E-Paper
Advertisement

Norton Atlas: లాంచ్ కు ముందే నార్టన్ అట్లాస్ స్పై షాట్స్ లీక్.. చూడ్డానికి భలే ఉందిగా!

Norton Atlas: లాంచ్ కు ముందే నార్టన్ అట్లాస్ స్పై షాట్స్ లీక్.. చూడ్డానికి భలే ఉందిగా!
Advertisement

Norton Atlas Spy Shots Viral: బ్రిటిష్ ప్రీమియం టూ వీలర్ కంపెనీ నార్టన్ మోర్టార్ సైకిల్ కు చెందిన కొత్త అడ్వెంచర్ బైక్ నార్టన్ అట్లాస్ తాజాగా భారత రోడ్లపై టెస్టింగ్ చేస్తూ కనిపించింది. ఈ బైక్ కు సంబంధించిన స్పై షాట్లు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. బైక్ ప్రియులను క్రేజీగా ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా అడ్వెంచర్, టూరింగ్ బైక్‌లను ఇష్టపడే వారికి ఇంకా అలరిస్తున్నాయి. ఈ బైక్ 2026 సెకెండాఫ్ లో ఇండియన్ మార్కెట్లో విడుదలయ్యే అవకాశం ఉంది.

రెండు వేరియంట్లలో అందుబాటులోకి!

నార్టన్ ఈ అట్లాస్ ఈ మోడల్ ను రెండు వేరియంట్లలో తీసుకురానుంది. అందులో ఒకటి ఆఫ్ రోడ్ ప్రయాణాలకు అనువైన స్టాండర్డ్ అట్లాస్ కాగా, మరొకటి రోడ్డు ప్రయాణాలకు ఫోకస్ చేసిన అట్లాస్ GT. రెండు మోడళ్ల డిజైన్, వీల్ సెటప్‌ లో కొంత తేడా ఉండే అవకాశం ఉంది.

Advertisement

టెస్టింగ్ టైమ్ లో కనిపించిన బైక్‌ ను బట్టి చూస్తే, దీనికి ముందు వైపు 19 అంగుళాల అల్లాయ్ వీల్ ఉన్నట్లు కనిపిస్తోంది.     EICMA 2025లో కంపెనీ ఈ బైక్‌ను ప్రదర్శించినప్పుడు స్టాండర్డ్ అట్లాస్ మోడల్‌ లో ముందువైపు 19 అంగుళాల, వెనుకవైపు 17 అంగుళాల క్రాస్ స్పోక్ వీల్స్ ఉన్నాయి. ఇప్పుడు భారత మార్కెట్ కోసం ఖర్చును తగ్గించేందుకు అల్లాయ్ వీల్స్‌ ను కూడా ఆప్షన్‌ గా ఇవ్వొచ్చని అంచనా వేస్తున్నారు. టెస్టింగ్ కోసం కంపెనీ టెంపరరీగా అల్లాయ్ వీల్స్‌ ను ఉపయోగించే అవకాశం ఉందని భావిస్తున్నారు. మరోవైపు అట్లాస్ GT మోడల్‌ లో ముందు, వెనుక రెండు వైపులా 17 అంగుళాల అల్లాయ్ వీల్స్ ఉండే అవకాశం ఉందని సమాచారం.

ఇంజిన్ గురించి..

ఈ బైక్‌లో 585cc లిక్విడ్ కూల్డ్ ప్యారలల్ ట్విన్ ఇంజిన్‌ ను ఉపయోగించారు. ఈ ఇంజిన్ సుమారు 70bhp పవర్‌ ను ఉత్పత్తి చేస్తుందని తెలుస్తోంది. హైవే రైడింగ్‌ తో పాటు అడ్వెంచర్ టూరింగ్‌ కు కూడా సరిపడే పర్ఫార్మెన్స్ ను కలిగి ఉంటుందని తెలుస్తోంది.

ఫీచర్ల గురించి..

Advertisement

ఫీచర్ల పరంగా కూడా నార్టన్ అట్లాస్ ప్రీమియం సెగ్మెంట్‌ కు తగ్గట్టే ఉండనుంది. ఇందులో 8 అంగుళాల TFT డిస్‌ ప్లే ఇవ్వనున్నారు. ఈ స్క్రీన్‌ లో కనెక్టెడ్ ఫీచర్లు కూడా ఉండనున్నాయి. పలు రైడింగ్ మోడ్‌ లు ఉంటాయి. క్రూయిజ్ కంట్రోల్, ట్రాక్షన్ కంట్రోల్ లాంటి లేటెస్ట్ ఫీచర్లు కూడా ఈ బైక్‌లో ఉండనున్నాయి. దీని వల్ల సుదూర ప్రయాణాల్లో రైడర్లకు మరింత సౌకర్యం లభించనుంది.  ఇటీవల కంపెనీ ఈ అట్లాస్ శ్రేణికి సంబంధించిన కలర్ ఆప్షన్లను కూడా వెల్లడించింది. ఈ అడ్వెంచర్ బైక్‌ ను మొత్తం ఐదు కలర్ ఆప్షన్స్ లో తీసుకురానున్నట్లు వెల్లడించింది. యువతతో పాటు ప్రీమియం బైక్ ప్రియులను ఆకట్టుకునేలా ప్లాన్ చేస్తోంది.

Read Also: తక్కువ ఖర్చుతో ఎక్కువ రేంజ్.. ప్రస్తుతం ట్రెండింగ్‌లో ఉన్న ఎలక్ట్రిక్ స్కూటర్లు ఇవే!

Related News

తక్కువ ధర.. ఎక్కువ మైలేజ్.. మధ్యతరగతి కుటుంబాలకు బెస్ట్ కార్లు!

కార్ల కంపెనీల దగ్గరే చవకగా సెకండ్ హ్యాండ్ కార్లు కొనేయొచ్చు.. జస్ట్ ఇలా చేస్తే చాలు!

హ్యుందాయ్ బౌల్డర్ కు పేటెంట్.. రగ్గడ్ లుక్‌ లో అదిరిపోయిందిగా!

విన్‌ ఫాస్ట్ డబుల్ సర్‌ ప్రైజ్.. కొత్త ఈ-స్కూటర్, ఈ-బైక్‌కు పేటెంట్!

టాటా అవిన్యా X టెస్టింగ్ షురూ.. నెట్టింట వైరల్ అవుతున్న స్పై షాట్స్!

థార్‌ కు నెక్స్ట్ లెవల్ అవతారం.. విజన్ T వచ్చేస్తోంది!

మినీ సైజ్.. మ్యాక్సిమమ్ స్టైల్.. ఈ మైక్రో ఈవీలు భారత్‌లోకి వస్తే సూపర్ హిట్ పక్కా!

25 ఏళ్ల క్రితమే భారత్ లో పరుగులు తీసిన ఎలక్ట్రిక్ కారు.. మళ్లీ మార్కెట్ లోకి వస్తుందా?

Big Stories

Advertisement
×