E-Paper
Advertisement

AR Rahman: నేను ముస్లిం.. రెహమాన్ పై పెరుగుతున్న నెగిటివిటీ.. ఆఖరికి ఏమన్నారంటే?

AR Rahman: నేను ముస్లిం.. రెహమాన్ పై పెరుగుతున్న నెగిటివిటీ.. ఆఖరికి ఏమన్నారంటే?
Advertisement

AR Rahman: ప్రముఖ ఆస్కార్ గ్రహీత ఏ.ఆర్.రెహమాన్ (AR Rahman) మతపరమైన వ్యాఖ్యలు చేసి నెటిజన్స్ ఆగ్రహానికి గురయ్యారు. కోలీవుడ్ ,టాలీవుడ్, బాలీవుడ్ అంటూ భాషతో సంబంధం లేకుండా మ్యూజిక్ డైరెక్టర్ గా భారీ పాపులారిటీ సొంతం చేసుకున్నారు ఏ ఆర్ రెహమాన్. పుట్టుకతోనే హిందూ అయినప్పటికీ ముస్లిం మతానికి మారిపోయాడు. అయితే తాను ముస్లిం అవడం వల్లే తనకు బాలీవుడ్ లో అవకాశాలు రాలేదంటూ చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ముఖ్యంగా నెటిజన్స్ కూడా ఆయనపై ఒక రేంజ్ లో మండిపడుతున్నారు.

నా మతం వల్లే ఎనిమిదేళ్లుగా నాకు అవకాశాల్లేవ్..

ఇదిలా ఉండగా ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఏ ఆర్ రెహమాన్ మాట్లాడుతూ..” బాంబే , దిల్ సే, రోజా వంటి సూపర్ హిట్ చిత్రాలకు సంగీతం అందించినప్పటికీ నేను బాలీవుడ్ లో అవుట్ సైడర్ లానే ఫీల్ అయ్యేవాడిని. కానీ తాల్ సినిమా పాటలు మాత్రం అందరూ ఇష్టపడ్డారు. ఎందుకంటే అందులో కొంత పంజాబీ, కొంత హిందీ మ్యూజిక్ మిక్స్ అయి ఉంటుంది. అప్పుడే నాకు పంజాబీ సంగీతంపై ఆసక్తి కలిగింది. అప్పుడే సుక్వీందర్ సింగ్ తో కలిసి చయ్యా చయ్యా , జై హో వంటి పాటలకు మ్యూజిక్ అందించాను. ఇవి ఇండస్ట్రీలో మంచి ఆదరణ అందుకున్నాయి. అయితే గత 8 ఏళ్లుగా నాకు బాలీవుడ్లో అవకాశాలు తగ్గిపోయాయి దీనికి కారణం నా మతం కావచ్చు అంటూ సంచలన కామెంట్లు చేశారు ఏ ఆర్ రెహమాన్.

రెహమాన్ పై మండిపడుతున్న నెటిజన్స్..

Advertisement

దీంతో నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా దుమ్మెత్తి పోస్తున్నారు. మతమే అడ్డంకైతే ఇండస్ట్రీలో ఇన్ని అవకాశాలు వచ్చేవే కాదు. అసలు రామాయణం మూవీలో ఛాన్స్ నీ మతం చూసి నీకు ఇచ్చారా? అంటూ మండిపడుతున్నారు.

నెగిటివిటీపై రెహమాన్ క్లారిటీ..

అయితే తనపై నెగెటివిటీ పెరిగిపోతున్న నేపథ్యంలో ఎట్టకేలకు దిగివచ్చిన ఏఆర్ రెహమాన్ తాను ఎందుకు అలాంటి మాటలు మాట్లాడాల్సి వచ్చిందో వివరణ ఇచ్చారు. “నేను బ్రాహ్మణ పాఠశాలలో చదువుకున్నాను. అలాగే ప్రతి సంవత్సరం మాకు రామాయణం, మహాభారతం ఉండేవి. కాబట్టి ఈ రెండు గ్రంథాలపై నాకు పట్టు ఉంది. వీటి కథ నాకు తెలుసు. ఒక వ్యక్తి ఎంత సద్గుణవంతుడు.. ఉన్నతమైనవాడు అనే దాని గురించి ఈ కథ చెబుతుంది. ముఖ్యంగా అన్ని మంచి విషయాలను మనం నేర్చుకోగలగాలి.. మంచి విషయం ఏదైనా విలువైనదిగానే భావిస్తాను. ఇక మతం అంటారా..సంకుచిత మనస్తత్వం , పైకి ఎదగాలని స్వార్థం.. అందరిలో పెరిగిపోయింది. అందుకే నేను ఇలాంటి వ్యాఖ్యలు చేయాల్సి వచ్చింది.ఇక రామాయణం పై నాకు పట్టు ఉంది కాబట్టే ఈ సినిమాకు నేను పని చేస్తున్నాను. ఇక్కడ మతంతో పనిలేదు” అంటూ క్లారిటీ ఇచ్చారు.

Advertisement

ALSO READ:Euphoria Trailer: వాస్తవికతకు అద్దంపట్టేలా యుఫోరియా ట్రైలర్!

Related News

టాక్సిక్ ..500కోట్లు అయ్యే పనేనా ?

మా ఆయన కోసమే గాయమైనట్టుంది… పెళ్లి తర్వాత మూడు నెలలు కలవలేదంటూ!

శ్రీకృష్ణుడిగా రౌడీ హీరో విజయ్ దేవరకొండ.. దిల్ రాజు క్రేజీ రీమేక్ ప్లాన్

బన్నీ ట్రిపుల్ రోల్‌పై కొత్త ట్విస్ట్.. ‘రాకా’ కథ మొత్తం మారిపోయిందా?

డెనిమ్‌లో మాల్వి మల్హోత్రా.. బ్లూ బ్యూటీని చూస్తే చూపు తిప్పుకోవడం కష్టమే!

ఇరుముడి బాక్సాఫీస్ రన్.. రూ.300 కోట్లు సాధ్యమేనా?

ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి కొడుకు కేసులో బిగ్ ట్విస్ట్…

ఇరుముడి సీక్వెల్ సినిమాలో రామ్ చరణ్.. ఫాన్స్ కు పూనకాలే!

Big Stories

Advertisement
×