E-Paper
Advertisement

New Car Buying Guide: కొత్తదంటూ ‘యాక్సిడెంట్’ కారు విక్రయం, టాటా షోరూమ్ లో రచ్చ.. ఇవి తెలియకపోతే ఇంతే!

New Car Buying Guide: కొత్తదంటూ ‘యాక్సిడెంట్’ కారు విక్రయం, టాటా షోరూమ్ లో రచ్చ.. ఇవి తెలియకపోతే ఇంతే!
Advertisement

కార్లపై అదిరిపోయే డిస్కౌంట్లు ఇస్తున్నారని ఆశపడితే, అసలుకే మోసం వస్తుందని తాజాగా హైదరాబాద్ లో జరిగిన ఓ ఘటన నిరూపించింది. కొత్త కారు అంటూ తనకు యాక్సిడెంట్ కారు అంటగట్టారని ఓ వినియోగదారుడు నాగోల్ లోని టాటా సెలెక్ట్ షోరూమ్‌ లో ఆందోళనకు దిగాడు. ఎల్బీ నగర్ కు చెందిన ప్రవీణ్ రెడ్డి డిసెంబర్ 30న టాటా పంచ్ ఈవీ కొన్నాడు. ఇందుకోసం రూ. 13.5 లక్షలు చెల్లించాడు. అయితే, ఇటీవల కారును పరిశీలించగా, అది గతంలోనే ప్రమాదానికి గురైన డ్యామేజ్ కారు అని తేలింది. మోసపోయానని గ్రహించిన బాధితుడు తాజాగా షోరూమ్ ముందు ధర్నాకు దిగారు. దీనిపై యాజమాన్యాన్ని ప్రశ్నిస్తే సమాధానం చెప్పకపోగా, తనపై దాడికి ప్రయత్నించారని ఆయన ఆరోపించారు. తనకు న్యాయం చేయకపోతే, పోలీసులను ఆశ్రయిస్తానని బాధితుడు వెల్లడించారు.

పాత స్టాక్ కొత్త స్టాక్ గా అమ్మకం   

వాస్తవానికి పాత కార్లను కొత్త కార్లు అని అమ్మడం హైదరాబాద్‌తో సహా దేశంలోని పలు నగరాల్లో జరుగుతున్న వ్యవహారమే. ఇటీవలి కాలంలో టాటా, వోక్స్‌ వ్యాగన్, BYD సహా పలు కంపెనీలు దెబ్బతిన్న కార్లను, తిరిగి పెయింట్ చేసిన కార్లను అమ్మినట్లు పలువురు వినియోగదారులు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. కొంతమంది డీలర్లు సమస్యను దాచిపెట్టి కొత్తది అని అమ్ముతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

కొత్త కారు కొనేటప్పుడు ఈ జాగ్రత్తలు తప్పనిసరి!  

Advertisement

కొత్తకారును కొనుగోలు చేసే సమయంలో ప్రీ డెలివరీ ఇన్ స్పెక్షన్ (PDI) అనేది తప్పనిసరి అంటున్నారు ఆటో నిపుణులు. డబ్బులు చెల్లించిన కారు కొనుగోలు చేసిన తర్వాత డ్రైవింగ్ చేసే ముందు PDI అనేది ఆ కారులో ఉన్న సమస్యలను గుర్తిస్తుంది. ముందే సమస్యలను గుర్తిస్తే, కొత్త కారును తీసుకోవచ్చు. లేదంటే బుకింగ్ ను క్యాన్సిల్ చేసే అవకాశం ఉంటుంది.

PDI సమయంలో గమనించాల్సిన విషయాలు   

PDI అనేది ఎప్పుడైన డే టైమ్ లో చేయాలి. వీలుంటే తెలిసిన మెకానిక్ ను తీసుకెళ్లాలి. ఈ సమయంలో ఏ అంశాలను చెక్ చేయాలనేది అప్పుడు తెలుసుకుందాం..

కారు బయటి భాగం

Advertisement

డోర్లు, బోనెట్, బూట్, బంపర్లు చెక్ చేయాలి. అన్ని అంశాలు ఎలాంటి తేడా లేకుండా ఉన్నాయో? లేవో తనిఖీ చేయాలి.

⦿ పెయింట్‌ను చెక్ చేయాలి: అన్ని కోణాల్లో టార్చ్ లైట్ ను ఉపయోగించి పెయింటింగ్ ను చెక్ చేయాలి, ప్యానెల్స్ మధ్య రంగులు సరిగ్గా ఉన్నాయో? లేదో చూడాలి. రబ్బరు భాగాలపై ఓవర్‌ స్ప్రే లేదంటే తాజా పెయింట్ వాసన ఉందేమో చూడాలి.

⦿ మాగ్నెట్ టెస్ట్: కారు బాడీ మీద చిన్న అయస్కాంతాన్ని ఉంచాలి. ఇది అంటుకుంటుంది. ఒకవేళ సరిగా అంటుకోకపోతే ప్రమాదం నుంచి దాచేందుకు బాడీ ఫిల్లర్ ను ఉపయోగించినట్లు గుర్తించాలి.

⦿ టైర్లు: సైడ్‌వాల్ తేదీ కోడ్‌ను తనిఖీ చేయాలి. టైర్లు కొత్తగా ఉండాలి. 1-2 సంవత్సరాలవి ఉండకూడదు.

⦿ గ్లాస్, లైట్లు: విండ్‌ షీల్డ్, హెడ్‌ ల్యాంప్ అంచులను జాగ్రత్తగా పరిశీలించాలి. అసహజంగా గమ్, సీలెంట్ కనిపిస్తుందేమో చూడాలి. గీతల కోసం హెడ్‌ ల్యాంప్‌ లను చెక్ చేయాలి.

⦿ కారు కింది భాగాన్ని చూడండి: కారును పైకి ఎత్తమని చెప్పి, కింది భాగాన్ని చెక్ చేయాలి. కొత్త వెల్డింగ్‌లు, తుప్పు పట్టడం, భిన్నంగా కనిపించే భాగాలను పరిశీలించండి.

కారు లోపలి భాగం

కారులో లో కూర్చొని చూడాలి. మరకలు, చిరిగిపోవడం లాంటివి ఉన్నాయేమో చూడాలి. అన్ని బటన్లు, AC, మ్యూజిక్ సిస్టమ్, లైట్లు, వైపర్లు, పవర్ విండోస్, సన్‌ రూఫ్ పరీక్షించండి.

⦿ ఓడో మీటర్ చెక్ చేయండి: చాలా తక్కువ కి.మీ డ్రైవింగ్ అంటే సుమారు 50 కి.మీ లోపు ఉండాలి.

ఇంజిన్, బూట్ చెక్ చేయాలి 

ఇంజిన్ బే శుభ్రంగా ఉండాలి. ఆయిల్ లీక్‌లు ఉండకూడదు, భాగాలపై ఓవర్‌ స్ప్రే పెయింట్ ఉండకూడదు.

⦿ బ్యాటరీని చెక్ చేయండి: టెర్మినల్స్‌ పై తుప్పు పట్టకూడదు.

⦿ ఓపెన్ బూట్: స్పేర్ టైర్, జాక్, టూల్స్ కొత్తగా ఉండాలి. దెబ్బతిన్న ప్లాస్టిక్, కట్ వైర్లు ఉండకూడదు.

Read Also: పెట్రోల్ కార్లు ఇక ఎలక్ట్రిక్ వెర్షన్ లో.. విన్ ఫాస్ట్ క్రేజీ ఆఫర్!

Related News

మినీ సైజ్.. మ్యాక్సిమమ్ స్టైల్.. ఈ మైక్రో ఈవీలు భారత్‌లోకి వస్తే సూపర్ హిట్ పక్కా!

25 ఏళ్ల క్రితమే భారత్ లో పరుగులు తీసిన ఎలక్ట్రిక్ కారు.. మళ్లీ మార్కెట్ లోకి వస్తుందా?

లాంచ్‌కు ముందే క్రేజీ డీటైల్స్ లీక్.. కొత్త బ్రెజ్జాలో ఫీచర్లు చూస్తే మతిపోవాల్సిందే!

ఆగస్టు 15న మహీంద్రా బిగ్ బ్లాస్ట్.. 3 కొత్త SUVలు వచ్చేస్తున్నాయ్!

టీవీఎస్ నుంచి సూపర్ సర్‌ ప్రైజ్.. ఒకేసారి 3 మోడల్స్ వచ్చేస్తున్నాయ్!

కొత్త బ్రెజ్జా To హిలక్స్.. 10 రోజుల్లో 3 క్రేజీ మోడల్స్ ఎంట్రీ!

టెస్లా నుంచి పిల్లల కోసం కొత్త బైక్.. రేట్ ఎంత అంటే?

EV బ్యాటరీల్లో ఏది సేఫ్? కొనుగోలు చేసే ముందు ఈ విషయాలు తప్పకుండా తెలుసుకోవాల్సిందే!

Big Stories

Advertisement
×