E-Paper
Advertisement

Budget AC Deals: వేసవి ప్రారంభంలో ఏసీలపై భారీ డిస్కౌంట్స్.. రూ.20000 బడ్జెట్‌లో బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ ఇవే

Budget AC Deals: వేసవి ప్రారంభంలో ఏసీలపై భారీ డిస్కౌంట్స్.. రూ.20000 బడ్జెట్‌లో బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ ఇవే
Advertisement

Budget AC Deals| ఎండాకాలం మొదలైంది. అందరూ ఇంట్లో చల్లదనం కోసం కూలర్లు, ఏసీలు కొనాలని చూస్తున్నారు. అయితే వేసవిలో ఏసీ, కూలర్ల ధరలు పెరిగిపోతాయి. కానీ బడ్జెట్‌లో ఒక మంచి ఏసీ కొనాలనుకునేవారికి ఒక గుడ్ న్యూస్. ప్రస్తుతం ఆన్ లైన్‌లో ఏసీల బెస్ట్ డీల్స్ ఉన్నాయి. ఈ ఆఫర్ కొంతకాలం మాత్రమే ఎండల తీవ్రమైయ్యే సమయానికి ధరలు మళ్లీ పెరిగిపోతాయి. ముందుగా కొంటే చాలా డబ్బు ఆదా అవుతుంది. చిన్న గదులు, కాంపాక్ట్ స్థలాలకు సరిపడే ఏసీలపై ఆన్‌లైన్ లో మంచి డిస్కౌంట్ ఆఫర్స్ ఉన్నాయి. ఫ్లిప్‌కార్ట్‌లో రూ.20,000 నుంచి రూ.25,000 మధ్య బెస్ట్ ఆప్షన్లు దొరుకుతున్నాయి.

Blue Star 0.8 టన్ విండో AC.. నమ్మకమైన బ్రాండ్ ఆప్షన్

బ్లూ స్టార్ 2025 ఏసీ మోడల్ 0.8 టన్ 3 స్టార్ విండో ఇన్వర్టర్ AC మంచి పర్‌ఫామెన్స్ ఇస్తుంది. దీని ఒరిజినల్ ధర రూ.27,600. ఇప్పుడు 16 శాతం డిస్కౌంట్ తర్వాత రూ.23,290కే దొరుకుతోంది. SBI క్రెడిట్ కార్డ్‌తో అదనంగా మరో రూ1,165 ధర తగ్గింపు లభిస్తుంది. ఫైనల్ ధర రూ.22,125 అవుతుంది. ఇన్వర్టర్ టెక్నాలజీ వల్ల ఎఫిషియెంట్ కూలింగ్, తక్కువ విద్యుత్ ఖర్చు ఉంటుంది.

ఫ్లిప్‌కార్ట్ MarQ 0.75 టన్ స్ప్లిట్ AC.. తక్కువ ధరలో మంచి కూలింగ్

Advertisement

ఫ్లిప్‌కార్ట్ సొంత బ్రాండ్ MarQ 2025 మోడల్ 0.75 టన్ స్ప్లిట్ AC చాలా బడ్జెట్ ఫ్రెండ్లీ. ఒరిజినల్ ధర రూ.42,799. ఇప్పుడు 53 శాతం డిస్కౌంట్ తర్వాత రూ.19,990కి దొరుకుతోంది. యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ఉపయోగిస్తే మరో రూ.1,000 ఆదా చేసుకోవచ్చు. దీంతో ఫైనల్ ధర రూ.18,990 అవుతుంది. 4-ఇన్-1 కన్వర్టబుల్ ఫీచర్ ఉంది. ఇన్వర్టర్ టెక్నాలజీ వల్ల ఎనర్జీ సేవింగ్ బాగుంటుంది. ఉష్ణోగ్రతలు తీవ్రంగా ఉన్నప్పుడు త్వరగా రూమ్ చల్లబరుస్తుంది.

Voltas 0.6 టన్ స్ప్లిట్ AC.. చిన్న గదులకు పర్ఫెక్ట్

వొల్టాస్ 2023 మోడల్ 0.6 టన్ 2 స్టార్ స్ప్లిట్ AC చాలా చిన్న గదులకు బాగా సరిపోతుంది. ఒరిజినల్ ధర రూ.45,808. ఇప్పుడు 52 శాతం డిస్కౌంట్ తర్వాత రూ.21,990కి లభిస్తోంది. యాక్సిస్ బ్యాంక్ కార్డ్‌తో రూ.1,100 అదనపు ఆఫ్. ఫైనల్ ధర రూ.20,890 అవుతుంది. కాంపాక్ట్ స్పేస్‌లకు మంచి కూలింగ్ ఇస్తుంది.

Onida 0.8 టన్ స్ప్లిట్ AC.. బ్యాలెన్స్‌డ్ ఫీచర్లు

Advertisement

ఒనిడా 2025 మోడల్ 0.8 టన్ 3 స్టార్ స్ప్లిట్ ఇన్వర్టర్ AC మంచి బ్యాలెన్స్ ఇస్తుంది. ఒరిజినల్ ధర రూ.35,000. ఇప్పుడు 21 శాతం డిస్కౌంట్ తర్వాత రూ.23,990కి దొరుకుతోంది. యాక్సిస్ బ్యాంక్ కార్డ్‌తో రూ.1,100 క్యాష్ బ్యాక్ ఆఫర్ దొరుకుతుంది. ఫైనల్ ధర రూ.22,790 తగ్గుతుంది. ఇన్వర్టర్ టెక్నాలజీ వల్ల పవర్ సేవింగ్ బాగుంటుంది.

Lloyd 0.8 టన్ స్ప్లిట్ AC – ఫీచర్ రిచ్ ఆప్షన్

లాయిడ్ 2025 మోడల్ 0.8 టన్ 3 స్టార్ స్ప్లిట్ ఇన్వర్టర్ AC ప్రీమియం ఫీచర్లు ఇస్తుంది. ఈ ఏసీ ఒరిజినల్ ధర రూ.43,990. ఇప్పుడు 43 శాతం డిస్కౌంట్‌తో దీని ధర రూ.24,990. SBI కార్డ్‌తో రూ.1,250 అదనపు సేవింగ్స్ పొందవచ్చు. ఆఫర్స్ అన్నీ కలిపి ధర రూ.23,740 అవుతుంది. ఎఫిషియెంట్ కూలింగ్, మంచి బిల్డ్ క్వాలిటీ ఉన్నాయి.

Also Read: ఇంటర్నెట్‌లో ఫ్రీగా సినిమాలు చూసేవారిపై కేసులు.. హెచ్చరిక జారీ చేసిన ప్రభుత్వం

ఎండలు తీవ్రంకాకాముందే ఈ AC డీల్స్‌తో భారీగా ఆదా చేసుకోవచ్చు. ముందుగా కొంటే తక్కువ ధరకు, బ్యాంక్ ఆఫర్లతో మరింత ఆదా అవుతుంది. గది సైజు, కూలింగ్ అవసరాల ప్రకారం ఎంచుకోండి. స్ప్లిట్ ACలు అందంగా కనిపిస్తాయి, విండో ACలు చిన్న స్థలంలో సెట్ అవుతాయి. ఈ ఐదు ఆప్షన్లు బడ్జెట్‌లో అద్భుతమైన వాల్యూ ఇస్తున్నాయి.

ముఖ్య గమనిక: ఈ కథనంలో పేర్కొన్న ఏసీలు లేదా దాని ధరలు.. ఆయా బ్రాండ్ కంపెనీల ప్రకటించే ఆఫర్లపై ఆధారపడి ఉంటాయి. కొనుగోలు చేసే సమయంలో జాగ్రత్తగా పరిశీలించి కొనాలని సూచన. మీరు కొనుగోలు చేసే సమయానికి పైన చెప్పిన ధరలు మారిపోయి ఉండవచ్చు. ‘బిగ్ టీవీ’ అలాంటి విషయాలకు బాధ్యత వహించదు.

Related News

స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్, భారీ బ్యాటరీ.. గేమర్స్ కోసం నెక్ట్స్ లెవెల్ టాబ్లెట్ వచ్చేసింది!

కెమెరా పక్కనే మరో డిస్‌ప్లే.. ఇన్ఫినిక్స్ కొత్త బడ్జెట్ ఫోన్ లుక్ చూశారా?

రెడ్‌మీ నోట్ 17కు రీబ్రాండెడ్‌గా Poco X8, M8 పవర్.. ఫీచర్లు, ధరల వివరాలు ఇవే!

ఇంటిని థియేటర్‌గా మార్చే బెస్ట్ బడ్జెట్ పోర్టబుల్ ప్రొజెక్టర్లు.. ధరలు కూడా బడ్జెట్‌లోనే!

Facebook వాడే ప్రతి ఒక్కరూ మార్చాల్సిన 5 సీక్రెట్ సెక్యూరిటీ సెట్టింగ్స్ ఇవే!

iPhone 18 Pro Max లీక్స్.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లాకే, కానీ ఆ ఒక్కటే పెద్ద ట్విస్ట్!

గేమర్స్‌కు పూనకాలు తెప్పిస్తున్న Oppo K15.. నీళ్లలో పడినా, రఫ్ అండ్ టఫ్ వాడినా తగ్గేదే లేదంట!

సోషల్ మీడియాలో వైరల్ అయ్యే వీడియో రియలా,ఫేకా? తెలుసుకోండిలా!

Big Stories

Advertisement
×