E-Paper
Advertisement

15 రోజుల్లో 25 వేల బుకింగ్స్.. ఓబెన్ కొత్త ఎలక్ట్రిక్ బైక్‌ కు ఊహించని స్పందన!

15 రోజుల్లో 25 వేల బుకింగ్స్.. ఓబెన్ కొత్త ఎలక్ట్రిక్ బైక్‌ కు ఊహించని స్పందన!
Advertisement

Oben Rorr EZ Bookings: బెంగళూరుకు చెందిన ఎలక్ట్రిక్ టూ వీలర్ కంపెనీ ఓబెన్ ఎలక్ట్రిక్ తన కొత్త బైక్  ఓబెన్ రోర్ ఎవోకు కొనుగోలుదారుల నుంచి మంచి స్పందన లభిస్తోంది. ఈ ఎలక్ట్రిక్ బైక్ విడుదలైన కేవలం 15 రోజుల్లోనే 25 వేలకుపైగా బుకింగ్స్ వచ్చాయని కంపెనీ తెలిపింది. అంచనాలకు మించి స్పందన రావడంతో కంపెనీ సంతోషం వ్యక్తం చేసింది.

జూన్ 2026 నుంచి డెలివరీలు ప్రారంభం

రోర్ ఎవో డెలివరీలు జూన్ 2026 నుంచి ప్రారంభం కానున్నట్లు ఓబెన్ ఎలక్ట్రిక్ కంపెనీ వెల్లడించింది. అలాగే, కస్టమర్లు అధికారిక వెబ్‌ సైట్ ద్వారా చెల్లింపులు చేసే సౌకర్యాన్ని కూడా  ప్రారంభించింది. మొదటి 10 వేల మంది వినియోగదారులకు ప్రత్యేక ప్రారంభ ధరగా రూ.99,999 (ఎక్స్‌ షోరూమ్‌)గా నిర్ణయించింది. ఆ తర్వాత ఈ బైక్ ధర రూ.1.24 లక్షలకు పెరగనుంది.

18 రాష్ట్రాల్లో కార్యకలాపాలు

Advertisement

ఓబెన్ ఎలక్ట్రిక్ ప్రస్తుతం దేశంలోని 18 రాష్ట్రాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తోంది. 100కి పైగా నగరాల్లో 150కు పైగా షోరూమ్‌లు, సర్వీస్ సెంటర్లు ఏర్పాటు చేసింది. వచ్చే ఆర్థిక సంవత్సరం ముగిసేలోపు మరో 200 కొత్త షోరూమ్‌లను ప్రారంభించాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది. అంతేకాదు, బ్యాటరీలు, మోటార్లు, ఛార్జర్లు, వెహికల్ కంట్రోల్ యూనిట్లు, సాఫ్ట్‌ వేర్ లాంటి కీలక భాగాలను సొంతంగానే తయారు చేస్తోంది. అందుకే వాహనాల నాణ్యతపై పూర్తి నియంత్రణ సాధ్యమవుతోందని కంపెనీ వెల్లడించింది. ప్రస్తుతం ఉన్న తయారీ కేంద్రంలో సంవత్సరానికి లక్ష యూనిట్ల వరకు ఉత్పత్తి చేసే సామర్థ్యం ఉందని వెల్లడించింది.

ఓబెన్ రోర్ ఎవో గురించి..

ఓబెన్ రోర్ ఎవోలో 9 kW పవర్ ఉత్పత్తి చేసే IPMSM ఎలక్ట్రిక్ మోటార్‌ ను అమర్చారు. ఈ బైక్ 250 Nm వీల్ టార్క్‌ ను అందిస్తుంది. 3.4 kWh LFP బ్యాటరీ ప్యాక్‌ తో వచ్చే ఈ బైక్, ఒకసారి పూర్తి ఛార్జ్ చేస్తే 180 కిలోమీటర్ల వరకు ప్రయాణిస్తుందని కంపెనీ వెల్లడించింది. పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే, ఈ బైక్ కేవలం 3 సెకన్లలోనే గంటకు 0 నుంచి 40 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. గరిష్టంగా గంటకు 110 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉండటంతో బ్యాటరీని 90 నిమిషాల్లో 0 నుంచి 80 శాతం వరకు ఛార్జ్ చేసే అవకాశం ఉంటుంది.

అత్యాధునిక ఫీచర్లు

Advertisement

ఫీచర్ల పరంగా కూడా రోర్ ఎవో ఆకట్టుకుంటోంది. ఇందులో 5 అంగుళాల TFT డిస్‌ప్లే, OTA అప్‌ డేట్లు, టర్న్ బై టర్న్ నావిగేషన్, జియో ఫెన్సింగ్, రిమోట్ ఇమ్మొబిలైజేషన్, ఫాల్ డిటెక్షన్‌ తో SOS అలర్ట్ లాంటి స్మార్ట్ ఫీచర్లు ఉన్నాయి. అదనంగా స్మార్ట్ ఐక్యూ టెక్నాలజీ ద్వారా రేంజ్‌ను 15 శాతం వరకు పెంచుకునే అవకాశం ఉందని కంపెనీ తెలిపింది.

Read Also: ఒకే ఛార్జ్‌ తో 240 కిమీ రేంజ్.. భారత్‌లో అత్యధిక రేంజ్ ఇచ్చే 5 ఎలక్ట్రిక్ స్కూటర్లు!

Related News

విడా నుంచి కొత్త ఎలక్ట్రిక్ బైక్.. జస్ట్ 100 యూనిట్లే!

కొత్త రెనాల్ట్ డస్టర్ హైబ్రిడ్ వచ్చేసింది, మైలేజ్ ఎంతో తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే!

రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 650 హైపర్‌ షిఫ్ట్ విడుదల.. ధర ఎంత? ఫీచర్లు ఎలా ఉన్నాయంటే?

ఆడి Q3 అదిరిపోయే ఎంట్రీ.. సేఫ్టీ ఫీచర్లు చూస్తే షాకవ్వాల్సిందే!

టీఎఫ్‌టీ డిస్‌ప్లే, ట్రాక్షన్ కంట్రోల్.. హీరో ఎక్స్‌ ట్రీమ్ 250ఆర్ కార్బన్ అదిరింది గురూ!

ఇండియన్ మార్కెట్ లో ఇక ఈ కారు కనిపించదు, MG ఎందుకు ఈ నిర్ణయం తీసుకుందంటే?

హీరో ఎక్స్‌ ట్రీమ్ 160R 4V కొత్త మోడల్ వచ్చేసింది, ఫీచర్లు చూస్తే మతిపోవాల్సిందే!

హోండా 0 ఆల్ఫా SUV లాంచ్ డేట్ ఫిక్స్.. రేంజ్, ఫీచర్లు చూస్తే పిచ్చెక్కిపోవాల్సిందే!

Big Stories

Advertisement
×