E-Paper
Advertisement

Most Searched EV scooters Jan 2026: ఐక్యూబ్ To చేతక్, జనవరిలో ఎక్కువ మంది సెర్చ్ చేసిన ఎలక్ట్రిక్ స్కూటర్లు ఇవే!

Most Searched EV scooters Jan 2026: ఐక్యూబ్ To చేతక్, జనవరిలో ఎక్కువ మంది సెర్చ్ చేసిన ఎలక్ట్రిక్ స్కూటర్లు ఇవే!
Advertisement

2026 జనవరిలో ఎలక్ట్రిక్ స్కూటర్లకు మంచి ఆదరణ దక్కింది. పలు బ్రాండ్లకు చెందిన ఈవీలు కొనుగోళ్లలో సత్తా చాటాయి. అమ్మకాల పరంగా టీవీఎస్ మోటార సత్తా చాటగా, ఓలా ఎలక్ట్రిక్ అమ్మకాలు భారీగా పడిపోయాయి. ఇక జనవరి 2026లో ఎక్కువగా సెర్చ్ చేయబడిన, అమ్ముడైన ఎలక్ట్రిక్ స్కూటర్ల గురించి ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..

జనవరి 2026లో ఎక్కువగా సెర్చ్ చేసిన ఎలక్ట్రిక్ స్కూటర్లు  

⦿ TVS iQube:  దేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన ఎలక్ట్రిక్ స్కూటర్‌గా టీవీఎస్ ఐక్యూబ్ తన ఆధిపత్యాన్ని కొనసాగించింది. TVS జనవరి 2026లో 34,440 యూనిట్లను అమ్మింది.  అత్యధిక నెలవారీ అమ్మకాల రికార్డును నెలకొల్పింది. టీవీఎస్ ఐక్యూబ్ దాదాపు 28 శాతం మార్కెట్ వాటాను కైవసం చేసుకుంది.

Advertisement

⦿ బజాజ్ చేతక్: సాలిడ్ మెటల్ బిల్డ్ తో పాటు బలమైన డిమాండ్ కారణంగా బజాజ్ చేతక్ రెండో స్థానాన్ని దక్కించుకుంది. ఇది ఒక నెలలో 25,505 యూనిట్లను అమ్మింది

⦿ ఏథర్ రిజ్టా: ఏథర్ ఎనర్జీ 21,915 యూనిట్లతో అమ్మకాల్లో మూడో స్థానంలో నిలిచింది. రిజ్టా మోడల్ బ్రాండ్‌ ను మాస్ మార్కెట్ ప్లేయర్‌ గా గుర్తింపు తెచ్చుకోవడంలో ఏథర్ ఉ సాయపడింది.

Advertisement

⦿ హీరో విడా: ఈ కంపెనీ కూడా ఎలక్ట్రిక్ స్కూటర్ల అమ్మకాల్లో మంచి వృద్ధిని సాధించింది. 13,273 అమ్మకాలతో మెయిన్ వాల్యూమ్ ప్లేయర్‌ గా అవతరించింది.

⦿ ఓలా ఎలక్ట్రిక్: ప్రముఖ ఎలక్ట్రిక్ స్కూటర్ల కంపెనీ ఓలా ఎలక్ట్రిక్ అనుకున్న స్థాయిలో సత్తా చాటలేకపోయింది. జనవరి 2026లో కేవలం 7,511 యూనిట్లను అమ్మింది. నెలవారీగా 16.7% తగ్గుదలను చవి చూసింది.

⦿ ఆంపియర్ నెక్సస్: 5,336 యూనిట్ల అమ్మకాలతో నమ్మకమైన, బడ్జెట్ ఫ్రెండ్లీ ఆప్షన్ గా తన గుర్తింపును కొనసాగించింది.

Read Also: యాక్టివా To సుజుకి.. జనవరిలో ఎక్కువ మంది నెటిజన్లు సెర్చ్ చేసిన స్కూటర్స్ ఇవే!

జనవరి 2026లో మార్కెట్ ట్రెండ్ ఎలా ఉందంటే?  

2026 జనవరిలో టీవీఎస్, బజాజ్ హై స్పీడ్ ఎలక్ట్రిక్ స్కూటర్ మార్కెట్‌ లో 60 శాతానికి పైగా నియంత్రణను కలిగి ఉన్నాయి.  హై టెక్ జిమ్మిక్కుల కంటే భద్రత, సర్వీస్ నెట్ వర్క్, బిల్డ్ క్వాలిటీ కారణంగా వినియోగదారులు ఈ స్కూటర్లను ఎక్కువగా ఇష్టపడుతున్నారు. బజాజ్‌తో పోల్చితే ఏథర్ అమ్మకాలు మరింత ఎక్కువగా కొనసాగుతున్నాయి. టాప్ 3లో గట్టి పోటీని కనబరుస్తోంది. కుటుంబ ప్రయాణాలకు అనుగుణంగా ఉండటంతో ఎక్కువగా ఆదరణ దక్కించుకుంటుంది. అటు ఓలా అమ్మకాలు గత నెలలో బాగా తగ్గాయి. ఉత్పత్తి, సర్వీసుకు సంబంధించిన సమస్యలు, కస్టమర్ల అసంతృప్తి కారణంగా అంతగా సత్తా చాటలేకపోయింది. ఇక లిథియం ఐరన్ ఫాస్ఫేట్ బ్యాటరీలు, వాటి భద్రత దృష్ట్యా బాగా డిమాండ్ ను కలిగి ఉన్నాయి. దీనివల్ల ఆంపియర్, TVS లాంటి బ్రాండ్లకు బాగా లాభం కలుగుతోంది. ఇక గత నెలలో మరింత చౌకైన 2026 బజాజ్ చేతక్ C2501, రాబోయే హోండా యాక్టివా e కోసం ఎక్కువ మంది బాగా సెర్చ్ చేశారు.

Read Also: జనవరిలో ఈ బైక్ గురించి తెగ సెర్చ్ చేశారట! ఇంతకీ దాని ప్రత్యేకత ఏంటో తెలుసా?

Related News

లాంచ్‌కు ముందే క్రేజీ డీటైల్స్ లీక్.. కొత్త బ్రెజ్జాలో ఫీచర్లు చూస్తే మతిపోవాల్సిందే!

ఆగస్టు 15న మహీంద్రా బిగ్ బ్లాస్ట్.. 3 కొత్త SUVలు వచ్చేస్తున్నాయ్!

టీవీఎస్ నుంచి సూపర్ సర్‌ ప్రైజ్.. ఒకేసారి 3 మోడల్స్ వచ్చేస్తున్నాయ్!

కొత్త బ్రెజ్జా To హిలక్స్.. 10 రోజుల్లో 3 క్రేజీ మోడల్స్ ఎంట్రీ!

టెస్లా నుంచి పిల్లల కోసం కొత్త బైక్.. రేట్ ఎంత అంటే?

EV బ్యాటరీల్లో ఏది సేఫ్? కొనుగోలు చేసే ముందు ఈ విషయాలు తప్పకుండా తెలుసుకోవాల్సిందే!

వర్షాకాలంలో ఎలక్ట్రిక్ కారు కొనాలనుకుంటున్నారా? ఈ 4 మోడల్స్ బెస్ట్ ఛాయిస్!

కియా సైరోస్ EV vs కియా సైరోస్ ICE.. ఏది బెస్ట్? పూర్తి పోలిక ఇదే!

Big Stories

Advertisement
×