E-Paper
Advertisement

భూమి కింద ఉండే వింత నగరం.. ఇక్కడ ఇళ్లు, చర్చిలు అన్నీ భూగర్భంలోనే!

భూమి కింద ఉండే వింత నగరం.. ఇక్కడ ఇళ్లు, చర్చిలు అన్నీ భూగర్భంలోనే!
Advertisement

Underground City: అబ్బా.. ఎండలు మండిపోతున్నాయిరా నాయనా అని కాస్త ఎండ రాగానే ఏసీలు ఆన్ చేసేస్తాం కదా? కానీ ఒక ఊరి జనాలు మాత్రం.. ‘ఏసీ బిల్లులు మనకెందుకు దండగ.. పదండి భూమి లోపలికి దూరిపోదాం!’ అంటున్నారు. వినడానికి ఏదో హాలీవుడ్ గ్రాఫిక్స్ సినిమా కథలా ఉందేంటి అనుకుంటున్నారా? కానీ ఇది అక్షరాలా నిజం. ఆస్ట్రేలియాలోని ‘కూబర్ పెడీ (Coober Pedy)’ అనే ఊరి ముచ్చట ఇది. పైన చూస్తే అంతా బోసిపోయిన ఎడారి.. కానీ లోపల చూస్తే మైండ్ బ్లోయింగ్ అండర్ గ్రౌండ్ సామ్రాజ్యం!

భూమి లోపల బుక్ స్టోర్

Advertisement

ఈ ఊళ్లో సమ్మర్ వచ్చిందంటే చాలు.. భానుడు 50°C ఎండతో మాడ్చేస్తుంటాడు. దాంతో విసిగిపోయిన జనాలు, ‘నువ్వు పైన ఉండి ఎంతైనా తగలబెట్టుకో.. మేము లోపలికి వెళ్తున్నాం’ అంటూ ఏకంగా భూమిని తవ్వేసి ఇళ్లు కట్టేసుకున్నారు. కేవలం ఇళ్లే కాదు బాబోయ్.. హోటళ్లు, రెస్టారెంట్లు, బార్లు, చర్చిలు.. చివరకు బుక్ స్టోర్లు కూడా భూమి కిందే ఉన్నాయి. బయట ఎండ దంచికొడుతున్నా, ఈ అండర్ గ్రౌండ్ ఇళ్లల్లో మాత్రం ఏసీ లేకపోయినా 24°C చల్లదనంతో నేచురల్ ఏసీ రూముల్లా భలే హాయిగా ఉంటాయి.

టూరిస్ట్ స్పాట్

Advertisement

అసలు వీళ్లంతా ఇక్కడికి ఎందుకొచ్చారంటే.. ఇదొక మైనింగ్ ఏరియా. ఈ ప్రాంతాన్ని ‘ప్రపంచపు ఓపల్ రాజధాని’ (Opal Capital of the World) అని పిలుస్తారు. ఓపల్ అంటే ఒక రకమైన ఖరీదైన నవరత్నం. వీటిని తవ్వడం కోసం వందల ఏళ్ల క్రితం ఇక్కడికి వచ్చిన మైగ్రెట్స్, పైన ఉండలేక ఆ గనులనే ఇల్లుగా మార్చేసుకున్నారు. అలా మొదలైన ఈ ‘దుంపల బతుకు’ ఇప్పుడు పెద్ద టూరిస్ట్ స్పాట్ అయిపోయింది.

రాత్రికి రాత్రే కోటీశ్వరులు

ఈ ఊళ్లో ఇల్లు కట్టుకోవడం కూడా చాలా కామెడీగా ఉంటుంది. మీకు ఇంకో బెడ్‌రూమ్ కావాలా? పార, పికాసి తీసుకుని గోడను కాస్త గట్టిగా తవ్వేయడమే.. కొత్త రూమ్ రెడీ! పైగా అలా తవ్వుతున్నప్పుడు అదృష్టం బాగుండి ఏదైనా ఓపల్ రత్నం దొరికిందనుకోండి.. రాత్రికి రాత్రే కోటీశ్వరులు అయిపోవచ్చు కూడా. ఫుల్ ఎండల నుంచి తప్పించుకోవడానికి వీళ్లు కనిపెట్టిన ఈ దేశీ జుగాడ్.. ఇప్పుడు ప్రపంచంలోనే అత్యంత వింతైన నగరాల్లో ఒకటిగా నిలిచింది. కాబట్టి ఎప్పుడైనా ఆస్ట్రేలియా వెళ్తే.. కాస్త లోపలికి తొంగిచూడటం మర్చిపోకండి!

Also Read: సిమెంట్ లేదు.. ఇటుకలు లేవు.. మరి ఈ ఇళ్లు వేల ఏళ్లుగా ఎలా నిలబడ్డాయి?

Related News

విదేశాల్లో పెళ్లిళ్లు వద్దంటూ పిలుపునిచ్చిన మోదీ.. ఇండియాలో సెలెబ్రిటీ వెడ్డింగ్ డెస్టినేషన్స్ ఇవే

అమరావతి ఓవైపు.. ఫ్యూచర్ సిటీ మరోవైపు.. దక్షిణ భారత ముఖచిత్రాన్ని మార్చబోతున్న రెండు మెగా నగరాలు!

రాత్రి 9 తర్వాత నో ఎంట్రీకి చెక్.. శ్రీశైలానికి 24/7 రూట్ క్లియర్!

కారు, మెట్రో కాదు.. ఇంటికి వెళ్లాలంటే నదిలో దూకాల్సిందే!

నేపాల్ వరదల్లో నమ్మశక్యం కాని ఘటనలు.. ప్రపంచాన్నే ఆశ్చర్యపరిచిన 6 అద్భుతాలు..!

ఒకే బిల్డింగ్‌లో ఊరంతా.. ఈ వింత చూస్తే షాక్ అవ్వాల్సిందే!

గాల్లో తేలే పుస్తకాలు.. చుట్టూ అద్దాల మాయ.. ప్రపంచాన్ని అబ్బురపరుస్తున్న ఫ్యూచరిస్టిక్ లైబ్రరీ!

27 సార్లు గర్భం.. 69 మంది పిల్లలు.. ప్రపంచంలోనే ఎక్కువ మంది పిల్లల్ని కన్న తల్లి ఈమే!

Big Stories

Advertisement
×