Jasprit Bumrah: టీ20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ ప్రారంభమైంది. ఇవాల్టి నుంచి మార్చి 8వ తేదీ వరకు ఈ మెగా టోర్నమెంట్ కొనసాగనుంది. టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ ( ICC Men’s T20 World Cup 2026 ) నేపథ్యంలో ఇవాళ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాతో ( India vs United States of America, 3rd Match) తొలి మ్యాచ్ ఆడనుంది టీం ఇండియా. ఈ నేపథ్యంలో టీం ఇండియాకు మరో ఊహించని షాక్ తగిలింది. ఇప్పటికే గాయం కారణంగా హర్షిత్ రాణా (Harshit Rana ) జట్టుకు దూరమైన సంగతి తెలిసిందే. ఇప్పుడు మరో ప్లేయర్ కూడా తొలి మ్యాచ్ కు దూరం అవుతాడని అంటున్నారు. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాతో జరిగే తొలి మ్యాచ్ కు జస్‌ప్రీత్ బుమ్రా ( Jasprit Bumrah) దూరం కాబోతున్నట్లు తెలుస్తోంది. అతనికి వైరల్ ఫీవర్ సోగినట్లు వార్తలు వస్తున్నాయి. దీంతో జస్‌ప్రీత్ బుమ్రా పక్కకు పెట్టనున్నారు.
టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ లో ( ICC Men’s T20 World Cup 2026 ) భాగంగా ఇండియా వర్సెస్ అమెరికా మధ్య ఇవాళ తొలి మ్యాచ్ జరగనుంది. రాత్రి 7 గంటలకు ప్రారంభం కానున్న ఈ మ్యాచ్ కు జస్‌ప్రీత్ బుమ్రా ( Jasprit Bumrah) దూరమయ్యే ఛాన్సులు కనిపిస్తున్నాయి. నిన్న అర్ధరాత్రి జస్‌ప్రీత్ బుమ్రా కు వైరల్ ఫీవర్ ఎక్కువైనట్లు తెలుస్తోంది. దీంతో తొలి మ్యాచ్ కు జస్‌ప్రీత్ బుమ్రా కు రెస్ట్ ఇవ్వాలని అనుకుంటున్నారట. వైరల్ ఫీవర్ రావడంతో నిన్న గ్రౌండ్ కు వచ్చినప్పటికీ జస్‌ప్రీత్ బుమ్రా ప్రాక్టీస్ చేయలేదు. మరోవైపు హర్షిత్ రాణా ( Harshit Rana) స్థానంలో సిరాజ్ ( mohammed Siraj) బరిలోకి దిగే ఛాన్స్ ఉంది. ఇప్పుడు జస్‌ప్రీత్ బుమ్రా కు రెస్ట్ ఇస్తే సిరాజ్ కు తుది జట్టులో ఛాన్స్ వస్తుందని అంటున్నారు.
టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ ( ICC Men’s T20 World Cup 2026 ) ఇవాళ ప్రారంభమైన నేపథ్యంలో టీమిండియా కు ఊహించని షాకులు తగులుతున్నాయి. ఇప్పటికే హర్షిత్ రాణా మోకాలి గాయం కారణంగా జట్టుకు దూరమయ్యాడు. అలాగే వాషింగ్టన్ సుందర్ కూడా ఇప్పటివరకు ఫిట్ అయినట్లు వార్తలు బయటకు రాలేదు. లేటెస్ట్ గా బుమ్రా వైరల్ ఫీవర్ బారిన పడ్డాడు. దీంతో అమెరికాతో జరిగే మొదటి మ్యాచ్ భూముల దూరం కాబోతున్నాడు. అతని స్థానంలో మహమ్మద్ సిరాజ్ బరిలోకి దిగనున్నాడు. అంటే ప్రస్తుతం టీమిండియా సభ్యులలో 13 మంది మాత్రమే ఫిట్ గా ఉన్నారు.
🚨TEAM INDIA UPDATES ON USA MATCH.🚨(Indian Express)
– No Jasprit Bumrah in Playing XI.
– He is likely miss USA game due to viral fever.
– Sundar is not fully fit.
– India have only 13 fit player for USA match.
– Siraj joins team India in Mumbai.pic.twitter.com/hYYLgYiM6h— Sam (@Cricsam01) February 7, 2026