E-Paper
Advertisement

Nissan Gravite MPV: నిస్సాన్ గ్రావైట్ MPV లాంచ్ డేట్ ఫిక్స్, డిజైన్, ఫీచర్లు చూస్తే వావ్ అనాల్సిందే!

Nissan Gravite MPV:  నిస్సాన్ గ్రావైట్ MPV లాంచ్ డేట్ ఫిక్స్, డిజైన్, ఫీచర్లు చూస్తే వావ్ అనాల్సిందే!
Advertisement

Nissan Gravite MPV Launch Date:  నిస్సాన్ నుంచి మరో మోడల్ కారు మార్కెట్ లోకి అడుగు పెట్టబోతోంది. నిస్సాన్ గ్రావైట్ MPV జనవరి 21న భారత్ లో విడుదల చేయనున్నట్లు కంపెనీ వెల్లడించింది. ఈ కారుతో మార్కెట్ లో మళ్లీ సత్తా చాటాలాని భావిస్తోంది. ఈ కారుతో పాటు కాంపాక్ట్ SUV అయిన, నిస్సాన్ టెక్టన్‌ను కూడా విడుదల చేయనున్నట్లు నిస్సాన్ ఇండియా MD సౌరభ్ వాట్స్ వెల్లడించారు. ఈ నేపథ్యంలో నిస్సాన్ గ్రావైట్ MPV డిజైన్, ఫీచర్లు, పవర్‌ ట్రెయిన్‌ గురించి కీలక విషయాలను ఇప్పుడు పరిశీలిద్దాం..

నిస్సాన్ గ్రావైట్ MPV డిజైన్

Advertisement

నిస్సాన్ గ్రావైట్ MPVకి సంబంధించి రీసెంట్ టీజర్ విడుదల అయ్యింది. కారు వెనుక భాగంతో పాటు ముందు భాగాన్ని రివీల్ చేసింది. ముందు భాగంలో, గ్రావైట్ మధ్యలో నిస్సాన్ లోగో ఉంది. ఇందులోని చంకీ, బ్లాక్ అవుట్ గ్రిల్‌, బానెట్‌పై గ్రావైట్ లెటరింగ్‌ను కలిగి ఉంది. బానెట్ కు కనెక్ట్ చేయబడిన DRL సిగ్నేచర్, బోనెట్ అంతా విస్తరించిన లైట్ బార్‌ను కూడా  ఉంటుంది. నిస్సాన్ గ్రావైట్ కారు ముందు బంపర్ వైపు చంకీ ఎయిర్ వెంట్స్‌ ను కలిగి ఉంది. ఈ కారు వెనుక భాగం ట్రైబర్‌ని పోలి ఉంటుంది. అయితే, ఇందులో వేరే టెయిల్‌ లైట్ యూనిట్, క్రోమ్ అప్లిక్‌తో చెక్కబడిన టెయిల్‌ గేట్, బంపర్‌పై బ్లాక్-అవుట్ గార్నిష్ ఉన్నాయి.

నిస్సాన్ గ్రావైట్ MPV ఫీచర్లు

Advertisement

తాజా టీజర్ నిస్సాన్ గ్రావైట్ MPV బయటి భాగాన్ని మాత్రమే చూపించింది. లోపలి భాగం గురించి ఎలాంటి వివరాలు చూపించలేదు. అయితే, ఇది రెనాల్ట్ ట్రైబర్ మాదిరిగానే డాష్‌బోర్డ్ లేఅవుట్‌ను కలిగి ఉంటుందని ఆటో నిపుణులు భావిస్తున్నారు. ట్రైబర్ నుండి వేరుగా ఉంచడానికి నిస్సాన్ ఇంటీరియర్‌ ను వేరే కలర్ తో రెడీ చేసినట్లు తెలుస్తోంది. ఫీచర్ల పరంగా, రాబోయే నిస్సాన్ MPV 7 అంగుళాల డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, 8 అంగుళాల టచ్‌ స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, వెనుక AC వెంట్స్, వైర్‌ లెస్ ఫోన్ ఛార్జింగ్ తో పాటు మరిన్ని ఫీచర్లను కలిగి ఉంటుందని ఆశిస్తున్నారు. దేశీ మార్కెట్ లో విడుదల కాబోయే నిస్సాన్ MPVలో ఆరు ఎయిర్‌ బ్యాగ్‌లు, హిల్ స్టార్ట్ అసిస్ట్, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్, ముందు, వెనుక పార్కింగ్ సెన్సార్లు, రియర్ వ్యూ కెమెరా కూడా ఉంటాయని నిపుణులు అంచనా వేస్తున్నారు.

నిస్సాన్ గ్రావైట్ MPV ఇంజిన్ స్పెసిఫికేషన్లు   

నిస్సాన్ గ్రావైట్ MPV డిజైన్, ఇంటీరియర్ లే అవుట్ మాదిరిగానే,  రెనాల్ట్ ట్రైబర్ మాదిరిగా 1.0-లీటర్ పెట్రోల్ ఇంజిన్‌తో వస్తుందని భావిస్తున్నారు. 1.0-లీటర్ పెట్రోల్ ఇంజిన్ 5 స్పీడ్ మాన్యువల్ లేదంటే 5 స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌ మిషన్ ఆప్షన్స్ తో రానున్నట్లు తెలుస్తోంది. ఈ ఇంజిన్ 76 hp పవర్,95 Nm టార్క్ ను ఉత్పత్తి చేస్తుందని భావిస్తున్నారు. ధర గురించి కంపెనీ ఇంకా ఎలాంటి ప్రకటన చేయలేదు. లాంచర్ రోజు పూర్తి వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.

Read Also: హ్యుందాయ్ లవర్స్ కు గుడ్ న్యూస్, క్రెటా ఎలక్ట్రిక్ కార్లపై భారీ డిస్కౌంట్!

Related News

మినీ సైజ్.. మ్యాక్సిమమ్ స్టైల్.. ఈ మైక్రో ఈవీలు భారత్‌లోకి వస్తే సూపర్ హిట్ పక్కా!

25 ఏళ్ల క్రితమే భారత్ లో పరుగులు తీసిన ఎలక్ట్రిక్ కారు.. మళ్లీ మార్కెట్ లోకి వస్తుందా?

లాంచ్‌కు ముందే క్రేజీ డీటైల్స్ లీక్.. కొత్త బ్రెజ్జాలో ఫీచర్లు చూస్తే మతిపోవాల్సిందే!

ఆగస్టు 15న మహీంద్రా బిగ్ బ్లాస్ట్.. 3 కొత్త SUVలు వచ్చేస్తున్నాయ్!

టీవీఎస్ నుంచి సూపర్ సర్‌ ప్రైజ్.. ఒకేసారి 3 మోడల్స్ వచ్చేస్తున్నాయ్!

కొత్త బ్రెజ్జా To హిలక్స్.. 10 రోజుల్లో 3 క్రేజీ మోడల్స్ ఎంట్రీ!

టెస్లా నుంచి పిల్లల కోసం కొత్త బైక్.. రేట్ ఎంత అంటే?

EV బ్యాటరీల్లో ఏది సేఫ్? కొనుగోలు చేసే ముందు ఈ విషయాలు తప్పకుండా తెలుసుకోవాల్సిందే!

Big Stories

Advertisement
×