E-Paper
Advertisement

MotoGP Qatar GP Postponed: ఇరాన్ వార్ ఎఫెక్ట్, మోటోజీపీ ఖతార్ వాయిదా!

MotoGP Qatar GP Postponed: ఇరాన్ వార్ ఎఫెక్ట్, మోటోజీపీ ఖతార్ వాయిదా!
Advertisement

Qatar MotoGP Race Rescheduled: మిడిల్ ఈస్ట్ లో కొనసాగుతున్న యుద్ధం కారణంగా మోటోజీపీ ఖతార్ గ్రాండ్ ప్రిక్స్ ఈవెంట్ వాయిదా పడింది. షెడ్యూల్ ప్రకారం ఏప్రిల్‌ లో జరగాల్సిన ఈ రేస్ ను వాయిదా వేశారు. ఈ మేరకు నిర్వాహకులు అధికారిక ప్రకటన చేశారు. ఈ ఈవెంట్ ను నవంబర్ 8కి మార్చినట్లు తెలిపారు. అంతర్జాతీయ మోటార్‌ సైక్లింగ్ ఫెడరేషన్,  మోటోజీపీ ప్రమోటర్, ఖతార్‌ లోని స్థానిక అధికారులతో చర్చల అనంతరం తీసుకున్నట్లు నిర్వహాకులు వెల్లడించారు.

వాయిదాపై మోటోజీపీ ఏం చెప్పిందంటే?

మోటోజీపీ ప్రకటన ప్రకారం.. వాయిదా నిర్ణయం వెనుక ప్రధాన కారణం భద్రత అని వెల్లడించింది. ప్రధానంగా జట్లు, రైడర్లు, సిబ్బంది, అభిమానుల భద్రతకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుతం మిడిల్ ఈస్ట్ లో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు విమాన ప్రయాణాలకు అనకూలంగా లేవు. అంతేకాదు, జట్లు తమ ఎక్యుప్ మెంట్స్ ను తరలించడం, సిబ్బందిని సమయానికి తీసుకురావడం లాంటి లాజిస్టిక్స్ సమస్యలు కూడా ఎదురయ్యే అవకాశం ఉన్నట్లు భావించారు. ఈ నేపథ్యంలోనే వాయిదా నిర్ణయం తీసుకున్నారు.

కొత్త తేదీ ప్రకటించిన నిర్వాహకులు

Advertisement

ఖతార్ రేసును కొత్త తేదీకి మార్చే విషయంలో మోటోజీపీ నిర్వాహకులు మొత్తం 2026 ప్రపంచ ఛాంపియన్‌ షిప్ క్యాలెండర్‌ ను రీషెడ్యూల్ చేశారు. ఈ మార్పుతో ఇతర రేసుల షెడ్యూల్‌ లో కూడా స్వల్ప మార్పులు చేస్తున్నట్లు వెల్లడించారు.  పోర్చుగల్‌ లోని పోర్టిమావో సర్క్యూట్‌ లో జరిగే పోర్చుగీస్ గ్రాండ్ ప్రిక్స్ ను నవంబర్ 22న నిర్వహించనున్నట్లు తెలిపారు.  అటు సీజన్‌ కు చివరి రేసుగా ఉండే స్పెయిన్‌ లోని వాలెన్సియా రౌండ్ నవంబర్ 29కి మార్చారు. అయితే, 2026 సీజన్‌ లోని మిగతా అన్ని రౌండ్లు ప్రస్తుతం ఉన్న షెడ్యూల్ ప్రకారమే కొనసాగుతాయని మోటోజీపీ ప్రకటించింది.

టిక్కెట్లను కొనుగోలు చేసిన అభిమానులకు నో టెన్షన్

డేట్ చేంజ్ పై మోటోజీపీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ కార్మెలో ఎజ్పెలేటా కీలక వివరాలు వెల్లడించారు. ఈ నిర్ణయం ఖతార్‌ లోని ఫార్ట్ నర్స్, అధికారులు, ప్యాడాక్ మెంబర్స్ తో పూర్తిస్థాయి సమన్వయంతో తీసుకున్నామని తెలిపారు. అభిమానులకు వీలైనంత త్వరగా స్పష్టత ఇవ్వడం కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. ఇప్పటికే టిక్కెట్లు కొనుగోలు చేసిన అభిమానులు టెన్షన్ పడాల్సిన అవసరం లేదని చెప్పారు. వారి టిక్కెట్లను నెక్ట్స్ ఈవెంట్‌ కు బదిలీ చేసుకునే అవకాశం ఉన్నట్లు తెలిపారు.

Advertisement

మొత్తంగా అసలు ఉంటుందా? ఉండదా? అనే సందిగ్ధం నుంచి అభిమానులు బయటపడ్డారు. కొద్ది రోజులు వాయిదా పడినా జరగనున్నందుకు సంతోషం వ్యక్తం చేశారు. మొత్తంగా అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఖతార్ గ్రాండ్ ప్రిక్స్ ఇప్పుడు నవంబర్‌ లో జరగనుంది.

Read Also: రివోల్ట్ బంపర్ ఆఫర్, ఎలక్ట్రిక్ బైక్స్ పై ఏకంగా రూ.25 వేలు తగ్గింపు !

Related News

వోక్స్‌ వ్యాగన్ కార్లపై కళ్లు ఆఫర్లు.. ఆ మోడల్ పై ఏకంగా రూ.6 లక్షల తగ్గింపు!

సింగిల్ ఛార్జ్ తో 243 కి.మీ రేంజ్.. సింపుల్ వేవ్ సూపర్ స్కూటర్ వచ్చేసింది!

2027లో కొత్త నెక్సాన్.. డిజైన్ నుంచి ఇంజిన్ వరకు అన్నీ మారనున్నాయా?

5 ఏళ్ల తర్వాత పజెరో రీఎంట్రీ.. కొత్త లుక్‌తో మిత్సుబిషి బిగ్ సర్‌ప్రైజ్!

EV కొనేముందు ఈ విషయం చెక్ చేశారా? లేదంటే ఇబ్బందులు తప్పవు!

టాటా దూకుడు.. మహీంద్రా జోరు! ఆగస్టు అమ్మకాల్లో ఎవరు టాప్?

హోండా కొత్త ఈ-స్కూటర్‌కు పేటెంట్.. స్పీడ్ ఎంతో తెలిస్తే వావ్ అనాల్సిందే!

100 కి.మీ స్పీడ్.. 200 కి.మీ రేంజ్.. ఆంపియర్ కొత్త ఎలక్ట్రిక్ బైక్‌కు పేటెంట్!

Big Stories

Advertisement
×