E-Paper
Advertisement

New Tata Punch Crash Test: ట్రక్కుతో టాటా పంచ్ క్రాష్ టెస్ట్.. సీన్ కట్ చేస్తే రిజల్ట్ ఏంటో తెలుసా?

New Tata Punch Crash Test: ట్రక్కుతో టాటా పంచ్ క్రాష్ టెస్ట్.. సీన్ కట్ చేస్తే రిజల్ట్ ఏంటో తెలుసా?
Advertisement

టాటా కార్లు గత కొద్ది సంవత్సరాలుగా మంచి లుక్ తో పాటు అద్భుతమైన సేఫ్టీ ఫీచర్లతో రూపొందుతున్నాయి. టాటా నుంచి వస్తున్న అన్ని కార్లు క్రాష్ టెస్ట్ లో మంచి రేటింగ్ సాధిస్తున్నాయి. అందులో భాగంగానే ఇప్పటికే టాటా పంచ్ కు నిర్వహించిన భారత్ NCAP క్రాష్ టెస్ట్ లో 5 స్టార్ సేఫ్టీ రేటింగ్‌ను పొందింది. ఈ రిజల్ట్ తో దేశంలోని సబ్ కాంపాక్ట్ SUV విభాగంలో అత్యంత సురక్షితమైన వాహనాలలో ఒకటిగా పంచ్ గుర్తింపు తెచ్చుకుంది.

ట్రక్కుతో టాటా పంచ్ క్రాష్ టెస్ట్

NCAP  క్రాష్ట్ టెస్ట్ లో 5 స్టార్ రేటింగ్ సాధించిన టాటా పంచ్ కారుకు మరో క్రాష్ట్ టెస్ట్ నిర్వహించింది కంపెనీ. కారును ఎదురుగా ఉన్న ట్రక్కును ఢీకొట్టించింది. ఇండియన్ రోడ్స్ మీద ఇలాంటి ప్రమాదాలు తరచుగా జరుగుతూనే ఉంటాయి. ఈ క్రాష్ టెస్ట్ లో కొత్త పంచ్ వేగంగా వచ్చి  ట్రక్కును ఢీకొట్టింది. ఈ పరీక్షలో టాటా సేఫ్టీ ఇంజనీరింగ్ దృఢత్వాన్ని హైలైట్ చేశాయి. కారును ట్రక్ ఢీకొన్న తర్వాత, ప్రయాణీకుల క్యాబిన్ చెక్కుచెదరకుండా ఉంది.  ప్రయాణికుల ప్లేస్ లోకి ఎలాంటి కారు బాగాలు దూసుకురాలేదు. ముఖ్యంగా, క్రాష్ తర్వాత అన్ని డోర్లు ఓపెన్ చేసేందుకు వీలుగానే ఉన్నాయి. ఇది నిర్మాణ స్థిరత్వం, ప్రయాణికుల మనుగడకు ప్లస్ పాయింట్ గా చెప్పుకోవచ్చు.

NCAP 5 స్టార్ రేటింగ్ ను కన్ఫార్మ్ చేసిన తాజా టెస్ట్!

Advertisement

టాటా పంచ్ నియంత్రణ వ్యవస్థలు చక్కగా పని చేశాయి. కారులోని ప్రయాణికులందరికీ ఎలాంటి హాని జరగకుండా రక్షణ కల్పించింది. రియల్ వరల్ట్ టెస్టింగ్.. భారత NCAP టెస్టింగ్ సమయంలో వచ్చిన ఫలితాలను మరోసారి కన్ఫార్మ్ చేసినట్లు అయ్యింది. ఈ టెస్ట్ తో ప్రయాణీకుల భద్రతలో టాటా ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీ పడటం లేదని తేలిపోయినట్లు అయ్యింది.

తాజాగా టెస్ట్ లో కీలకమైన అంశం సరైన అండర్‌ రన్ సేఫ్టీ బార్‌ తో కూడిన ట్రక్కును ఉపయోగించడం. ఇది చాలా ముఖ్యమైన పరీక్ష అని టాటా మోటార్స్ వెల్లడించింది. ఎందుకంటే, భారతీయ రోడ్లపై ఉన్న అనేక ట్రక్కులు ఇప్పటికీ అండర్‌ రన్ ప్రొటెక్షన్ ను కలిగి లేవు. ఇది తరచుగా కారు- ట్రక్కు ఢీకొన్నప్పుడు తీవ్ర గాయాలకు దారితీస్తుంది. కంప్లైంట్ భద్రతా పరికరాలతో ట్రక్కును ఉపయోగించడం ద్వారా, టాటా మోటార్స్ ఈ క్రాష్ టెస్ట్ లో సక్సెస్ అయ్యింది.  రహదారి వినియోగదారులు సూచించిన భద్రతా నిబంధనలను పాటించినప్పుడు వాహన భద్రతా వ్యవస్థలు ఎలా పని చేయడానికి రూపొందించబడ్డాయో ఈ టెస్ట్ హైలెట్ చేసింది.

భద్రతా DNA కొత్త పంచ్‌ అందుబాటులోకి..

Advertisement

కొత్త పంచ్ భద్రత విషయంలో మంచి రేటింగ్ పొందింది. టాటాకు మంచి గుర్తింపు తీసుకొచ్చింది. పటిష్టమైన బాడీ నిర్మాణం, ప్రామాణిక 6 ఎయిర్‌ బ్యాగ్‌లు, ESP, వేరియంట్లలో యాక్టివ్, పాసివ్ భద్రతా వ్యవస్థల సూట్‌ను కలిగి ఉంది. 5 స్టార్ భారత్ NCAP రేటింగ్ ఈ అప్‌గ్రేడ్‌ల కారణంగానే వచ్చింది. అయితే రియల్ వరల్డ్ ప్రపంచ క్రాష్ అనేది అత్యవసర పరిస్థితులలో ఈ వ్యవస్థలు ఎలా పనిచేస్తాయో చూపించాయి.

Read Also:  గంటకు 500 కిలో మీటర్లు.. రికార్డులు బద్దలు కొట్టిన ఎలక్ట్రిక్ కారు!

Related News

మినీ సైజ్.. మ్యాక్సిమమ్ స్టైల్.. ఈ మైక్రో ఈవీలు భారత్‌లోకి వస్తే సూపర్ హిట్ పక్కా!

25 ఏళ్ల క్రితమే భారత్ లో పరుగులు తీసిన ఎలక్ట్రిక్ కారు.. మళ్లీ మార్కెట్ లోకి వస్తుందా?

లాంచ్‌కు ముందే క్రేజీ డీటైల్స్ లీక్.. కొత్త బ్రెజ్జాలో ఫీచర్లు చూస్తే మతిపోవాల్సిందే!

ఆగస్టు 15న మహీంద్రా బిగ్ బ్లాస్ట్.. 3 కొత్త SUVలు వచ్చేస్తున్నాయ్!

టీవీఎస్ నుంచి సూపర్ సర్‌ ప్రైజ్.. ఒకేసారి 3 మోడల్స్ వచ్చేస్తున్నాయ్!

కొత్త బ్రెజ్జా To హిలక్స్.. 10 రోజుల్లో 3 క్రేజీ మోడల్స్ ఎంట్రీ!

టెస్లా నుంచి పిల్లల కోసం కొత్త బైక్.. రేట్ ఎంత అంటే?

EV బ్యాటరీల్లో ఏది సేఫ్? కొనుగోలు చేసే ముందు ఈ విషయాలు తప్పకుండా తెలుసుకోవాల్సిందే!

Big Stories

Advertisement
×