మోడల్ (9Kg AI Eco Bubble)నే గత నెలలో సెర్చ్ చేశారు. ఇది ఫుల్లీ ఆటోమెటిక్ ఫ్రంట్ లోడ్ వాషింగ్ మిషన్. ఏఐ ఎకోబబుల్ టెక్నాలజీ (AI EcoBubble Technology)తో పనిచేస్తుంది. వైఫె కనెక్టివిటీ ఫెసిలిటీ కూడా ఉంది. స్మార్ట్ థింగ్స్ యాప్ ద్వారా దీనిని కంట్రోల్ చేయవచ్చు. హైజీని స్టీమ్, సూపర్ స్పీడ్, డిజిటల్ ఇన్వర్టర్ మోటర్ వంటి అదనపు ఫీచర్లు ఇందులో ఉన్నాయి. ఫ్లిప్ కార్ట్ లో రూ.42,700 సేల్ అవుతోంది.

IFB 7Kg Top/Front Load

ఐఎఫ్‌బీ కంపెనీకి చెందిన 7కేజీ వాషింగ్ మిషన్ సెగ్మెంట్ లో ఫ్రంట్ తోపాటు టాప్ లోడ్ మోడల్ ను ఎక్కువ మంది సెర్చ్ చేశారు. ఇది సూపిరియర్ క్లీనింగ్ సామర్థ్యాన్ని కలిగి ఉంది. వాష్ తర్వాత బట్టల క్వాలిటీ చాలా బాగున్నట్లు యూజర్లు చెబుతున్నారు. అంతేకాదు వాషింగ్ మిషన్ రన్ అవుతున్న సమయంలోనూ మరికొన్ని బట్టలు వేసేందుకు వీలు కలగడం దీని ప్రత్యేకతగా చెప్పవచ్చు. ప్రస్తుతం టాప్ లోడ్ ధర రూ.30,187 ఉండగా, ఫ్రంట్ లోడ్ రూ.33,099కు విక్రయిస్తున్నారు.

Advertisement

Also Read: Washing Machines Under Rs 15,000: కొత్త వాషింగ్ మిషన్ కావాలా? రూ.15,000లోపు ది బెస్ట్ ఇవే..!

Bosch 7kg/8kg Front Load

బోస్క్ కంపెనీకి చెందిన 7kg/8kg Front Load వాషింగ్ మిషన్ల గురించి గత నెలలో చాలా మంది సెర్చ్ చేశారు. ఇందులోని EcoSilence Drive మోటర్.. శబ్దాన్ని తగ్గించి స్మూత్ గా పనిచేసేలా చేస్తుంది. ఇందులోని యాక్టివ్ వాటర్ ప్లస్ ఫీచర్.. దుస్తుల రకాన్ని బట్టి ఎంత మేర నీరు అవసరమే అంతే వాటర్ ను వినియోగించుకుంటుంది. ఇది 5 స్టార్ ఎనర్జీ రేటింగ్ ను కలిగి ఉంది. 7 కేజీ వేరియంట్ ధర రూ.27,990గా ఉంటే.. 8 కేజీల మోడల్ ధర రూ.34,880గా ఉంది.

Also Read: Trending Washing Machines Feb 2026: మార్కెట్‌లోని తోపు వాషింగ్ మిషన్లు భయ్యా.. ఏ ఇల్లు చూసినా ఇవే!

Related News

స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్, భారీ బ్యాటరీ.. గేమర్స్ కోసం నెక్ట్స్ లెవెల్ టాబ్లెట్ వచ్చేసింది!

కెమెరా పక్కనే మరో డిస్‌ప్లే.. ఇన్ఫినిక్స్ కొత్త బడ్జెట్ ఫోన్ లుక్ చూశారా?

రెడ్‌మీ నోట్ 17కు రీబ్రాండెడ్‌గా Poco X8, M8 పవర్.. ఫీచర్లు, ధరల వివరాలు ఇవే!

ఇంటిని థియేటర్‌గా మార్చే బెస్ట్ బడ్జెట్ పోర్టబుల్ ప్రొజెక్టర్లు.. ధరలు కూడా బడ్జెట్‌లోనే!

Facebook వాడే ప్రతి ఒక్కరూ మార్చాల్సిన 5 సీక్రెట్ సెక్యూరిటీ సెట్టింగ్స్ ఇవే!

iPhone 18 Pro Max లీక్స్.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లాకే, కానీ ఆ ఒక్కటే పెద్ద ట్విస్ట్!

గేమర్స్‌కు పూనకాలు తెప్పిస్తున్న Oppo K15.. నీళ్లలో పడినా, రఫ్ అండ్ టఫ్ వాడినా తగ్గేదే లేదంట!

సోషల్ మీడియాలో వైరల్ అయ్యే వీడియో రియలా,ఫేకా? తెలుసుకోండిలా!

Big Stories

Advertisement
×