E-Paper
Advertisement

Uttuttha Herolu: ‘ఉత్తుత్త హీరోలు’ చేసిన సినిమా ఎలా ఉందో తెలియాలంటే?.. ఈ రివ్యూలో..

Uttuttha Herolu: ‘ఉత్తుత్త హీరోలు’ చేసిన సినిమా ఎలా ఉందో తెలియాలంటే?.. ఈ రివ్యూలో..
Advertisement

Uttuttha Herolu: యూట్యూబ్ లో చిన్న వీడియోలతో బాగా పాపులర్ అయిన మహేష్ విట్టా.. ప్రస్తుతం ‘ఉత్తుత్త హీరోలు’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ చిత్రం ఫిబ్రవరి 27, 2026న థియేటర్లలో విడుదలయ్యింది. మహేష్ విట్టా ఈ సినిమాతో హీరోగా పరిచయం అవ్వడమే కాకుండా, స్వయంగా నిర్మించారు. వాల్తేరు వినయ్ దర్శకత్వంలో రూపొందించిన ఈ చిత్రంపై ఇప్పటికే ప్రేక్షకులు మంచి అంచనాలు పెట్టుకున్నారు. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు మంచి బజ్ క్రియేట్ చేశాయి. అయితే ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులను ఎంత వరకూ మెప్పించింది ఫుల్ రివ్యూ ఇక్కడ తెలుసుకుందాం.

Read also-Vijay -Rashmika: వివాహం అనంతరం రాజకీయ ప్రముఖులను కలుస్తున్న విరోష్ జంట.. ఉదయం అమిత్.. ఇప్పుడు మోదీ..

కథ

Advertisement

రాయలసీమ నేపథ్యంతో సాగే ఈ కథ నలుగురు యువకుల చుట్టూ తిరుగుతుంది. సినిమా ఇండస్ట్రీలో తాము అనుకున్న ప్రాజెక్టును పూర్తి చేయడానికి వారికి 30 లక్షల రూపాయల అవసరం పడుతుంది. ఆ డబ్బు కోసం వారు చేసే ప్రయత్నాలు, కిడ్నాప్ ప్లాన్‌లు, ఆ క్రమంలో వారు చిక్కుకునే హాస్యభరితమైన ఇబ్బందులే ఈ సినిమా ప్రధాన కథాంశం. చివరకి వారకి కావాల్సిన రూ.30 లక్షలు సమకూరాయా? కిడ్నాప్ ప్రయత్నం ఏం అయింది? కామిడీ టైమింగ్స్ తో అందరినీ అలరించే మహేష్ విట్టా ప్రేక్షకులను అలరించాడో లేదో తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

విశ్లేషణ

ఈ సినిమాలో హీరోగా చేసిన మహేష్ విట్టా తనదైన రాయలసీమ యాసతో, టైమింగ్‌తో సినిమాను భుజాన వేసుకున్నారు. ఇతర నటీనటులు ప్రవీణ సోని, వాల్తేర్ వినయ్ తమ పాత్రలకు న్యాయం చేశారు. దర్శకుడిగా వాల్తేరు వినయ్ తొలి ప్రయత్నంలోనే ‘క్రైమ్ కామెడీ’ జానర్‌ను ఎంచుకుని ఆకట్టుకున్నారు. సినిమా ఇండస్ట్రీలోని కష్టాలను వ్యంగ్యంగా చూపిస్తూనే, వినోదాన్ని పంచే ప్రయత్నం చేశారు. జాన్ కె జోసెఫ్ అందించిన సంగీతం, ఛోటా కె ప్రసాద్ ఎడిటింగ్ సినిమా వేగానికి తోడ్పడ్డాయి. సినిమాటోగ్రఫీ విషయానికి వస్తే.. రాయలసీమ ప్రాంతపు సహజత్వాన్ని స్క్రీన్ మీద బాగా చూపించారు.

Advertisement

Read also-Naa Anvesh : లూకౌట్ నోటీసుల పై స్పందించిన అన్వేష్.. ఈ ** పీకలేరంటు వీడియో రిలీజ్..

బలాలు

  • మహేష్ విట్టా కామెడీ టైమింగ్
  • సహజమైన సన్నివేశాలు
  • సెకండాఫ్‌లో వచ్చే ట్విస్టులు

బలహీనతలు

  • కొన్ని చోట్ల కథ నెమ్మది
  • నిర్మాణ విలువలు

మొత్తంగా..‘ఉత్తుత్త హీరోలు’ ఒక ఆహ్లాదకరమైన క్రైమ్ కామెడీ చిత్రం.

రేటింగ్ :  2/5

Related News

సుమంత్ ప్రభాస్ ‘రోమాంచకం’ ట్విట్టర్ రివ్యూ..

‘కికు చిరంజీవి’ మూవీ రివ్యూ.. గుండె కుడివైపు ఉంటే.. రహస్యం ఎటువైపు దారితీసింది?

టాక్సిక్’ రివ్యూ.. గీత దాటలేదు, కానీ ఓపిక మాత్రం దాటింది!”

ది రెడ్ బ్యాగ్ మూవీ రివ్యూ.. క్రైమ్ థ్రిల్లర్ మెప్పించిందా?

అమీర్ లోగ్ మూవీ రివ్యూ.. పాతబస్తీ గల్లీ స్నేహం వర్కౌట్ అయ్యిందా?

రవితేజ ‘ఇరుముడి’ రివ్యూ.. అయ్యప్పమాల కలిసొచ్చిందా?

పళ్ళ బురుసు మూవీ రివ్యూ..చిన్న బ్రష్.. పెద్ద గొడవ.. అసలు కథ ఏంటంటే?

మకుటం మూవీ రివ్యూ: విశాల్ ఫ్యాన్స్‌కి పండగేనా? సినిమా ఎలా ఉందంటే?

Big Stories

Advertisement
×