E-Paper
Advertisement

హై పెర్ఫార్మెన్స్ బైక్‌ లకు కొత్త బ్రేక్ టెక్నాలజీ.. పనితీరు చూస్తే మతిపోవాల్సిందే!

హై పెర్ఫార్మెన్స్ బైక్‌ లకు కొత్త బ్రేక్ టెక్నాలజీ.. పనితీరు చూస్తే మతిపోవాల్సిందే!
Advertisement

New Brembo Hypure Brake System:  బ్రెంబో మోటార్‌ సైకిల్ ప్రపంచంలో మరో కొత్త ఆవిష్కరణతో అందుబాటులోకి వచ్చింది. హైక్షన్ అనే కొత్త కార్బన్ సిరామిక్ బ్రేక్ డిస్క్‌ తో పాటు GP4-HY కాలిపర్, ఫ్లోటింగ్ రియర్ డిస్క్‌ తో వచ్చింది. ఇప్పటికే ఉన్న సూపర్‌ బైక్‌ ల బ్రేకింగ్ సిస్టమ్‌ ను మరో లెవెల్ కు తీసుకెళ్తోంది. ఈ కొత్త టెక్నాలజీ మొదటిసారిగా డుకాటి సూపర్‌ లెగ్గెరా V4 సెంటెనారియోలో ఉపయోగించారు.

ఇప్పటి వరకు కార్లలో.. ఇకపై బైక్ లలో..

ఇప్పటి వరకు కార్లలో మాత్రమే ఎక్కువగా ఉపయోగించిన కార్బన్ సిరామిక్ టెక్నాలజీని ఇప్పుడు మోటార్‌సైకిళ్లకు తీసుకువచ్చింది బ్రెంబో. ఈ డిస్క్ ప్రత్యేకమైన కాంపోజిట్ మెటీరియల్‌ తో తయారవుతుంది. దీనిలో కార్బన్ ఫైబర్, సిలికాన్, సిలికాన్ కార్బైడ్ లాంటి పదార్థాలు ఉంటాయి. దీనివల్ల ఇది ఎక్కువ వేడి తట్టుకోగలదు. అలాగే బ్రేకింగ్ సమయంలో మంచి పనితీరును ఇస్తుంది. ఒకసారి కాదు, వరుసగా బ్రేక్ వేసినా పనితీరు తగ్గకుండా ఉంటుంది.

ప్రత్యేక పరిమాణంలో..

Advertisement

ఈ హైక్షన్ డిస్క్ పరిమాణం కూడా ప్రత్యేకంగా ఉంటుంది. 340 మిల్లీమీటర్ల వ్యాసం, 8 మిల్లీమీటర్ల మందంతో తయారైంది. ఇందులో ఉన్న చిన్న చిన్న వెంటిలేషన్ హోల్స్ వేడిని త్వరగా బయటకు పంపిస్తాయి. దీని వల్ల బ్రేక్ పనితీరు మెరుగవుతుంది. అలాగే దీని డిజైన్ బరువును తగ్గించేలా ఉంటుంది. ఇది బైక్ హ్యాండ్లింగ్‌పై మంచి ప్రభావం చూపుతుంది. ఇది తేలికగా ఉండటం కూడా ఒక పెద్ద ప్లస్ పాయింట్. ప్రతి డిస్క్ సుమారు 1.3 కిలోల బరువు ఉంటుంది. సాధారణ స్టీల్ డిస్క్‌ లతో పోలిస్తే ఇది చాలా తక్కువ వెయిట్. దీని వల్ల బైక్ తేలికగా అనిపిస్తుంది.  మలుపులు తీసుకోవడం ఈజీ అవుతుంది. రైడర్‌ కు మంచి కంట్రోల్ లభిస్తుంది.

GP4-HY కాలిపర్‌..

ఈ డిస్క్‌ కు సరిపోయేలా GP4-HY కాలిప ర్‌ను కూడా ప్రత్యేకంగా రూపొందించారు. ఇది ఒకే అల్యూమినియం బ్లాక్ నుంచి తయారవుతుంది. ఇందులో వేర్వేరు సైజ్ పిస్టన్‌ లు ఉంటాయి. ఇవి బ్రేక్ వేయగానే సమానంగా ఒత్తిడి పంచుతాయి. దీంతో బ్రేకింగ్ మరింత కచ్చితంగా ఉంటుంది. అలాగే బ్రేక్ వదిలిన వెంటనే ప్యాడ్‌ లు వెనక్కి వెళ్లేలా ప్రత్యేక స్ప్రింగ్ సిస్టమ్ కూడా ఉంది, ఇది పనితీరును మెరుగుపరుస్తుంది. రియర్ బ్రేక్ విషయంలో కూడా బ్రెంబో కొత్త మార్పులు చేసింది. ఫ్లోటింగ్ స్టీల్ డిస్క్‌ తో పాటు అల్యూమినియం భాగాలను ఉపయోగించి బరువును తగ్గించింది. దీని వల్ల వెనుక వీల్ మీద కూడా మంచి కంట్రోల్ లభిస్తుంది. ఇది మొత్తం బ్రేకింగ్ సిస్టమ్‌ను బలోపేతం చేస్తుంది. బ్రెంబో తీసుకువచ్చిన ఈ కొత్త టెక్నాలజీ సూపర్‌ బైక్‌ ల బ్రేకింగ్‌లో పెద్ద మార్పుకు పునాది కావచ్చుని నిపుణులు అంచనా వేస్తున్నారు.

Advertisement

Read Also: అమ్మకాల్లో దుమ్మురేపిన హీరో.. స్ప్లెండర్ మళ్లీ నంబర్ వన్!

Related News

వోక్స్‌ వ్యాగన్ కార్లపై కళ్లు ఆఫర్లు.. ఆ మోడల్ పై ఏకంగా రూ.6 లక్షల తగ్గింపు!

సింగిల్ ఛార్జ్ తో 243 కి.మీ రేంజ్.. సింపుల్ వేవ్ సూపర్ స్కూటర్ వచ్చేసింది!

2027లో కొత్త నెక్సాన్.. డిజైన్ నుంచి ఇంజిన్ వరకు అన్నీ మారనున్నాయా?

5 ఏళ్ల తర్వాత పజెరో రీఎంట్రీ.. కొత్త లుక్‌తో మిత్సుబిషి బిగ్ సర్‌ప్రైజ్!

EV కొనేముందు ఈ విషయం చెక్ చేశారా? లేదంటే ఇబ్బందులు తప్పవు!

టాటా దూకుడు.. మహీంద్రా జోరు! ఆగస్టు అమ్మకాల్లో ఎవరు టాప్?

హోండా కొత్త ఈ-స్కూటర్‌కు పేటెంట్.. స్పీడ్ ఎంతో తెలిస్తే వావ్ అనాల్సిందే!

100 కి.మీ స్పీడ్.. 200 కి.మీ రేంజ్.. ఆంపియర్ కొత్త ఎలక్ట్రిక్ బైక్‌కు పేటెంట్!

Big Stories

Advertisement
×