E-Paper
Advertisement

Nissan Magnite vs Tata Punch: నిస్సాన్ మాగ్నైట్ vs టాటా పంచ్.. దేని సత్తా ఎంత?

Nissan Magnite vs Tata Punch: నిస్సాన్ మాగ్నైట్ vs టాటా పంచ్.. దేని సత్తా ఎంత?
Advertisement

Nissan Magnite vs Tata Punch Comparison: భారతీయ ఆటో మార్కెట్ లో ఎంట్రీ లెవర్ SUV విభాగంలో పలు కార్లు అందుబాటులో ఉన్నాయి. వాటిలో నిస్సాన్ మాగ్నైట్, టాటా పంచ్ ప్రధాన పోటీదారులుగా కొనసాగుతున్నాయి. మాగ్నైట్ శక్తివంతమైన టర్బో ఇంజన్, ఎక్కువ స్పేస్, టెక్కీ లుక్‌ తో వస్తే, టాటా పంచ్ 5 స్టార్ సేఫ్టీ రేటింగ్, ప్రీమియం ఇంటీరియర్, స్టర్డీ బిల్డ్ క్వాలిటీతో వస్తుంది. మాగ్నైట్ రూ. 5.62 లక్షల ధర కలిగి ఉంటే, పంచ్ రూ. 5.60 లక్షలు ఉంటుంది. మాగ్నైట్ తో పోల్చితే పంచ్ కాస్త చౌకగా ఉంటుంది. ఇంతకీ ఈ రెండు కార్ల ఫీచర్లు, ఇంజిన్, మైలేజ్ సహా ఇతర అంశాలు ఎలా ఉన్నాయి? అనేది ఇప్పుడు తెలుసుకుందా..

నిస్సాన్ మాగ్నైట్ vs టాటా పంచ్ పోలికలు

⦿ ఇంజన్ పనితీరు

Advertisement

నిస్సాన్ మాగ్నైట్: ఈ కారు  1.0L పెట్రోల్ (72 PS), 1.0L టర్బో పెట్రోల్ (100 PS) ఆప్షన్లతో వస్తుంది. టర్బో వేరియంట్ మంచి పికప్ తో పాటు మైలేజ్ ను ఇస్తుంది.

పంచ్: 1.2L నాచురల్ ఆస్పిరేటెడ్ పెట్రోల్ (86 PS) ఇంజన్‌ తో వస్తుంది. ఇది సిటీ డ్రైవింగ్‌ కు అనుకూలంగా ఉంటుంది. ఈ కారులో టర్బో ఇంజిన్ ఆప్షన్ లేదు.

Advertisement

⦿ సేఫ్టీ రేటింగ్

పంచ్: ఈ కారు 5 స్టార్ గ్లోబల్ NCAP రేటింగ్ ను కలిగి ఉంటుంది. భద్రత విషయంలో ఎక్కవ మెరుగ్గా ఉంటుంది.

మాగ్నైట్: ఈ కారులో  6 ఎయిర్‌ బ్యాగ్‌లు, 4-స్టార్ భద్రతా రేటింగ్‌ ను కలిగి ఉంటుంది.

Read Also: 2026 రెనాల్ట్ డస్టర్ vs మారుతి సుజుకి విక్టోరిస్.. వీటిలో ఏది బెస్ట్ కారు అంటే?

⦿ స్పేస్, సౌకర్యం

మాగ్నైట్: ఎక్కువ వెనుక సీటు లెగ్‌ రూమ్ ను కలిగి ఉంటుంది. 336 లీటర్ల బూట్ స్పేస్ ఉంటుంది.

పంచ్: 366 లీటర్ల పెద్ద బూట్ స్పేస్ ను కలిగి ఉంటుంది.  ప్రీమియం ఇంటీరియర్, 10.25 అంగుళాల ఇన్ఫోటైన్‌ మెంట్ సిస్టమ్‌ తో వస్తుంది.

⦿ధర

టాటా పంచ్ ప్రారంభ ధర తక్కువగా ఉన్నప్పటికీ, మాగ్నైట్ ఆటోమేటిక్ (CVT) వేరియంట్లు బడ్జెట్‌ ధరలోనే అందుబాటులో ఉంటాయి.

ఏ కారు ఎవరికి అనుకూలంగా ఉంటుందంటే?

ఒకవేళ మీకు పవర్, మంచి స్పేస్ కావాలంటే.. నిస్సాన్ మాగ్నైట్ ను సెలెక్ట్ చేసుకోవడం మంచిది. అలా కాదని, మీకు మంచి సేఫ్టీ, అద్భుతమైన బిల్డ్ క్వాలిటీ కావాలంటే టాటా పంచ్ ఎంచుకోవడం మంచిది. సో, మీకు ఏ కారు నచ్చింది? ఎందుకు? అనేది చెప్పండి!

Read Also: ఏడాదిలో 7.6 లక్షల కార్ల అమ్మకం.. హ్యుందాయ్ సంచలనం!

Related News

మినీ సైజ్.. మ్యాక్సిమమ్ స్టైల్.. ఈ మైక్రో ఈవీలు భారత్‌లోకి వస్తే సూపర్ హిట్ పక్కా!

25 ఏళ్ల క్రితమే భారత్ లో పరుగులు తీసిన ఎలక్ట్రిక్ కారు.. మళ్లీ మార్కెట్ లోకి వస్తుందా?

లాంచ్‌కు ముందే క్రేజీ డీటైల్స్ లీక్.. కొత్త బ్రెజ్జాలో ఫీచర్లు చూస్తే మతిపోవాల్సిందే!

ఆగస్టు 15న మహీంద్రా బిగ్ బ్లాస్ట్.. 3 కొత్త SUVలు వచ్చేస్తున్నాయ్!

టీవీఎస్ నుంచి సూపర్ సర్‌ ప్రైజ్.. ఒకేసారి 3 మోడల్స్ వచ్చేస్తున్నాయ్!

కొత్త బ్రెజ్జా To హిలక్స్.. 10 రోజుల్లో 3 క్రేజీ మోడల్స్ ఎంట్రీ!

టెస్లా నుంచి పిల్లల కోసం కొత్త బైక్.. రేట్ ఎంత అంటే?

EV బ్యాటరీల్లో ఏది సేఫ్? కొనుగోలు చేసే ముందు ఈ విషయాలు తప్పకుండా తెలుసుకోవాల్సిందే!

Big Stories

Advertisement
×