E-Paper
Advertisement

Jaggareddy: జీవితంలో సంగారెడ్డిలో ఇక పోటీ చేయను.. రాహుల్ గాంధీ వచ్చినా కూడా..? జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు

Jaggareddy: జీవితంలో సంగారెడ్డిలో ఇక పోటీ చేయను.. రాహుల్ గాంధీ వచ్చినా కూడా..? జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు
Advertisement

తెలంగాణ రాజకీయాల్లో తనకంటూ ఒక ప్రత్యేక ముద్ర వేసుకున్న ఫైర్‌బ్రాండ్ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. నియోజకవర్గంలో ఏ కష్టం వచ్చినా ‘నేనున్నా’ అంటూ ముందుండే ఆయన, భవిష్యత్తు రాజకీయాలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇకపై తన జీవితంలో సంగారెడ్డి నుండి ఎమ్మెల్యేగా పోటీ చేయబోనని స్పష్టం చేస్తూ రాజకీయ వర్గాల్లో ప్రకంపనలు సృష్టించారు.

గత ఎన్నికల్లో తన ఓటమిపై జగ్గారెడ్డి తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. తన గెలుపు కోసం స్వయంగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ వచ్చి ప్రచారం చేసినా, స్థానిక ప్రజలు తనను ఓడించడాన్ని ఆయన జీర్ణించుకోలేకపోతున్నారు. ‘నా కోసం రాహుల్ గాంధీ వచ్చి ప్రచారం చేసినా నన్ను ఓడించారు. ఆయనను ఇక్కడికి పిలిపించి అవమానించానేమో అని నా మనసులో చాలా బాధగా ఉంది’ అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. రాహుల్ గాంధీ వంటి పెద్ద నాయకుడి ఇమేజ్‌కు తన ఓటమి వల్ల మచ్చ పడిందని ఆయన భావిస్తున్నారు.

Advertisement

నా ఓటమికి ఆ మేధావులే కారణం.. 

తన ఓటమికి గల కారణాలను విశ్లేషిస్తూ, నియోజకవర్గంలోని మేధావులపై జగ్గారెడ్డి విమర్శలు గుప్పించారు. సంగారెడ్డి అభివృద్ధికి, ప్రజల కష్టసుఖాల్లో పాలుపంచుకున్నప్పటికీ.. అక్కడి మేధావులే తనను ఓడించడంలో ప్రధాన పాత్ర పోషించారని ఆయన ఆరోపించారు. క్షేత్రస్థాయిలో తాను చేసిన సాయం కంటే, మేధావుల ఆలోచనా ధోరణి తనను దెబ్బతీసిందని ఆయన అభిప్రాయపడ్డారు.

Advertisement

నా భార్య పోటీ చేసినా.. నేను ప్రచారానికి రాను..

భవిష్యత్తులో సంగారెడ్డి రాజకీయాలకు తాను దూరంగా ఉంటానని చెబుతూనే, ఒక కీలక విషయాన్ని వెల్లడించారు. ఒకవేళ తన భార్య నిర్మలమ్మ సంగారెడ్డి నుండి పోటీ చేసినప్పటికీ, తాను మాత్రం ప్రచారంలో పాల్గొనబోనని తెగేసి చెప్పారు. ‘రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ కోసం ఎక్కడైనా ప్రచారం చేస్తా.. కానీ సంగారెడ్డి గడ్డపై మాత్రం అడుగుపెట్టి ప్రచారం చేయను’ అని ఆయన భీష్మించుకున్నారు.

నియోజకవర్గ ప్రజలతో ఉన్న పేగు బంధం తెగిపోకపోయినా.. రాజకీయంగా మాత్రం అక్కడి పరిస్థితులు తనను తీవ్రంగా కలిచివేసినట్లు ఆయన మాటలను బట్టి అర్థమవుతోంది. జగ్గారెడ్డి తీసుకున్న ఈ నిర్ణయం ఇప్పుడు ఉమ్మడి మెదక్ జిల్లా రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఈ సంచలన ప్రకటన తర్వాత కాంగ్రెస్ అధిష్టానం మరియు స్థానిక నాయకత్వం ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి.

ALSO READ: CM Revanth: చదువే నా ఫస్ట్ ప్రయారిటీ, జడ్చర్లలో ఐఐటీ నిర్మాణానికి సీఎం రేవంత్ శంకుస్థాపన

Related News

హైదరాబాద్ సిటీవాసులకు బిగ్ అలర్ట్.. మంగళవారం వరకు ట్రాఫిక్ ఆంక్షలు, ఏయే ఏరియాల్లో

టెక్కీ మృతి కేసులో సంచలన విషయాలు.. అనుక్షణం వెంటాడిన ఆ భయం.. తట్టుకోలేక అర్ధరాత్రి వేళ..

విమాన రంగానికి కొత్త కష్టాలు.. విమానాలపై లేజర్ దాడులు, శంషాబాద్ ఎయిర్‌పోర్టు నాలుగో స్థానం

ORRపై ఘోర విషాదం.. భారీ వర్షం తెచ్చిన ప్రమాదం.. రెండు కార్లు నుజ్జునుజ్జు, ఇద్దరు మృతి

తెలుగు రాష్ట్రాలకు వాతావరణ శాఖ అలర్ట్.. ఆ జిల్లాల్లో కుండపోత వర్షాలు.. ఐదు రోజులు ఇంతే!

Rajagopal Reddy: రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇవ్వాల్సిందే.. జగ్గారెడ్డి డిమాండ్!

Ramchander Rao: హైదరాబాద్‌ను మజ్లిస్ నడిపిస్తోంది.. రాంచందర్ రావు సంచలనం!

Kharif Farming: పాలమూరు జిల్లాలో ఎల్‌నినో దెబ్బ.. భూమిలోనే కుళ్ళిపోయిన పత్తి విత్తనాలు!

Big Stories

Advertisement
×