E-Paper
Advertisement

Revolt EV Bike Offer: రివోల్ట్ బంపర్ ఆఫర్, ఎలక్ట్రిక్ బైక్స్ పై ఏకంగా రూ.25 వేలు తగ్గింపు !

Revolt EV Bike Offer: రివోల్ట్ బంపర్ ఆఫర్, ఎలక్ట్రిక్ బైక్స్ పై ఏకంగా రూ.25 వేలు తగ్గింపు !
Advertisement

Revolt Electric Bikes Discount: రివోల్ట్ మోటార్స్ తన ఎలక్ట్రిక్ బైక్స్ మీద లిమిటెడ్ టైమ్ ఆఫర్లను ప్రకటించింది. ఈ ఆఫర్ ద్వారా కొనుగోలుదారులకు రూ.25,000 వరకు బెనిఫిట్స్ పొందే అవకాశం కల్పిస్తోంది. మార్చి 31, 2026 వరకు అందుబాటులో ఉండే ఈ ఆఫర్.. PM E డ్రైవ్ పథకం కింద ప్రస్తుత ప్రోత్సాహకాలను అందిస్తుంది. ఈ నెల చివరి లోగా రివోల్ట్ ఎలక్ట్రిక్ బైక్స్ కొనుగోలు చేసే కస్టమర్లు వెహికల్ లో పాటు కొన్ని అదనపు ప్రయోజనాలను పొందుతారు. ఎక్కువ మంది కొనుగోలుదారులను ఆకర్షించడం, ఎలక్ట్రిక్ బైక్స్ ను ఈజీగా కొనుగోలు చేయడం లక్ష్యంగా ఈ బెనిఫిట్స్ అందిస్తున్నట్లు కంపెనీ ప్రకటించింది.

రివోల్ట్ ఆఫర్, డిస్కౌంట్లు

రివోల్ట్ ఆఫర్‌ లో భాగంగా  కొనుగోలుదారులు తమ బైక్ కు ఉచితంగా ఇన్సూరెన్స్ ను పొందే అవకాశం ఉంటుంది.  రివోల్ట్‌ లో రూ.4,999 విలువైన కాంప్లిమెంటరీ ఎక్స్‌ టెండెడ్ వారంటీ కూడా ఉంటుంది. దీనితో పాటు, మోడల్‌ ను బట్టి కంపెనీ రూ.8,000 వరకు వినియోగదారులకు తగ్గింపులను అందిస్తోంది. కొన్ని బైక్స్ PM E-డ్రైవ్ పథకం కింద రూ.5,000 బెనిఫిట్స్ ను పొందుతాయి. కస్టమర్లకు వారు ఎంచుకున్న మోడల్, వేరియంట్ ఆధారంగా మొత్తం ప్రయోజనం రూ. 25,000 వరకు ఉంటుంది.

ఏ మోడల్స్ కు.. ఏ బెనిఫిట్స్..    

Advertisement

రివోల్ట్ ప్రస్తుతం దేశీ మార్కెట్ లో పలు ఎలక్ట్రిక్ బైక్స్ ను అమ్ముతోంది. దీని లైనప్‌ లో RV1, RV1+, RV BlazeX, RV400 BRZ, RV 400 ఉన్నాయి. ప్రస్తుత డిస్కౌంట్లు, బెనిఫిట్స్ కస్టమర్ ఎంచుకునే మోడల్‌ మీద ఆధారపడి ఉంటాయి. దేశ వ్యాప్తంగా ఉన్న ఆథరైజ్డ్ రివోల్ట్ డీలర్‌ షిప్‌ లలో ఈ ఆఫర్ అందుబాటులో ఉందని కంపెనీ తెలిపింది. కొనుగోలుదారులు కంపెనీ అధికారిక వెబ్‌ సైట్ ద్వారా  పూర్తి వివరాలను తెలుసుకునే అవకాశం ఉందన్నారు. అటు బుకింగ్స్ కూడా చేసుకోవచ్చని తెలిపింది.

Read Also: రివోల్ట్ To ఓలా రోడ్‌ స్టర్.. బెస్ట్ బడ్జెట్ ఎలక్ట్రిక్ బైక్స్ ఇవే!

Advertisement

తాజాగా ఆఫర్లు, బెనిఫిట్స్ గురించి రట్టన్ ఇండియా ఎంటర్‌ ప్రైజెస్ చైర్‌ పర్సన్ అంజలి రట్టన్ కీలక వివరాలు వెల్లడించారు. ఎలక్ట్రిక్ మొబిలిటీని మరింత అందుబాటులోకి తీసుకురావడానికి, ఎక్కువ మంది రైడర్లు ఎలక్ట్రిక్ బైక్స్ ను కొనుగోలు చేసేలా ప్రోత్సహించడానికి కంపెనీ ప్రయత్నిస్తుందన్నారు. అందులో భాగంగానే ఈ బెనిఫిట్స్, తగ్గింపులు అందిస్తున్నట్లు తెలిపారు. మార్చి 31 వరకు కస్టమర్లు భారీ తగ్గింపులతో పాటు బెనిఫిట్స్ తో రివోల్ట్స్ బైక్స్ కొనుగోలు చేఏ అవకాశం ఉందన్నారు. గ్రీన్ ఎనర్జీ వైపు మొగ్గుచూపే యువ రైడర్లు తమ బైక్స్ అనుకూలంగా ఉంటాయని చెప్పుకొచ్చారు. మొత్తంగా ఈ పథకం కొత్త కస్టమర్లను ఆకట్టుకుంటుందని రివోల్ట్ కంపెనీ ఆశిస్తోంది.

Read Also: టీవీఎస్ ఆర్బిటర్ కొత్త వేరియంట్లు, ఒక్కోదాని రేంజ్ ఎంతో తెలుసా?

Related News

మినీ సైజ్.. మ్యాక్సిమమ్ స్టైల్.. ఈ మైక్రో ఈవీలు భారత్‌లోకి వస్తే సూపర్ హిట్ పక్కా!

25 ఏళ్ల క్రితమే భారత్ లో పరుగులు తీసిన ఎలక్ట్రిక్ కారు.. మళ్లీ మార్కెట్ లోకి వస్తుందా?

లాంచ్‌కు ముందే క్రేజీ డీటైల్స్ లీక్.. కొత్త బ్రెజ్జాలో ఫీచర్లు చూస్తే మతిపోవాల్సిందే!

ఆగస్టు 15న మహీంద్రా బిగ్ బ్లాస్ట్.. 3 కొత్త SUVలు వచ్చేస్తున్నాయ్!

టీవీఎస్ నుంచి సూపర్ సర్‌ ప్రైజ్.. ఒకేసారి 3 మోడల్స్ వచ్చేస్తున్నాయ్!

కొత్త బ్రెజ్జా To హిలక్స్.. 10 రోజుల్లో 3 క్రేజీ మోడల్స్ ఎంట్రీ!

టెస్లా నుంచి పిల్లల కోసం కొత్త బైక్.. రేట్ ఎంత అంటే?

EV బ్యాటరీల్లో ఏది సేఫ్? కొనుగోలు చేసే ముందు ఈ విషయాలు తప్పకుండా తెలుసుకోవాల్సిందే!

Big Stories

Advertisement
×